రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) టెక్నీషియన్ గ్రేడ్ I &III ఉద్యోగాలకు ప్రకటన సంఖ్య CEN 02/2026 ద్వారా 6565 ఖాళీలకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) టెక్నీషియన్ గ్రేడ్ I &III ఉద్యోగాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.rrbcdg.gov.in/ ద్వారా వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులలో టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టుల కోసం ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు 30 జూన్ 2026 నుండి 29 జూలై 2026వరకు rrbapply.gov.in లో చెయ్యవలసి ఉంటుంది .మెట్రిక్యులేషన్ / SSLC తో పాటు ITI
లేదా సంబంధిత వృత్తిలో అప్రెంటిస్‌షిప్ చేసుకుంటే అప్లై చెయ్యడానికి అర్హులు
RRB టెక్నీషియన్ నోటిఫికేషన్ 2026 అవలోకనం
| సంస్థ: | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు |
| పోస్ట్ పేరు | టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ & టెక్నీషియన్ గ్రేడ్ III |
| ప్రకటన సంఖ్య | CEN 02/2026 |
| ఉద్యోగాలు సంఖ్య | 6565 (గ్రేడ్ I ఖాళీల సంఖ్య- 323 గ్రేడ్ III ఖాళీల సంఖ్య-6242) |
| RRB టెక్నీషియన్ పూర్తి నోటిఫికేషన్ విడుదల తేది | 29 జూన్ 2026 |
| దరఖాస్తు చేసుకోడానికి ప్రారంభ తేది | 30 జూన్ 2026 |
| దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 29 జూలై 2026 (23:59 గంటలు) |
| అప్లికేషన్ మోడ్ | ఆన్‌లైన్ |
| వయోపరిమితి | టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్: 18 నుండి 33 సంవత్సరాలు టెక్నీషియన్ గ్రేడ్ III: 18 నుండి 30 సంవత్సరాలు నిబంధనల ప్రకిరంవయో సడలింపు వర్తిస్తుంది |
| విద్యార్హత | టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టుకు గుర్తింపు పొందిన సంస్థల నుండి సంబంధిత ట్రేడ్‌లలో మెట్రిక్యులేషన్ / SSLC తో పాటు ITI లేదా సంబంధిత వృత్తిలో అప్రెంటిస్‌షిప్ టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టుకు డిప్లొమా / డిగ్రీ అర్హత . |
| ఎంపిక ప్రక్రియ | CBT, పత్రాల ధృవీకరణ మరియు వైద్య పరీక్ష |
| వేతన స్థాయి | టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: స్థాయి-5 టెక్నీషియన్ గ్రేడ్-III: స్థాయి-2 |
| ప్రారంభ జీతం | గ్రేడ్-I సిగ్నల్: రూ. 29,200 గ్రేడ్-III: రూ. 19,900 |
| అధికారిక వెబ్‌సైట్ | https://www.rrbcdg.gov.in/ |
| అప్లై చెయ్యడానికి అధికారిక వెబ్‌సైట్ | rrbapply.gov.in |
వివరాలు చూడడానికి నోటిఫికేషన్ ✌️

Leave a comment