ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

248 జూనియర్ ఇంజనీర్ (JE) మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు NHPC నోటిఫికేషన్ విడుదల చేసింది.

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) దేశవ్యాప్తంగా వివిధ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్, సూపర్‌వైజర్ (IT), సీనియర్ అకౌంటెంట్ మరియు హిందీ ట్రాన్స్‌లేటర్‌తో సహా మొత్తం 248 పోస్టులను రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. అర్హత ఆసక్తి ఉన్న 30 సంవత్సరాలు మించకుండా వయస్సు కలవారు ఆన్‌లైనులో సెప్టెంబర్ 02, 2025 నుండి అక్టోబర్ 01, 2025 వరకు అధికారిక వెబ్సైట్ https://www.nhpcindia.com ద్వారా అప్లై చేసుకోవచ్చు.

NHPC JE మరియు ఇతర నాన్-ఎక్సిక్యూటివ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం

సంస్థనేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
ఉద్యోగంజూనియర్ ఇంజినీర్ మరియు ఇతర నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ప్రకటించిన ఉద్యోగాల పేర్లు*సహాయక రాజభాష ఆఫీసర్
*జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్,E&C విభాగాలలో)
*సూపర్వైజర్ (IT)
*సీనియర్ అకౌంటెంట్
*హిందీ ట్రన్సలేటర్
మెత్తం ఖాళీలు సంఖ్య248
విద్యార్హతసంబంధిత విభాగంలో డిగ్గీ/డిప్లొమా
అనుభవం యొక్క ఆవశ్యకత-సహాయక రాజభాష అధికారికి మరియు హిందీ ట్రన్సలేటర్కి తప్ప ఇతర ఉద్యోగాలకు అనుభవం అక్కరలేదు
వయో పరిమితి30 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది
ధరకాస్తు రుసుము రు.708/-(టేక్సులతో కలుపుకొని)

SC/ST/PwBD/Ex-servicemen/మహిళలకు రుసుము లేదు.
అప్లై చేసుకునే విధానంఆన్లైన్
పరీక్ష విధానంసెంటర్ బేస్డ్ కంప్యూటర్ ఆధారిత పరిక్ష ( CBT) మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్.
జీతం స్ట్రక్టర్సహాయక రాజభాష అధికారికి రు 40,000-1,40,000

జూనియర్ ఇంజినీర్ 29,000 –1,19,500

సీనియర్ అకౌంటెంట్ మరియు

సూపర్వైజర్ -రు.29,600-1,19,500

హిందీ ట్రన్సలేటర్ -రు.27,000–1,05,000
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం తేది. 02-09-2025 (10AM)
👍ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు తేది 👍01-10-2025 (5PM)
అధికారిక వెబ్సైట్nhpcindia.com
సంప్రదించాల్సిన ఈమెయిల్ ఎడ్రస్recttcell2023@nhpc.nic.in
ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్NH/Rect./04/2025

ఉద్యోగం, మొత్తం ఖాళీలు మరియు కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు

( బ్యాక్ లాగ్ ఉద్యోగాలతో కలుపుకుని)

ఉద్యోగం పేరుఖాళీలుURSCSTOBC
(NC)
EWS
ARO11501010301
JE/civil1095116052215
JE/electrical462209021102
JE/mechanical491809031405
JE/
E&C
170802010501
S/IT0101
SR.AC1002020303
HT05030101
మొత్తం1124811039135927

సౌలభ్యం కోసం పై పుట్టింట్లో వాడిని ఎబ్రివేషన్లు
ARO-సహాయక రాజభాష ఆఫీసర్
JE-జూనియర్ ఇంజినీర్
S/IT-సూపర్వైజర్ (IT)
SR.AC-సీనియర్ అకౌంటెంట్
HT-హిందీ ట్రన్సలేటర్

⁜విద్యార్హత⁜

ఉద్యోగంఅర్హత
అసిస్టెంట్ రాజ్‌భాషా అధికారిగుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం నుండి హిందీలో డిగ్రీ స్థాయిలో ఇంగ్లీషును ఎలక్టివ్ సబ్జెక్టుగా తీసుకొని మాస్టర్స్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీ స్థాయిలో హిందీని ఎలక్టివ్ సబ్జెక్టుగా తీసుకొని.

జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాస్టర్స్ డిగ్రీలో కనీసం 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ మరియు ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ ఉండాలి.
జూనియర్ ఇంజనీర్ (సివిల్)ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల పూర్తి సమయం డిప్లొమా.

జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ మరియు ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులకు 50% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్.
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుండి జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ మరియు ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులకు 50% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ తో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల పూర్తి సమయం డిప్లొమా.

ఎలక్ట్రికల్ విభాగంలో ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ (పవర్) / పవర్ సిస్టమ్స్ / పవర్ ఇంజనీరింగ్ ఉన్నాయి.
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పూర్తి సమయం మూడేళ్ల రెగ్యులర్ డిప్లొమా .

జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ మరియు ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులకు 50% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్..

మెకానికల్ విభాగంలో మెకానికల్ / ప్రొడక్షన్ / ఆటోమేషన్ ఇంజనీరింగ్ ఉన్నాయి.
జూనియర్ ఇంజనీర్ (ఇ & సి)ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుండి ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో పూర్తి సమయం మూడేళ్ల రెగ్యులర్ డిప్లొమా.

జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ మరియు ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్.

ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ విభాగంలో ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలి-కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & పవర్ / పవర్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఉన్నాయి.
సూపర్‌వైజర్ (ఐటీ)ప్రభుత్వం/ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుండి కనీసం 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో DOEACC ‘A’ లెవల్ కోర్సుతో గ్రాడ్యుయేట్. లేదా ప్రభుత్వం/ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుండి కనీసం 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో కంప్యూటర్ సైన్స్/ITలో మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా. లేదా ప్రభుత్వం/ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుండి కనీసం 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో BCA/Bsc (కంప్యూటర్ సైన్స్/IT) పూర్తి చేసి ఉండాలి.

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్.
సీనియర్ అకౌంటెంట్ఇంటర్ CA పాస్ లేదా ఇంటర్ CMA పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
హిందీ అనువాదకుడుగుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం నుండి హిందీలో డిగ్రీ స్థాయిలో ఇంగ్లీషును ఎలక్టివ్ సబ్జెక్టుగా తీసుకొని మాస్టర్స్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీ స్థాయిలో హిందీని ఎలక్టివ్ సబ్జెక్టుగా తీసుకుని ఉత్తీర్ణులైన వారు అర్హులు
అనుభవం యొక్క ఆవశ్యకతసహాయక రాజభాష ఆఫీసర్ కి సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి

హిందీ ట్రన్సలేటర్కి. 1సంవత్సరం ఇంగ్లీషు నుండి హిందీకి, హిందీ నుండి ఇంగ్లీషులోకి తర్జుమా చేసే అనుభవం ఉండాలి

ఇతర ఉద్యోగాలకు అనుభవం అవసరం లేదు
పరీక్ష రుసుమురు.600/- + సంభందిత టేక్స్ కలిపి మొత్తం రు. 708/-

SC/ST/PwBD/Ex-servicemen/మహిళలకు రుసుము లేదు.
జీతం స్ట్రక్టర్సహాయక రాజభాష అధికారి /E1 రు 40,000-1,40,000

జూనియర్ ఇంజినీర్ / S1
29,000 –1,19,500

సీనియర్ అకౌంటెంట్ మరియు

సూపర్వైజర్ S1-
రు.29,600-1,19,500

హిందీ ట్రన్సలేటర్ /WO6 -రు.27,000–1,05,000
పరీక్ష సెంటర్లుదేశం మొత్తంమీద 19 CBT పరీక్షకు సెంటర్లు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలలో పరీక్ష సెంటరు హైదరాబాద్
👍ముఖ్యమైన తేదీలుఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 02-09-2025(10AM)

👍ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు తేదీ 01-09-2025(05PM)
వయోపరిమితి30 సంవత్సరాలు మించి ఉండరాదు. నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

కేటగిరీ వారీగా వయో సడలింపు

కేటగిరీవయో సడలింపు
( సంవత్సరాలలో)
OBC(నాన్ క్రిమిలేయర్)3
SC/ST5
PwBD (general)10
PwBD(OBC)13
PwBD (SC/ST)15
కంప్యూటర్ ఆధారిత పరీక్ష వివరాలు
*పరీక్షా మాధ్యమం: ఇంగ్లీష్ & హిందీ

*పరీక్ష వ్యవధి: 3 గంటలు (180 నిమిషాలు)

*మొత్తం మార్కులు: 200

*జెఇ (సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఇ&సి), సూపర్‌వైజర్ (ఐటి) మరియు సీనియర్ అకౌంటెంట్ సబ్జెక్టులు పార్ట్-Iలో సంబంధిత విభాగంలో 140 MCQలు ఉంటాయి. పార్ట్-IIలో జనరల్ అవేర్‌నెస్‌పై 30 MCQలు మరియు రీజనింగ్‌పై 30 MCQలు ఉంటాయి.

*అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్ మరియు హిందీ ట్రాన్స్‌లేటర్ కోసం పార్ట్-Iలో సంబంధిత విభాగంలోని ఒక్కొక్కదానికి 01 మార్కు చొప్పున 40 MCQలు & 10 మార్కుల చొప్పున 10 వివరణాత్మక ప్రశ్నలు (రాత పరీక్ష) ఉంటాయి. పార్ట్-IIలో జనరల్ అవేర్‌నెస్‌పై 30 MCQలు మరియు రీజనింగ్‌పై 30 MCQలు ఉంటాయి.
అప్లై చేసుకునే విధానం
*అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: nhpcindia.com

*హోమ్ పేజీలో, కెరీర్‌లపై క్లిక్ చేయండి.

*NHPC లిమిటెడ్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నాన్-ఎగ్జిక్యూటివ్‌ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ నెం . NH/Rectt./04/2025 యొక్క దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి .

*రిజిస్ట్రేషన్ నంబర్ పొందడానికి అవసరమైన వివరాలను పూరించండి.

*రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.

*సూచనలను జాగ్రత్తగా చదివి దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.

*సమర్పించిన తర్వాత, ఒక ప్రత్యేక సంఖ్య ఉత్పన్నం అవుతుంది.

*భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

NHPC JE మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నోటిఫికేషన్ లింక్: https://share.google/ZScSY2N9L3IIHNfZR

అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/KHPtHeeYbJZFNgLHq

Posted in

Leave a comment