ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ రీజినల్ రూరల్ బ్యాంక్స్ (IBPS RRB) రిక్రూట్‌మెంట్ 2025 ద్వారా 13217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోడానికి నోటిఫికేషన్ విడుదల అయింది.నోటిఫికేషన్ పూర్తిగా చదివి, అవగాహన చేసుకుని అర్హత,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైనులో 01-09-2025 మరియు 21-09-2025 మద్య అధికారిక వెబ్సైటు ibps.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
I⁜BPS-RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 అవలోకనం⁜
| సంస్థ | ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ద్వారా రీజినల్ రూరల్ బ్యాంక్స్ (IBPS RRB) |
| ఉద్యోగం. | ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ ఉద్యోగాలు |
| ఉద్యోగాల పేర్లు | ఆఫీస్ అసిస్టెంట్ (మల్టి పర్పస్) ఆఫీసర్ స్కేల్- I (అసిస్టెంట్ మేనేజర్) ఆఫీసర్ స్కేల్-II (వ్యవసాయ అధికారి) ఆఫీసర్ స్కేల్-II (లా) ఆఫీసర్ స్కేల్-II (CA) ఆఫీసర్ స్కేల్-II (IT) ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్) ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్) ఆఫీసర్ స్కేల్ III |
| మొత్తం ఉద్యోగాలు | 13,217 |
| స్కెలు వారీగా ఉద్యోగాల సంఖ్య | ఆఫీస్ అసిస్టెంట్ (మల్టి పర్పస్) -7972 ఆఫీసర్ స్కేల్- I (అసిస్టెంట్ మేనేజర్) -3907 ఆఫీసర్ స్కేల్ -II -1,139 ఆఫీసర్ స్కేల్ -III-199 |
| విద్యార్హత. | బ్యాచులర్స్ డిగ్రీ,BL,BE,CA,MBA (పూర్తి వివరాలు డిటైల్సులో ఇవ్వబడ్డాయి.) |
| వయోపరిమితి | ఆఫీస్ అసిస్టెంట్లకు (మల్టీపర్పస్) కు 18 సంవత్సరాల మధ్య28 సంవత్సరాల మధ్య ఆఫీసర్ స్కేల్- I (అసిస్టెంట్ మేనేజర్) కు 18 సంవత్సరాలనుండి 30 సంవత్సరాల మధ్య ఆఫీసర్ స్కేల్- II (మేనేజర్) కు 21 సంవత్సరాల నుండి – 32 సంవత్సరాల మధ్య ఆఫీసర్ స్కేల్- III (సీనియర్ మేనేజర్) కు 21 సంవత్సరాల నుండి -40 సంవత్సరాల మధ్య నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. |
| ధరకాస్తు రుసుము | SC/ST/ PwBD అభ్యర్థులకు: రూ.175/- (GSTతో సహా) మిగతా వారందరికీ: రూ.850/- (జిఎస్‌టితో సహా) |
| పార్టిసిపేటింగ్ రీజనల్ రూరల్ బ్యాంకులు | వివిధ రాష్ట్రాల మరియు యూనియన్ టెరిటరీల గ్రామీణ బ్యాంకులు ఆంధ్ర ప్రదేశులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తెలంగాణలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు |
| తెలియవలసిన ప్రాంతీయ భాష | సంబంధిత రాష్ట్రాల మరియు యూనియన్ టెరిటరీల ప్రాంతీయ భాష ఆంధ్ర ప్రదేశులో తెలుగు తెలంగాణలో తెలుగు లేదా ఉర్దూ |
| క్రెడిట్ హిస్టరి | భాగస్వామ్య బ్యాంకు నిబంధన పరిధి ప్రకారం క్రెడిట్ హిస్టరి ఉండాలి. |
| పరీక్ష విధానం | ప్రిలిమినరీ,మేయిన్స్ మరియు ఇంటర్వ్యూ ( ఇంటర్వ్యూ ఆఫీస్ అసిస్టెంట్కు ఉండదు) |
| పరీక్ష మీడియం | ఆఫీస్ అసిస్టెంట్ మరియు స్కేల్ I ఆఫీసర్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశులో ఇంగ్లీష్,హిందీ, తెలుగు ,తెలంగాణలో ఇంగ్లీష్,హిందీ,తెలుగు, ఉర్దూ స్కేల్ II & III ఉద్యోగాలకు ఇంగ్లీష్, హింది |
| తప్పు సమాధానాలకు పెనాల్టీ | తప్పు జవాబుకు సంబంధించిన ప్రశ్న యొక్క మార్కు లో నాల్గవ వంతు సంపాదించిన మార్కులనుండి తీయబడుతుంది |
| పరీక్ష సెంటర్లు | ఆంధ్ర ప్రదేశ్లో ప్రిలిమినరీకి 14 సెంటర్లు మరియు మేయిన్సుకి 8 సెంటర్లు ఉన్నాయి తెలంగాణలో ప్రిలిమినరీకి 6 సెంటర్లు మరియు మేయిన్సుకి 3 సెంటర్లు ఉన్నాయి |
| 👍ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 👍 21-09-2025 |
| అధికారిక వెబ్సైట్ | http://www.ibps.in |
| పరీక్ష కోడ్. | CRPRRBs XIV |
| సలహాలకు మరియు కంప్లైంట్లకు సంప్రదించడానికి లింక్ | https://cgrs.ibps.in |
⁜IBPS RRB ఖాళీలు వివరాలు⁜
| ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్) | 7972 |
| ఆఫీసర్ స్కేల్ I (PO) | 3907 |
| ఆఫీసర్ స్కేల్-II (వ్యవసాయ అధికారి) | 50 |
| ఆఫీసర్ స్కేల్-II (లా) | 48 |
| ఆఫీసర్ స్కేల్-II (CA) | 69 |
| ఆఫీసర్ స్కేల్-II (IT) | 87 |
| ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) | 854 |
| ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్) | 15 |
| ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్) | 16 |
| ఆఫీసర్ స్కేల్ III | 199 |
| మొత్తం ఖాళీలు | 13217 |
⁜విద్యార్హత & అనుభవం (21.09.2025 నాటికి)⁜
| పోస్ట్ | విద్యార్హత | అనుభవం |
| ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్) | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనది (ఎ) పాల్గొనే RRB/s* సూచించిన విధంగా స్థానిక భాషలో ప్రావీణ్యం (బి) కావాల్సినది: కంప్యూటర్ల పని పరిజ్ఞానం. – | — |
| ఆఫీసర్ స్కేల్ I (PO) | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత. వ్యవసాయం, ఉద్యానవనం, అటవీ, పశుసంవర్ధకం, వెటర్నరీ సైన్స్, వ్యవసాయ ఇంజనీరింగ్, పిస్కల్చర్, వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకారం, సమాచార సాంకేతికత, నిర్వహణ, చట్టం, ఆర్థిక శాస్త్రం లేదా అకౌంటెన్సీలో డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ii. పాల్గొనే RRB/s* సూచించిన స్థానిక భాషలో ప్రావీణ్యం i ii. కావాల్సినది: కంప్యూటర్ యొక్క పని పరిజ్ఞానం. —- | — |
| ఆఫీసర్ స్కేల్-II (వ్యవసాయ అధికారి) | వ్యవసాయ అధికారి కనీసం 50% మార్కులతో వ్యవసాయం/ ఉద్యానవనం/ పాడి పరిశ్రమ/ పశుసంవర్ధకం/ అటవీ/ వెటర్నరీ సైన్స్/ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/ పిస్సికల్చర్ లేదా దానికి సమానమైన బ్యాచిలర్ డిగ్రీ. | రెండేళ్లు (సంబంధిత రంగంలో) |
| ఆఫీసర్ స్కేల్-II (లా) | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత. | న్యాయవాదిగా రెండేళ్లు లేదా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలలో లా ఆఫీసర్‌గా రెండేళ్లకు తక్కువ కాకుండా పనిచేసి ఉండాలి. |
| ఆఫీసర్ స్కేల్-II (CA) | ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుండి చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫైడ్ అసోసియేట్ (CA) పట్టా . | చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఒక సంవత్సరం |
| ఆఫీసర్ స్కేల్-II (IT) | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీ. కావాల్సినది: ASP , PHP, C++, జావా, VB, VC, OCP మొదలైన వాటిలో సర్టిఫికెట్.) | ఒక సంవత్సరం (సంబంధిత రంగంలో |
| ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన కోర్సులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిస్కల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్ మరియు అకౌంటెన్సీలలో డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. | బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో అధికారిగా రెండు సంవత్సరాలు. |
| ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్) | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి MBA ఇన్ మార్కెటింగ్ | ఒక సంవత్సరం (సంబంధిత రంగంలో) |
| ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్) | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి అకౌంటెంట్ లేదా ఫైనాన్స్‌లో MBA | ఒక సంవత్సరం (సంబంధిత రంగంలో) |
| ఆఫీసర్ స్కేల్ III | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన కోర్సులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిస్కల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కో-ఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్ మరియు అకౌంటెన్సీలలో డిగ్రీ/ డిప్లొమా ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. | బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో ఆఫీసర్‌గా కనీసం 5 సంవత్సరాల అనుభవం |
⁜ వయోపరిమితి (01.09.2025 నాటికి)⁜
| ఉద్యోగం | వయోపరిమితి |
| ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) | 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య అంటే అభ్యర్థులు 02.09.1997 కంటే ముందు మరియు 01.09.2007 తర్వాత జన్మించి ఉండకూడదు (రెండు తేదీలు కలిపి). |
| ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) | 18 సంవత్సరాల కంటే ఎక్కువ – 30 సంవత్సరాల కంటే తక్కువ అంటే అభ్యర్థులు 02.09.1995 కంటే ముందు మరియు 01.09.2007 తర్వాత జన్మించి ఉండకూడదు (రెండు తేదీలు కలిపి). |
| ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) | 21 సంవత్సరాల కంటే ఎక్కువ – 32 సంవత్సరాల కంటే తక్కువ అంటే అభ్యర్థులు 02.09.1993 కంటే ముందు మరియు 01.09.2004 తర్వాత జన్మించి ఉండకూడదు (రెండు తేదీలు కలిపి). |
| ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) | 21 సంవత్సరాల కంటే ఎక్కువ – 40 సంవత్సరాల కంటే తక్కువ అంటే అభ్యర్థులు 02.09.1985 కంటే ముందు మరియు 01.09.2004 తర్వాత (రెండు తేదీలు కలుపుకొని) జన్మించి ఉండకూడదు. |
⁜కేటగిరీ వారీగా వయో సడలింపు⁜
| వర్గం | వయసు సడలింపు |
| ఎస్సీ/ఎస్టీ | 5 సంవత్సరాలు |
| ఓబీసీ | 3 సంవత్సరాలు |
| పిడబ్ల్యుడి | 10 సంవత్సరాలు |
| మాజీ మాజీ సైనికులు/వికలాంగులైన మాజీ సైనికులు | ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుకు– రక్షణ దళాలలో అందించిన వాస్తవ సేవా కాలం + 3 సంవత్సరాలు (SC/ST వర్గానికి చెందిన వికలాంగ మాజీ సైనికులకు 8 సంవత్సరాలు) గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. ఆఫీసర్ పోస్టుకు 5 సంవత్సరాలు |
| వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు మరియు తిరిగి వివాహం చేసుకోని భర్తల నుండి చట్టబద్ధంగా విడిపోయిన మహిళలు | [ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుకు మాత్రమే] జనరల్/ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాల వరకు, ఓబిసి అభ్యర్థులకు 38 సంవత్సరాల వరకు మరియు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు |
| 1984 అల్లర్ల వల్ల ప్రభావితమైన వ్యక్తులు | 5 సంవత్సరాలు |
| దరఖాస్తు రుసుము | SC/ST/ PwBD అభ్యర్థులకు: రూ.175/- (GSTతో సహా) మిగతా వారందరికీ: రూ.850/- (జిఎస్‌టితో సహా) |
| ప్రిలిమినరీ పరీక్ష సెంటర్లు | ఆంధ్ర ప్రదేశ్ లో. అనంతపూర్,ఏలూరు, గుంటూరు, కాకినాడ,కడప, కర్నూలు,నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రికాకులం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం తెలంగాణలో హైదరాబాద్, కరీమ్నగర్,ఖమ్మమ్, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్ |
| మేయిన్స్ పరీక్షకు సెంటర్లు | ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూర్, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీమ్నగర్ |
| జీతం నిర్మాణం | ఆఫీస్ అసిస్టెంట్ (క్లర్క్) రూ. 35,000 నుండి రూ. 37,000 ఆఫీసర్ (స్కేల్ I) రూ. 75,000 నుండి రూ. 77,000 ఆఫీసర్ స్కేల్-II రూ. 65,000 నుండి రూ. 67,000 ఆఫీసర్ స్కేల్ III రూ. 80,000 నుండి రూ. 90,000 |
👍 ⁜ముఖ్యమైన తేదీలు⁜
| విషయము | తేదీ |
| ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ | 1 సెప్టెంబర్ 2025 |
| 👍ఆన్‌లైన్ దరఖాస్తులు ముగింపు తేదీ | 👍21 సెప్టెంబర్ 2025 |
| దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ | 21 సెప్టెంబర్ 2025 |
| అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను సవరించడానికి/ సరిచేయడానికి ఎడిట్ విండో (సవరణ కోసం ఆన్‌లైన్ చెల్లింపుతో సహా) రిజిస్ట్రేషన్ ముగిసిన తర్వాత | IBPS అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేయబడుతుంది |
IBPS-RRB( రీజనల్ రూరల్ బ్యాంక్) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్: https://www.ibps.in/wp-content/uploads/CRP-RRBs-XIV_Final_AD_31.08.25.pdf
IBPS-RRB ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులకు అప్లై చెయ్యడానికి లింక్ :https://ibpsreg.ibps.in/rrbxivaug25/
IBPS -RRB గ్రూప్ -A (స్కేల్ I,II,III) ఉద్యోగాలకు అప్లై చెయ్యడానికి లింక్:
https://ibpsreg.ibps.in/rrbxivscag25/
అధికారిక వెబ్సైట్ లింక్:
https://www.ibps.in/

Leave a comment