6589 SBI క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6589 ఖాళీలకు జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్)అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి ఆగస్టు 6 నుండి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. ఆగష్టు 26, 2025 లోపల ఆశక్తి ఉండి గ్రాడ్యుయేషన్ చేసిన 20 నుండి 28 సంవత్సరాల మధ్య ( నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది) వయస్సు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైటు https://sbi.co.in/web/careersలో అప్లై చేసుకోవచ్చు

అర్హత కలిగిన అభ్యర్థులను మూడు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు – ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్షమరియు భాషా ప్రావీణ్యత పరీక్ష . స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025-26 నియామక సంవత్సరానికి 6589 క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది

SBI క్లర్క్ 2025 పరీక్ష అవలోకనం

సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
పోస్ట్ పేరు క్లర్క్ (జూనియర్ అసోసియేట్)
ఖాళీలు 6589 (5180 రెగ్యులర్ & 1409 బ్యాక్‌లాగ్)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖాళీలు. 315 (బ్యాక్‌లాగ్ పోస్టులతో కలిపి)

తెలంగాణలో ఖాలీలు 320 (బ్యాక్‌లాగ్ పోస్టులతో కలిపి)
అప్లికేషన్ మోడ్ ఆన్‌లైన్
నియామక ప్రక్రియ ప్రిలిమ్స్- మెయిన్స్- భాషా ప్రావీణ్య పరీక్ష
పరీక్ష మాధ్యమం. తెలుగు రాష్ట్రాలలో హింది, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ
పరీక్ష సెంటర్లు: ఆంధ్ర ప్రదేశ్ లో 11
తెలంగాణలో 4
విద్యార్హత గ్రాడ్యుయేషన్
వయోపరిమితి 20 నుండి 28 సంవత్సరాలు
జీతం రూ. 46,000 (సుమారుగా)
అప్లికేషన్ ఫీసు రు.750/- ( SC/ST/PWD లింకు ధరకాస్తు రుసుము లేదు)
అధికారిక వెబ్‌సైట్ http://sbi.co.in/,

https://sbi.co.in/web/careers
ఇంటర్ సర్కిల్/ఇంటర్ స్టేట్ ట్రాన్శఫర్.. సాధారణ పరిస్థితుల్లో అనుమతించబడదు
OBC రిజర్వేషన్ నాన్- క్రిమిలేయర్ OBC సర్టిఫికెట్ 01-04-2025 తరువాతిదై ఉండాలి.
స్క్రైబ్ సదుపాయం. 40% లేదు అంతకంటే ఎక్కువ అంగవైకల్యం కలిగి త్వరిత గతిన రాయలేని వారి అభ్యర్ధన పరిగణింపబడుతుంది
మల్టిపుల్ అప్లికేషన్ల అవకాశం. ఒక అభ్యర్థి వివిధ ప్రాంతాలలో సమర్పించిన ట్రైనీ చిట్టచివరి అప్లికేషన్ మాత్రమే పరిగణింపబడుతుంది
అప్లికేషన్లో కరెక్టన్ : సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తరువాత అవకాశము లేదు.
ప్రొబేషన్ కాలం సాధారణంగా ఆరు నెలలు
ప్రాంతీయ భాష ఒక్కటి మాత్రమే ఎంచుకోవాలి
ఎడ్వర్టైజ్మెంట్.నం సి.ఆర్.పి.డి/సి.ఆర్/2025-26/06
హెల్ప్ డెస్క్022-22820427 ( బ్యాంక్ పనిచేసే రోజులలో 11-00 గం|| ఏ ఎమ్ నుండి 5-00పిమ్ వరకు
సలహలకు మరియు కంప్లైంట్ నివారణకు సంంప్రదించవలసిన వెబ్సైట్ http:// cgrs.ibps.in.
👍అప్లై చెయ్యడానికి చివరి తేది👍👍👍2025 ఆగస్టు 26 వరకు

పోస్ట్ పేరు: క్లర్క్ (జూనియర్ అసోసియేట్)

ఖాళీలు : 6589 (5180 రెగ్యులర్ & 1409 బ్యాక్‌లాగ్)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖాళీలు:. 315 (బ్యాక్‌లాగ్ పోస్టులతో కలిపి)

తెలంగాణలో ఖాలీలు: 320 (బ్యాక్‌లాగ్ పోస్టులతో కలిపి)

రెగ్యులర్ ఖాళీలు

రాష్ట్రంమొత్తంఖాళీలుజనరల్ఎస్సీఎస్టీఓబీసీఆర్థికంగా వెనకబడిన వారు
ఆంధ్రప్రదేశ్31012649218331
తెలంగాణ25010140176725
మొత్తం518022557884501179508

బ్యాక్ లాగ్ ఖళీలు

రాష్ట్రంమొత్తంఖాళీలుఎస్సీఎస్టీఓబీసీPWBDXS
ఆంధ్రప్రదేశ్532
తెలంగాణ701258
మొత్తం14099122686196810
విద్యా అర్హతలు (31/12/2025 నాటికి)గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో చెల్లుబాటు అయ్యే గ్రాడ్యుయేషన్ డిగ్రీ (UG) కలిగి ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులు IDD ఉత్తీర్ణత తేదీని నిర్ధారించుకోవాలి.

గమనిక: గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం/సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా SBI క్లర్క్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. తాత్కాలికంగా ఎంపికైతే, వారు గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని రుజువును సమర్పించాల్సి ఉంటుంది.
వయోపరిమితి (01/04/2025 నాటికి)20 సంవత్సరాల కంటే తక్కువ మరియు 28 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండరాదు.

అభ్యర్థులు 02.04.1997 కంటే ముందు మరియు 01.04.2005 కంటే తరువాత (రెండు రోజులు కలుపుకొని) జన్మించి ఉండాలి.
దరఖాస్తు రుసుముఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుడికి— లేదు

జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యూఎస్కి— రూ. 750/- (యాప్. ఫీజు, ఇంటిమేషన్ ఛార్జీలతో సహా)
జీతం & పే స్కేల్SBI క్లర్క్ ప్రారంభ జీతం దాదాపు రూ. 46000

మరియు పే స్కేల్ రూ. 24050-1340/3-28070-1650/3-33020-2000/4-41020-2340/7-57400-4400/1-61800-2680/1-64480. ప్రారంభ బేసిక్ పే రూ. 26730/- (గ్రాడ్యుయేట్లకు అనుమతించబడిన రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు రూ. 24050/-).

వయోపరిమితి సడలింపు

S.నంవర్గంగరిష్ట వయోపరిమితి సడలింపు
1ఓబీసీ3 సంవత్సరాలు
2 ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు
3 వికలాంగులు (జనరల్) 10 సంవత్సరాలు
4వికలాంగులు (OBC) 13 సంవత్సరాలు
5వికలాంగులు (SC/ST) 15 సంవత్సరాలు
6మాజీ సైనికులు/వికలాంగులైన మాజీ సైనికులురక్షణ సేవలలో అందించిన వాస్తవ సేవా కాలం + 3 సంవత్సరాలు, (SC/ST వర్గానికి చెందిన వికలాంగులైన మాజీ సైనికులకు 8 సంవత్సరాలు) గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు.
7వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు (పునర్వివాహం చేసుకోకూడదు)7 సంవత్సరాలు (జనరల్/ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు 38 సంవత్సరాలు & ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితికి లోబడి)
8SBI లో శిక్షణ పొందిన అప్రెంటిస్జనరల్/EWS- 1 సంవత్సరం

OBC- 4 సంవత్సరాలు

SC/ST- 6 సంవత్సరాలు

PwBD (జనరల్/EWS)- 11 సంవత్సరాలు
PwBD (OBC)- 14 సంవత్సరాలు
PwBD (SC/ST)- 16 సంవత్సరాలు

👍ముఖ్యమైన తేదీలు👍

సంఘటనలు తేదీలు
SBI క్లర్క్ నోటిఫికేషన్ 2025 విడుదల5 ఆగస్టు 2025
👍ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ప్రారంభO👍6 ఆగస్టు 2025
ఆన్‌లైన్ దరఖాస్తు గడువు చివరి తేది26 ఆగస్టు 2025
SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ 2025 సెప్టెంబర్ 20, 21, 27 & 28 (అంచనా)
SBI క్లర్క్ మెయిన్స్ పరీక్ష తేదీ 2025 నవంబర్ 15 & 16 (అంచనా)
ఆంధ్ర ప్రదేశ్ లో పరీక్ష సెంటర్లుఅనంతపూర్,గుటూర్/విజయవాడ,కడప, కాకినాడ, కర్నూల్,నెల్లూర్, రాజమండ్రి,శ్రికాకులం,తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం
తెలంగాణలో పరీక్ష సెంటర్లుహైదరాబాద్,క్రీమ్ నగర్,ఖమ్మమ్,వరంగల్
ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ని సందర్శించండి

కెరీర్స్ బటన్ పై, తరువాత SBI క్లర్క్ నోటిఫికేషన్ 2025 పై క్లిక్ చేయండి’..పూర్తి అధికారిక నోటిఫికేషన్ చదవండి

SBI క్లర్క్ 2025 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుపై క్లిక్ చేయండి.

రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ పొందడానికి ప్రాథమిక వివరాలను పూరించండి.

అందించిన రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌తో మళ్ళీ లాగిన్ అవ్వండి.

ఇప్పుడు మిగిలిన సమాచారాన్ని పూరించండి.

కేటగిరీ వారీగా దరఖాస్తు రుసుము చెల్లించండి

సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి, భవిష్యత్తు సూచన కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
SBI క్లర్క్ 2025 పరీక్షా సరళి
1.ప్రిలిమినరీ పరీక్ష
2.మెయిన్స్ పరీక్ష
3.స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష (LLPT)

⁜ ప్రిలిమినరీ పరీక్షా సరళి⁜

విభాగంప్రశ్నల సంఖ్యమొత్తం మార్కులువ్యవధి
ఆంగ్ల భాష 30 లు 30 లు20 నిమిషాలు
సంఖ్యా సామర్థ్యం 35 35 20 నిమిషాలు
రీజనింగ్ 3535 20 నిమిషాలు
మొత్తం 100 లు100 లు60 నిమిషాలు

⁜మెయిన్స్ పరీక్షా సరళి⁜

విభాగం ప్రశ్నల సంఖ్య మొత్తం మార్కులువ్యవధి
సాధారణ/ఆర్థిక అవగాహన 50 50 35 నిమిషాలు
జనరల్ ఇంగ్లీష్ 40 40 35 నిమిషాలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 45 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 6045 నిమిషాలు
మొత్తం 190 200 2 గంటల 40 నిమిషాలు

⁜స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష (LLPT)⁜

10వ లేదా 12వ తరగతిలో దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క స్థానిక భాషను అధ్యయనం చేయని అభ్యర్థులు ఎంపికై LLPTకి హాజరు కావాలి. ఈ పరీక్ష అభ్యర్థి స్థానిక భాషను చదవడం, రాయడం మరియు మాట్లాడగల సామర్థ్యాన్ని తనిఖీ చేస్తుంది. LLPTలో విఫలమైన వారిని అనర్హులుగా ప్రకటిస్తారు మరియు వారి ఎంపిక రద్దు చేయబడుతుంది…

SBI జూనియర్ అసోసియేట్ నోటిఫికేషన్ లింక్: https://sbi.co.in/documents/77530/52947104/JA+2025+-Detailed+Advt.pdf/8f7ff18f-1972-21c8-9212-5a8cf85a7099?t=1754398573326

అధికారిక వెబ్సైట్: https://sbi.co.in/web/careers/Current-openings

జూనియర్ అసోసియేట్ పోస్టుకు అప్లై చెయ్యడానికి లింక్:
https://ibpsonline.ibps.in/sbijajul25/

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading