రాత పరీక్ష లేకుండా అర్హత  ఆధారంగా 529 స్టాఫ్ నర్స్ ,ఫార్మసిస్ట్ మరియు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఉద్యోగాలకు APMSRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు (APMSRB), జాతీయ ఆరోగ్య మిషన్ (NHM ) కింద స్టాఫ్ నర్స్ (419), ఫార్మసిస్ట్ (24), మరియు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (86) వంటి  మొత్తం 529 కాంట్రాక్ట్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ, 10 జూన్ 2026 న నోటిఫికేషన్ నెం . 10/2026 ను విడుదల చేసింది.18 సంవత్సరాల  నుండి 42 సంవత్సరాలు వరకు (నిబంధన ప్రకారం వయో సడలింపు ఉంటుంది )ఉండి నర్సింగ్ డిగ్రీ /ఫార్మసీ డిగ్రీ లేదా డిప్లొమా / ఇంటర్మీడియట్  తో పాటు రిహాబిలిటేషన్ సర్టిఫికేట్  కోర్సు  చేసిన అభ్యర్ధులు ఒప్పంద ప్రాతిపదికన పనిచేయడానికి ఆసక్తి ఉన్నట్లయితే  30 జూన్ 2026 లోపల అధికారిక వెబ్సైట్ https://apmsrb.ap.gov.in/msrb/ ద్వారా అప్లై చేసుకోవచ్చు .

ముఖ్యమైన  అంశాలు

  • సంస్థ:    ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు (APMSRB)
  • నోటిఫికేషన్ నెం.:  10/2026
  • పోస్ట్‌లు:  స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్  ఒప్పంద  ప్రాతిపదిక ఉద్యోగాలు
  • మొత్తం ఖాళీలు: 529 ఉద్యోగాలు .ఇందులో 419 స్టాఫ్ నర్స్ ఖాళీలు ,24 ఫార్మసిస్ట్ మరియు 86 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (బహుళ పునరావాస కార్యకర్త ) ఖాళీలు ఉన్నాయి .
  • ఉద్యోగ రకం: ఒప్పంద ప్రాతిపదిక (NHM)
  • జీతం /గౌరవ  వేతనం : స్టాఫ్ నర్స్ కి  నెలవారి వేతనం రు.27,675/-, ఫార్మసిస్ట్ కి రు .23,393/- మరియు బహుళ పునరావాస కార్యకర్తకి రు .23,494/- నెలవారీ గౌరవ వేతనంగా ప్రకటించారు .
  • విద్యార్హత –
    • స్టాఫ్ నర్స్ అభ్యర్థులు తప్పనిసరిగా బి.ఎస్.సి. నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ (జి.ఎన్.ఎం) డిగ్రీని కలిగి ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ కౌన్సిల్ (ఎపి.ఎన్.ఎం.సి) లో తాజా పునరుద్ధరణతో నమోదు చేసుకుని ఉండాలి .
    • ఫార్మసిస్ట్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన డి.ఫార్మా , బి.ఫార్మా , లేదా ఫార్మసీలో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సును కలిగి ఉండాలి మరియు అప్‌-టు-టెండెడ్ రిన్యూవల్‌తో ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
    • మల్టీ   రిహాబిలిటేషన్ వర్కర్ అభ్యర్థులు 10+2 లేదా దానికి సమానమైన విద్యను , గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మల్టీ రిహాబిలిటేషన్ వర్క్‌లో ఒకటిన్నర సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సును పూర్తి చేసి ఉండాలి మరియు RCI చట్టం, 1992 ప్రకారం రిహాబిలిటేషన్ పర్సనల్‌గా రిజిస్టర్ అయి ఉండాలి
  • వయో  పరిమితి : 01 జనవరి 2026 నాటికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు (GOMs.No.36, GA (Ser-A) Dept., Dt. 04/03/2025 ప్రకారం) మాధ్య ఉండాలి . 18 సంవత్సరాల కంటే తక్కువ లేదా 42 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న  అభ్యర్ధులు మాత్రమే అర్హులు . ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నియమాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది .
  • దరఖాస్తు రుసుము:  OC (జనరల్ / అన్‌రిజర్వ్‌డ్) అభ్యర్ధులకు  ధరకాస్తు  రుసుము ₹1,200/- మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులకు  ధరకాస్తు  రుసుము  ₹900/- గా ఉంది .
  • ధరకాస్తు విధానం : ఆన్లైన్ . దరఖాస్తు చేసే సమయంలో ఫీజును పేమెంట్ గేట్‌వే (నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా మొబైల్ వాలెట్) ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
  • నివాస / రాష్ట్ర అర్హత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్‌లో 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన అభ్యర్థులను స్థానికులుగా పరిగణిస్తారు. 2 జూన్ 2014 నుండి 3 సంవత్సరాలలోపు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చిన అభ్యర్థులు కూడా స్థానిక అభ్యర్థులుగా పరిగణింప పడతారు  (GOMs.No.132 & 133, GAD, 13.06.2016 ప్రకారం).
  • అప్లై  చెయ్యడానికి చివరి రోజు : 30 జూన్ 2026 (రాత్రి 11,59) వరకు . అధికారిక
  • అధికారిక వెబ్సైట్ : https://apmsrb.ap.gov.in/msrb/
                                                    ముఖ్యమైన  తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీ10 జూన్ 2026
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ13 జూన్ 2026
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ30 జూన్ 2026 (రాత్రి 11:59)
వెయిటేజ్ లెక్కింపునకు కీలకమైన తేదీ10 జూన్ 2026 (నోటిఫికేషన్ తేదీ)
                                        అప్లై చెయ్యడానికి  వయో సండలింపు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్5 సంవత్సరాలు
బెంచ్‌మార్క్ వైకల్యాలు ఉన్న వ్యక్తులు (PBD)10 సంవత్సరాలు
మాజీ సైనికులు3 సంవత్సరాలు + సైనిక సేవ కాలం (మొత్తం గరిష్ట వయోపరిమితికి లోబడి)

APMSRB స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ:

APMSRB రిక్రూట్‌మెంట్ 2026 ఎంపిక పూర్తిగా మెరిట్ మరియు రిజర్వేషన్ నియమం ఆధారంగా జరుగుతుంది – రాత పరీక్ష ఉండదు. మొత్తం స్కోరు 100 మార్కులను వెయిటేజ్ లెక్కించడానికి మూడు భాగలగా విడదీసారు .

క్వాలిఫయింగ్ పరీక్ష మార్కులకు వెయిటేజ్ మార్కులు : 75

క్వాలిఫయింగ్ పరీక్ష ఉత్తీర్నులయిన సంవత్సరం నుండి గడిచిన  సంవత్సరాలకు వెయిటేజ్ (సంవత్సరానికి 1 మార్కు చొప్పున, PG/సూపర్-స్పెషాలిటీ వరకు) మార్కులు  :10

పూర్వపు  కాంట్రాక్ట్ సర్విస్ అనుభవానికి వెయిటేజ్ మార్కులు : 15

ధరకాస్తూ చేసుకునే విధానం :

  • అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://apmsrb.ap.gov.in/msrb/
  • హోమ్‌పేజీలో ‘ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్’ పై క్లిక్ చేయండి .
  • మీరు దరఖాస్తు చేస్తున్న పోస్టు పేరును ఎంచుకోండి.
  • అవసరమైన అన్ని ఫీల్డ్‌లను జాగ్రత్తగా పూరించండి – పేరు మీ సర్టిఫికేట్‌లతో ఖచ్చితంగా సరిపోలాలి.
  • మీ ప్రాథమిక మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడిని నమోదు చేయండి (అన్ని సమాచారాలు ఇక్కడికే పంపబడతాయి).
  • అవసరమైన అన్ని పత్రాలను  PDF ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి.
  • ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వే ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించండి.
  • సర్వర్ నిర్ధారణ కోసం వేచి ఉండండి – చెల్లింపు సమయంలో బ్యాక్ లేదా రిఫ్రెష్ నొక్కవద్దు .
  • భవిష్యత్ అవసరాల కోసం మీ తుది రిజిస్ట్రేషన్ నంబర్‌ను దాసుకోండి .
  • దరఖాస్తులను 13 జూన్ 2026 మరియు 30 జూన్ 2026 (రాత్రి 11:59 గంటల) మధ్య సమర్పించాలి .

ధరకాస్తు  చేసేటప్పుడు అప్‌లోడ్ చెయ్యవలసిన పత్రాలు  :

ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే సమయంలో అన్ని పత్రాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. అలాచేయని పత్రాలను తర్వాత అంగీకరించబడదు.

  • ఇటీవలి స్కాన్ చేసిన ఛాయాచిత్రం మరియు సంతకం
  • SSC సర్టిఫికేట్ (పుట్టిన తేదీకి రుజువు)
  • ఇంటర్మీడియట్ సర్టిఫికేట్
  • స్టడీ సర్టిఫికేట్ (4వ తరగతి నుండి 10వ తరగతి వరకు)
  • బి.ఎస్.సి. (ఎన్) / జి.ఎన్.ఎం / బి.ఫార్మసీ / డి.ఫార్మసీ ఉత్తీర్ణత ధృవపత్రం మార్కుల మెమోతో
  • ఒకటిన్నర సంవత్సరాల MRW కోర్సు సర్టిఫికేట్, మార్కుల మెమోతో పాటు (MRW పోస్ట్ కోసం)
  • APNMC కౌన్సిల్ రిజిస్ట్రేషన్ మరియు తాజా పునరుద్ధరణ (స్టాఫ్ నర్స్ కోసం)
  • AP ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ మరియు తాజా పునరుద్ధరణ (ఫార్మసిస్ట్ కోసం)
  • RCI రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ కోసం)
  • DM&HO / DCHS / మెడికల్ సూపరింటెండెంట్ సంతకం చేసిన అనెక్సర్ V ఫార్మాట్‌లోని కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్
  • కోవిడ్-19 అపాయింట్‌మెంట్ ఆర్డర్ + సర్వీస్ సర్టిఫికేట్ + నెలవారీ హాజరు సర్టిఫికేట్లు + బ్యాంక్ స్టేట్‌మెంట్ (కోవిడ్ వెయిటేజ్ కోసం)
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 కొరకు కుల ధృవీకరణ పత్రం (ఎస్సీ / ఎస్టీ / బీసీ) లేదా ఈడబ్ల్యూఎస్ ఆదాయ & ఆస్తి ధృవీకరణ పత్రం
  • SC ఉప-వర్గీకరణ ధృవీకరణ పత్రం (వర్తించే విధంగా SC గ్రూప్-I, II, లేదా III)
  • మెడికల్ బోర్డ్ లేదా SADAREM నుండి PBD సర్టిఫికేట్ (విభిన్న సామర్థ్యం గల అభ్యర్థుల కోసం)
  • మాజీ సైనికుడి ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
APMSRB అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
అప్లై చేసుకోడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
మరిన్ని ఉద్యోగాల వివరాలు చూడడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఉద్యోగ సమాచార వేదిక మెయిల్ ఐ డి udyogasamacharam@uchitaudyogasamachar.in

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading