SBI PO రిక్రూయిట్మెంట్ నోటిఫికేషన్ 2026 ద్వారా 1500 ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రకటన నెం. CRPD/PO/2026-27/09 ద్వారా 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఉద్యోగాల నియామకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ, SBI PO రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను 2026 విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 18 జూన్ 2026 నుండి 8 జూలై 2026 వరకు చేసుకోవచ్చు .01 ఏప్రిల్ 2026 నాటికి 21 నుండి 30 సంవత్సరాల వయస్సు గల (నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది ) , ఏ విభాగంలోనైనా పట్టభద్రులైన వారు SBI యొక్క అధికారిక వెబ్సైట్ యొక్క కెరీర్స్ పోర్టల్ ‘ https://sbi.bank.in/web/careers/current-openings లో పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. PO ఉద్యోగాలకు ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

ముఖ్యమయన అంశాలు :

  • నియామక సంస్థ :స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్
  • ప్రకటన సంఖ్య.   CRPD/PO/2026-27/09
  • పోస్ట్ పేరు     ప్రొబేషనరీ ఆఫీసర్ (PO )
  • మొత్తం ఖాళీలు : 1500 (సాధారణ  ఖాళీలు 1446 మరియు SC & ST బ్యాకలాగ్ ఖాళీలు 54 ఉన్నాయి )
  • విద్యార్హత (30.09.2026 నాటికి):  ఏదైనా విభాగంలో పట్టభద్రత కలిగి ఉండాలి . అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని లేదా  తత్సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలి . చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా  దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ ఇంటర్వ్యూ కోసం ఎంపికైతే, వారు 30 సెప్టెంబర్ 2026 నాటికి లేదా అంతకు ముందు గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు రుజువును సమర్పించాలి. మెడికల్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ అకౌంటెన్సీ వంటి వృత్తిపరమైన అర్హతలు ఉన్న అభ్యర్థులు, అలాగే కటాఫ్ తేదీ నాటికి ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులు.
  • వయోపరిమితి (01.04.2026 నాటికి) :21 నుండి 30 సంవత్సరాల వరకు ధరకాస్తూ చేసుకోవచ్చు . అంటే అప్లై చెయ్యడానికి 02 ఏప్రిల్ 1996 మరియు 01 ఏప్రిల్ 2005 మధ్య (రెండు తేదీలతో సహా) జన్మించి ఉండాలి . నిర్దిష్ట వర్గాలకు వయో సడలింపు నిబంధనల ప్రకారం వర్తిస్తుంది .
  • దరఖాస్తు రుసుము :UR/EWS/OBC లకు రూ. 750; SC/ST/PwBD లకు దరఖాస్తు రుసుము  లేదు. ఈ  రుసుము వాపసు చేయడం గాని బ్రాట్ ఫోరవార్డ్ చేయడం గాని జరగదు .
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు చివరి తేదీ : 8 జూలై 2026
  • ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్ , మెయిన్స్ , సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్  & ఇంటర్వ్యూ SBI PO రిక్రూట్‌మెంట్ 2026 ఎంపిక ప్రక్రియ మూడు దశలలో జరుగుతుంది : మొదటి దశ (ఫేజ్-I) ప్రిలిమినరీ పరీక్ష, రెండవ దశ (ఫేజ్-II) మెయిన్ పరీక్ష, మరియు మూడవ దశ (ఫేజ్-III) సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్ & ఇంటర్వ్యూ. తదుపరి దశకు పరిగణించబడటానికి అభ్యర్థులు ప్రతి దశలోనూ ఉత్తీర్ణత సాధించాలి, మరియు తుది మెరిట్ జాబితాను తయారు చేయడానికి రెండవ మరియు మూడవ దశల మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
  • పరీక్షకు  అనుమతించబడిన ప్రయత్నాల సంఖ్య: కేటగిరీ ఆధారంగా ఈ పరీక్షకు అనుమతించదగిన గరిష్ట ప్రయత్నాల సంఖ్యను SBI నిర్ధారించింది,  ఇప్పటికే తమకు కేటాయించిన అవకాశాలను  పూర్తిగా వినియోగించుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. ప్రధాన పరీక్షకు హాజరుకావడాన్ని మాత్రమే  ప్రయత్నంగా పరిగణిస్తారు, కేవలం ప్రిలిమినరీ పరీక్షకు హాజరుకావడాన్ని  ప్రయత్నంగా పరిగణించరు.యుఆర్ / ఇడబ్ల్యుఎస్ లకు 6 ప్రయత్నాలు , UR (PwBD) / EWS (PwBD) / OBC / OBC (PwBD) వర్గాలకు 9 ప్రయత్నాలు అనుమతించబడ్డాయి . ఎస్సీ / ఎస్సీ (పిడబ్ల్యుబిడి) / ఎస్టీ / ఎస్టీ (పిడబ్ల్యుబిడి) వారికి ఎటువంటి ప్రయత్నాల  పరిమితి లేదు.
  • జీతం : ప్రారంభ  మూల వేతనం రు .48,480/-(+4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు ), జూనియర్ మ్యానేజ్మెంట్ గ్రేడ్ స్కేలు-ఐ యొక్క  వేతన  స్కేలు  రు .48480-2000/7-62480 -2340/2-67160-2680 /7-85920 వర్తిస్తుంది . ఇతర అలవయన్స్లు  కలుస్తాయి .
  • అధికారిక వెబ్సైట్ : https://sbi.bank.in/web/careers/current-openings
  • సలహాలు సంప్రదింపులకు అధికారిక కాంటాక్ట్ నం: .022-22820427 (పని రోజులలో 11.00 AM నుండి 5.00 PM వరకు
  • సలహాలు సంప్రదింపులకు అధికారిక ఈమైల్ అడ్రసు: https ://cgrs. ibps .in
  • SBI PO అభ్యర్థులకు CIBIL స్కోర్ ఆవశ్యకత : ఎస్‌బిఐ పిఓ అనేది ఆర్థిక బాధ్యతలతో కూడిన బ్యాంకింగ్ ఉద్యోగం కాబట్టి, ఈ నియామకానికి సంబంధించిన ఒక ప్రత్యేక అర్హతా నిబంధన క్రెడిట్ హిస్టరీకి సంబంధించింది. క్రెడిట్ కార్డ్ బకాయిలతో సహా, ఏదైనా రుణం, ఎన్‌బిఎఫ్‌సి లేదా ఆర్థిక సంస్థ ఒప్పందం కింద తిరిగి చెల్లింపులో విఫలమైన అభ్యర్థులు , మరియు వారి ఖాతాలు సిబిల్ లేదా మరొక గుర్తింపు పొందిన క్రెడిట్ ఏజెన్సీలో ప్రతికూల క్రెడిట్ హిస్టరీని కలిగి ఉన్నవారు, బ్యాంకులో చేరే తేదీన లేదా అంతకు ముందుగా తమ బకాయిలన్నింటినీ క్రమబద్ధీకరించుకోవాలి లేదా తిరిగి చెల్లించాలి.
వివిధ లేటెస్ట్ ఉద్యోగాల ప్రకటనలు చూడడానికి లింక్ : ఉద్యోగ సమాచార వేదిక చూడండి
ముఖ్యమైన తేదీలు
సంఘటనతాత్కాలిక తేది
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & అప్లికేషన్ సవరణ చివరి తేది8 జూలై 2026 వరకు
దరఖాస్తు రుసుము చెల్లింపు18 జూన్ 2026 నుండి 8 జూలై 2026 వరకు
పరీక్షకు ముందు శిక్షణ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగులకు )జూలై 2026  
ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ల డౌన్‌లోడ్జూలై 2026 రెండవ/మూడవ వారం నుండి
మొదటి దశ: ఆన్‌లైన్ ప్రాథమిక (ప్రిలిమినరీ ) పరీక్షఆగస్టు 2026
ప్రాథమిక పరీక్ష ఫలితాల ప్రకటనఆగస్టు/సెప్టెంబర్ 2026
ప్రధాన పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ఆగస్టు/సెప్టెంబర్ 2026
రెండవ దశ: ఆన్‌లైన్ ప్రధాన పరీక్షసెప్టెంబర్ 2026
ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటనసెప్టెంబర్/అక్టోబర్ 2026
మూడవ దశ : సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ ఎక్సర్‌సైజ్ & ఇంటర్వ్యూఅక్టోబర్/నవంబర్ 2026  
తుది ఫలితాల ప్రకటననవంబర్/డిసెంబర్ 2026
                                      కేటగరీల వారీగా ఖాళీల వివరాలు
కేటగరిసాధారణ ఖాళీలుబ్యాక్లాగ్ ఖాళీలుమొత్తం ఖాళీలు
sc21618234
st10836144
obc390–390
ews144–144
ur588–588
మొత్తం1446541500
                                          కేటగరీల వారీగా వయో సడలింపు
కేటగరివయో సడలింపు
OBC (నాన్-క్రీమీ లేయర్)3 సంవత్సరాలు  
ఎస్సీ/ఎస్టీ5 సంవత్సరాలు
PwBD (UR/EWS)10 సంవత్సరాలు
PwBD (OBC)  13 సంవత్సరాలు
PwBD (SC/ST)15 సంవత్సరాలు
మాజీ సైనికులు / ECOలు / SSCOలు (5 సంవత్సరాల సర్వీస్)5 సంవత్సరాలు  
                                        తెలుగు  రాష్ట్రాలలో పరీక్ష సెంటర్లు
రాష్ట్రంప్రిలిమినరీ పరీక్ష సెంటర్లుమెయిన్ పరీక్ష సెంటర్లు
ఆంధ్ర ప్రదేశ్ఏలూరు ,గుంటూరు /విజయవాడ ,కడప ,కాకినాడ ,కర్నూల్, ఒంగోల్ ,రాజమండ్రి ,శ్రీకాకుళం ,తిరుపతి ,విశాఖపట్నం ,విజయనగరం  గుంటూరు /విజయవాడ, కర్నూల్, విశాఖపట్నం
తెలంగాణహైదరాబాద్ ,కరీంనగర్ ,ఖమ్మం , వరంగల్హైదరాబాద్, ఖమ్మం.
టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్ : గ్రూపులో చేరాడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

మొదటి దశ: ఎస్‌బిఐ పిఓ ప్రిలిమ్స్ పరీక్షా విధానం 2026

ప్రిలిమినరీ పరీక్ష అనేది 100 మార్కులకు జరిగే ఒక ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్. దీనిలోని మూడు విభాగాలకు వేర్వేరు సమయాలు కేటాయించి, 1 గంటలో పూర్తి చేయాల్సి ఉంటుంది . ప్రిలిమినరీ పరీక్షలో సెక్షనల్ కట్-ఆఫ్ అంటూ ఏమీ ఉండదు, కానీ మొత్తం స్కోర్ ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ప్రతి కేటగిరీలోని ఖాళీల సంఖ్యకు సుమారు 10 రెట్లు ఉన్న అభ్యర్థులను మెయిన్ పరీక్ష కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు.

సబ్జెక్టుప్రశ్నల సంఖ్యకాల పరిమితి
ఆంగ్ల భాష        4020 నిమిషాలు
పరిమాణాత్మక సామర్థ్యం (quantitative aptitude)3020 నిమిషాలు
తార్కిక సామర్థ్యం ( reasoning ability)      –   3020 నిమిషాలు
మొత్తం              1001 గంట

SBI PO ఉద్యోగాలకు  ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే విధానం

  • అభ్యర్థులు SBI PO రిక్రూట్‌మెంట్ 2026 కోసం 18 జూన్ 2026 నుండి 8 జూలై 2026 వరకు కేవలం ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు . ఇతర దరఖాస్తు విధానాలు ఆమోదించబడవు. దరఖాస్తు ప్రారంభించే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి. తుది ఫలితం ప్రకటించే వరకు అవి యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి,  అన్ని కాల్ లెటర్లు మరియు ఫలితానికి సంబంధించిన సమాచారాలు రెజిస్టర్డ్  ఈమెయిల్ ఐ డి కే  పంపబడతాయి.
  • SBI యొక్క అధికారిక కెరీర్ల పోర్టల్ https://sbi.bank.in/web/careers/current-openings ను సందర్శించండి (దీనిని https://bank.sbi/web/careers/current-openings లో కూడా యాక్సెస్ చేయవచ్చు ) మరియు ప్రకటన సంఖ్య CRPD/PO/2026-27/09 ను కనుగొనండి .
  • రిజిస్ట్రేషన్‌తో ముందుకు వెళ్లే ముందు, వివరణాత్మక ప్రకటన PDFను డౌన్‌లోడ్ చేసి జాగ్రత్తగా చదవండి.
  • ‘ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి’పై క్లిక్ చేసి , ‘ప్రస్తుత ఖాళీలు’ కింద ఉన్న రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను తెరవండి.
  • స్కాన్ చేయవలసిన పత్రాలను  ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి: మీ ఫోటోగ్రాఫ్ (4.5సెం.మీ x 3.5సెం.మీ, 200×230 పిక్సెల్స్, 20–50 KB), సంతకం (140×60 పిక్సెల్స్, 10–20 KB), ఎడమ చేతి బొటనవేలి ముద్ర (3సెం.మీ x 3సెం.మీ, 240×240 పిక్సెల్స్, 20–50 KB), మరియు చేతితో రాసిన ప్రకటన (10సెం.మీ x 5సెం.మీ, 800×400 పిక్సెల్స్, 50–100 KB), ఇవన్నీ JPG/JPEG ఫార్మాట్‌లో ఉండాలి.
  • దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి; మీరు పాక్షికంగా పూరించిన ఫారమ్‌ను సేవ్ చేసుకోవచ్చు, అలా చేయడం వలన ఒక తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ వస్తాయి, వాటిని మీరు తర్వాత కొనసాగించడానికి తప్పనిసరిగా వాడవలసి ఉంటుంది .
  • రిజిస్ట్రేషన్ సమయంలో మీ ల్యాప్టాప్  లేదా మొబైల్ ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా ఒక ఫోటో తీయండి, ఎందుకంటే అప్‌లోడ్ చేసిన ఫోటోతో పాటు ఇది కూడా తప్పనిసరి.
  • ఫారంను తుదిగా సమర్పించిన తర్వాత ఎటువంటి సవరణలకు అనుమతి ఉండదు కాబట్టి, ప్రతి ఫీల్డ్‌ను ఖచ్చితత్వం కోసం తిరిగి తనిఖీ చేయండి.
  • వర్తించే దరఖాస్తు రుసుమును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించండి; SC, ST మరియు PwBD అభ్యర్థులకు రుసుము నుండి మినహాయింపు ఉంది.
  • చెల్లింపు విజయవంతం అయిన తర్వాత, మీ రికార్డుల కోసం ఇ-రసీదు మరియు దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేసుకోండి.
అధికారిక నోటిఫికేషన్ చూడడానికి లింక్ అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ చూడండి
అప్లై చెయ్యడానికి లింక్ అప్లై చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
అధికారిక వెబ్సైట్ లింకు అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడండి

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading