ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  యొక్క  అనుబంధ సంస్థ ఐన AAICLASలో  ఇంటర్మీడియట్  ఆధారంగా ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా 62 ఉద్యోగాల భర్తీ

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) యొక్క  అనుబంధ సంస్థ అయిన AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS), పాన్ ఇండియా ప్రాతిపదికన 3 సంవత్సరాల నిర్ణీత కాల ఒప్పందంపై అసిస్టెంట్ (సెక్యూరిటీ) నియామకం కోసం 13.05.2026 తేదీన ప్రకటన నెం. 02/2026ను విడుదల చేసింది . 12 వ తరగతి చదివిన వారు ఆన్లైన్ లో అప్లికేషన్లు 11 జూన్ 2026 నుండి  02  జూలై 2026 వరకు అధికారిక వెబ్సైటు aaiclas.aero లో అప్లై చేసుకోవచ్చు,తిరుపతి, ట్రిచి, మదురై, భువనేశ్వర్ మరియు ఉదయ్‌పూర్ అనే ఐదు విమానాశ్రయ ప్రదేశాలలో మొత్తం 62 ఖాళీలను ప్రకటించారు.ఈ ఉద్యోగాలను  మెరిట్ మరియు ఇంటరేక్షన్ ( ఆన్లైన్ ఇంటర్వూ) ద్వారా భర్తీ చేస్తారు.

ముఖ్యమయిన విషయాలు

  • సంస్థ :  కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS)
  • ఖాళీలు : AAICLAS పాన్ ఇండియా ప్రాతిపదికన 5 విమానాశ్రయ ప్రదేశాలలో 3 సంవత్సరాల నిర్ణీత కాల ఒప్పందంపై 62 మంది అసిస్టెంట్ (సెక్యూరిటీ) సిబ్బందిని నియమిస్తోంది .
  • అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం/సంస్థ నుండి 12వ తరగతి (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు , ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులు సాధించి ఉండాలి .
  • ధరకస్తూ  రుసుము : జనరల్ మరియు ఓబీసీ వర్గం వారికి    ₹500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) – బ్యాంకు ఛార్జీలు మరియు ఇతర పన్నులు మినహాయించిఎస్సీ / ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ & మహిళలలకు ₹100/- (వంద రూపాయలు మాత్రమే) – బ్యాంకు ఛార్జీలు మరియు ఇతర పన్నులు మినహాయించి
  • చెల్లింపు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే – నెట్ బ్యాంకింగ్ / క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ / UPI / వాలెట్
  • ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తులు 11 జూన్ 2026 న ప్రారంభమై 02 జూలై 2026 న ముగుస్తాయి .
  • జీతం: అన్ని అలవెన్సులతో కలిపి ఏకీకృత వేతనం ₹21,500/- (1వ సంవత్సరం), ₹22,000/- (2వ సంవత్సరం), మరియు ₹22,500/- (3వ సంవత్సరం) .
  • ఎంపిక విధానం : ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన → ప్రతిభ ఆధారంగా ఆన్‌లైన్ సంభాషణ (ఇంటర్వ్యూ)
  • వయోపరిమితి: 01.06.2026 నాటికి గరిష్టంగా 27 సంవత్సరాలు ; ఎస్సీ/ఎస్టీ (5 సంవత్సరాలు), ఓబీసీ-ఎన్‌సీఎల్ (3 సంవత్సరాలు), మరియు మాజీ సైనికులకు (5 సంవత్సరాలు) సడలింపులు వర్తిస్తాయి.
  • దరఖాస్తు విధానం: AAICLAS అధికారిక వెబ్‌సైట్ http://www.aaiclas.aero ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే .
  • ఉద్యోగ ప్రదేశం: తిరుపతి, ట్రిచి, మదురై, భువనేశ్వర్, ఉదయ్‌పూర్.
  • ఒప్పంద కాలం : మూడు సంవత్సరాలు
AAICLAS అసిస్టెంట్ (సెక్యూరిటీ) రిక్రూట్‌మెంట్ 2026 ముఖ్యమైన తేదీలు
ప్రకటన తేదీ13.05.2026
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ  ప్రారంభ తేదీ11.06.2026
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ02.07.2026
వయస్సు మరియు అర్హతకు  ప్రదీపదిక అయిన తేదీ01.06.2026
ఆన్‌లైన్ సంభాషణ (ఇంటర్వ్యూ) తేదీనమోదిత ఇమెయిల్ ఐడి మరియు AAICLAS వెబ్‌సైట్ ద్వారా తెలియజేయబడుతుంది
                             నగరాల  వారీగా  ఖాళీల  వివరాలు
తిరుపతి          09 ఖాళీలు
త్రిచి     23 ఖాళీలు
మదురై 09 ఖాళీలు
భువనేశ్వర్       09 ఖాళీలు
ఉదయ్‌పూర్      12 ఖాళీలు
మొత్తం ఖాళీలు62 ఖాళీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం:

  • http://www.aaiclas.aero ని సందర్శించండి → “కెరీర్” కాలమ్‌పై క్లిక్ చేయండి → 2026 నాటి ప్రకటన నెం. 02 కి ఎదురుగా ఉన్న “ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి” పై క్లిక్ చేయండి.
  • అన్ని వివరాలను సరిగ్గా పూరించండి. 12వ తరగతి మార్కుల శాతాన్ని కేవలం సంఖ్యా రూపంలో మాత్రమే నమోదు చేయాలి (ఉదా: 60, 70, 80) — CGPA లేదా మరే ఇతర ఫార్మాట్‌లోనూ కాదు.
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
  • నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు దరఖాస్తు ఫారంలో నమోదు చేసిన ఇమెయిల్ ఐడి యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. ఒకసారి నమోదు చేసిన తర్వాత ఇమెయిల్ ఐడిలో ఎలాంటి మార్పుకు అనుమతి లేదు.
  • దరఖాస్తును 02.07.2026 లోపు సమర్పించండి

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంతో జతచేయవలసిన పత్రాలు

  • సీనియర్ సెకండరీ (12వ) సర్టిఫికేట్ మరియు మార్క్ షీట్
  • కుల/వర్గ ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
  • ఆధార్ కార్డు కాపీ
  • ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు రంగుల ఫోటో (గరిష్టంగా 20 KB సైజు)
  • దరఖాస్తు రుసుము (ఆన్‌లైన్‌లో చెల్లించాలి)
  • స్కాన్ చేసిన సంతకం (గరిష్టంగా 20 KB పరిమాణం)
AAICLAS అసిస్టెంట్ (సెక్యూరిటీ) అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
అప్లై చెయ్యడానికి లింక్ 11 వ తారీఖున ఆక్టివేట్ అవుతుంది
అధికారిక వెబ్సైట్ లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఉద్యోగసమాచార వేదికలో లేటెస్ట్ ఉద్యోగ ప్రకటనలు చూడడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఉద్యోగ సమాచార వేదిక మైల్ ఐ డి : udyogasamacharam@uchitaudyogasamachar.in

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading