భారతీయ ఏవియేషన్ సర్వీసెస్ (BAS) సంస్థ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ (CSA) మరియు లోడర్ / హౌస్‌కీపింగ్ పోస్టుల భర్తీ కోసం అర్హత కలిగిన పురుషులు మరియు మహిళల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు BAS అధికారిక వెబ్సైట్ www.bhartiyaaviation.in ద్వారా 05 అక్టోబర్ 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు . ఇతర ఏ విధానంలో సమర్పించిన దరఖాస్తులు స్వీకరించబడవు.
ముఖ్యాంశాలు
సంస్థ: భారతీయ ఏవియేషన్ సర్వీసెస్ (BAS)
ప్రకటన సంఖ్య: 05/Exam/CSA/LH/BAS/2026
ఉద్యోగాలు:
- కస్టమర్ సర్వీస్ ఏజెంట్ (Customer Service Agent)
- లోడర్ / హౌస్‌కీపింగ్ (Loader / Housekeeping)
అర్హులు:
- పురుషులు మరియు మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు :
- కస్టమర్ సర్వీస్ ఏజెంట్ (CSA) కు ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత
- లోడర్ / హౌస్‌కీపింగ్కు 10వ తరగతి (SSC) ఉత్తీర్ణ
మొత్తం ఉద్యోగాలు : 4211
మొత్తం కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగగాలు : 3108
మొత్తం లోడర్ / హౌస్‌కీపింగ్ ఉద్యోగాలు : 1103
వయోపరిమితి : (01 జనవరి 2027 నాటికి)
- కస్టమర్ సర్వీస్ ఏజెంట్ (CSA) కు కనీస వయస్సు: 18 సంవత్సరాలుగరిష్ట వయస్సు 27 సంవత్సరాలు
- లోడర్ / హౌస్‌కీపింగ్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు మరియు కనీస వయస్సు 18 సంవత్సరాలు
ధరకాస్తు రుసుము :
- కస్టమర్ సర్వీస్ ఏజెంట్ (CSA) కు ధరకాస్తు రుసుము రూ. 410 + GST
- లోడర్ / హౌస్‌కీపింగ్ ఉద్యోగాలకు ధరకాస్తు రుసుము 350 + GST
దరఖాస్తు విధానం:
- ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
- ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులు స్వీకరించబడవు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05 అక్టోబర్ 2026
సెలెక్షన్ విధానం :
- ఆబ్జెక్టివ్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ
అధికారిక వెబ్‌సైట్:
www.bhartiyaaviation.in
సంప్రదించుటకు వివరాలు:
- హెల్ప్‌లైన్: 8447-58-8447, 8447-79-8447, 8447-58-8446
- ఇ-మెయిల్: info@bhartiyaaviation.in
కార్యాలయ చిరునామా:
భారతీయ ఏవియేషన్ సర్వీసెస్ (BAS)
Plot No. 18, Sewak Park Gram Sabha,
Dwarka Mor, Near Pillar No. 773,
New Delhi – 110059.
ఉద్యోగం ,విద్యార్హత ,వేతనం మరియు ఖాళీల వివరాలు :
| ఉద్యోగం | విద్యార్హత | సుమారు వేతనం | మొత్తం ఖాళీలు |
|---|---|---|---|
| కస్టమర్ సర్వీస్ ఏజెంట్ (CSA) | ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత | రూ. 16,000 – రూ. 30,000 | 3108 |
| లోడర్ / హౌస్‌కీపింగ్ | 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత | రూ. 12,000 – రూ. 22,000 | 1103 |
గమనికలు:
- ఖాళీల సంఖ్య తాత్కాలికం మాత్రమే. సంస్థ అవసరాన్ని బట్టి ఖాళీల సంఖ్యను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
- పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష షెడ్యూల్ మరియు ఇతర ముఖ్యమైన తేదీలు
| ముఖ్యమైన అంశం | తేదీ / వివరాలు |
|---|---|
| ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ | 01 జూలై 2026 |
| ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ | 05 అక్టోబర్ 2026 |
| దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ | 05 అక్టోబర్ 2026 |
| పరీక్ష విధానం | ఆఫ్‌లైన్ లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) |
| పరీక్ష వ్యవధి | 90 నిమిషాలు (1 గంట 30 నిమిషాలు) |
| ఫలితాల ప్రకటన | పరీక్ష జరిగిన 10 రోజుల తర్వాత |
పరీక్ష రుసుము
| క్రమ సంఖ్య | ఉద్యోగం | పరీక్ష రుసుము |
|---|---|---|
| 1 | కస్టమర్ సర్వీస్ ఏజెంట్ (CSA) | రూ. 410 + GST |
| 2 | లోడర్ / హౌస్‌కీపింగ్ | రూ. 350 + GST |
గమనిక:
- రిజర్వేషన్ ఉన్నవారు మరియు రిజర్వేషన్ లేని వారు అనే తేడా లేకుండా, అన్ని వర్గాల అభ్యర్థులకు ఒకే పరీక్ష రుసుము వర్తిస్తుంది.
వయోపరిమితి (01 జనవరి 2027 నాటికి)
కస్టమర్ సర్వీస్ ఏజెంట్ (CSA):
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
లోడర్ / హౌస్‌కీపింగ్:
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
విద్యార్హత
కస్టమర్ సర్వీస్ ఏజెంట్ (CSA):
- గుర్తింపు పొందిన బోర్డు/విద్యాసంస్థ నుండి ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి.
- ప్రస్తుతం ఇంటర్మీడియట్ (10+2) పరీక్ష రాస్తున్న వారు లేదా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా తాత్కాలిక (Provisional) ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవచ్చు.
- అయితే 01 జనవరి 2027లోపు అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
లోడర్ / హౌస్‌కీపింగ్:
- గుర్తింపు పొందిన బోర్డు/విద్యాసంస్థ నుండి 10వ తరగతి (SSC) లేదా దానికి సమానమైన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి.
- దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ నాటికి విద్యార్హతను పూర్తి చేసి ఉండాలి.
పరీక్ష విధానం & భాష:
- భారతీయ ఏవియేషన్ సర్వీసెస్ (BAS) నిర్ణయం ప్రకారం పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) లేదా ఆఫ్‌లైన్ OMR ఆధారిత విధానంలో దేశవ్యాప్తంగా నిర్ణయించిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు.
- పరీక్షా నగరాలు / పరీక్షా కేంద్రాల జాబితా అధికారిక నోటిఫికేషన్‌లో లేదా BAS అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచబడుతుంది.
- ప్రశ్నాపత్రం హిందీ మరియు ఇంగ్లీష్ అనే రెండు భాషల్లో ఉంటుంది.
- అయితే, హిందీ మరియు ఇంగ్లీష్ వెర్షన్ల మధ్య అనువాదం లేదా అర్థ వివరణలో ఏవైనా తేడాలు, సందేహాలు లేదా విభేదాలు ఏర్పడితే, ఇంగ్లీష్ వెర్షన్‌నే తుది, ప్రామాణిక మరియు అధికారికంగా పరిగణిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షా కేంద్రాలు:
- అనంతపురం
- గుంటూరు
- కర్నూలు
- నెల్లూరు
- రాజమహేంద్రవరం (రాజమండ్రి)
- తిరుపతి
- విజయవాడ
- విశాఖపట్నం
- కడప
- ఒంగోలు
తెలంగాణలో పరీక్షా కేంద్రాలు:
- హైదరాబాద్
- కరీంనగర్
- ఖమ్మం
- మహబూబ్‌నగర్
- నల్గొండ
- వరంగల్
- నిజామాబాద్
- రామగుండం
- సిద్ధిపేట
- ఆదిలాబాద్
9. సిలబస్
రాత పరీక్ష మొత్తం 90 నిమిషాల వ్యవధితో నిర్వహించబడుతుంది. ఇందులో 100 ఆబ్జెక్టివ్ (MCQ) బహుళ ఎంపిక ప్రశ్నలు ఉంటాయి.
| సబ్జెక్ట్ | సిలబస్ | మార్కులు |
|---|---|---|
| ఇంగ్లీష్ | పదజాలం (Vocabulary), పర్యాయపదాలు & వ్యతిరేక పదాలు (Synonyms & Antonyms), ఒకే పదంతో ప్రత్యామ్నాయం (One Word Substitution), వ్యాకరణం, తప్పులను గుర్తించడం (Spotting Errors), వాక్య సవరణ, పేరా జంబుల్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్, Active & Passive Voice, Direct & Indirect Speech, Tenses, Articles, Conjunctions, Verbs, Idioms & Phrases, ఖాళీలు పూరించడం (Fill in the Blanks), వాక్యాల క్రమబద్ధీకరణ, ప్రాథమిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు | 20 |
| కరెంట్ అఫైర్స్ | జాతీయ & అంతర్జాతీయ సమకాలీన అంశాలు, ముఖ్య ప్రభుత్వ పథకాలు, అవార్డులు & గౌరవాలు, క్రీడలు, ఆర్థిక వ్యవస్థ, ముఖ్యమైన రోజులు & సంఘటనలు, సాధారణ జ్ఞానం, విమానయాన & రవాణా రంగంలోని తాజా పరిణామాలు | 15 |
| సైన్స్ & ఏవియేషన్ | ప్రాథమిక భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, పర్యావరణ శాస్త్రం, శాస్త్రీయ విషయాలు, విమానయాన పరిభాష, విమానాశ్రయ కార్యకలాపాలు, ఎయిర్‌లైన్ సేవలు, భద్రత & రక్షణ అవగాహన, ప్రాథమిక విమానయాన పరిజ్ఞానం | 10 |
| సామాజిక శాస్త్రం | భారత చరిత్ర, భారత రాజ్యాంగం & పాలనా వ్యవస్థ, భారతదేశం మరియు ప్రపంచ భూగోళ శాస్త్రం, సాంస్కృతిక వారసత్వం, పౌర శాస్త్రం, ప్రాథమిక సామాజిక అవగాహన | 15 |
| గణితం | సంఖ్యా పద్ధతి, శాతాలు, లాభం–నష్టం, నిష్పత్తి–సమానుపాతం, సగటు, సమయం–పని, సమయం–వేగం–దూరం, సాధారణ & చక్రవడ్డీ, బీజగణితం, జ్యామితి, క్షేత్రగణితం (Mensuration), త్రికోణమితి, డేటా విశ్లేషణ (Data Interpretation), సరళీకరణ, ఘాతాంకాలు, ప్రాథమిక అంకగణిత గణనలు | 20 |
| తార్కిక సామర్థ్యం (Reasoning Ability) | కోడింగ్–డీకోడింగ్, అక్షర & సంఖ్యా శ్రేణులు, సాదృశ్యాలు (Analogy), రక్త సంబంధాలు, దిశా నిర్ధారణ, సీటింగ్ అరేంజ్‌మెంట్, పజిల్స్, క్యాలెండర్ & గడియారం, మిస్సింగ్ నంబర్స్, డైస్ & క్యూబ్, తార్కిక విశ్లేషణ, సీక్వెన్స్ అరేంజ్‌మెంట్, స్టేట్‌మెంట్ & కంక్లూజన్, విశ్లేషణాత్మక సామర్థ్యం | 20 |
ముఖ్యమైన గమనికలు
- రాత పరీక్షలో అర్హత సాధించడానికి కనీసం 35% మార్కులు పొందాలి.
- నెగటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గించబడతాయి.
- ప్రశ్నాపత్రం హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. అయితే, రెండు భాషల మధ్య అనువాదం లేదా అర్థంలో ఏవైనా తేడాలు ఉంటే, ఇంగ్లీష్ వెర్షన్‌నే తుది మరియు అధికారికంగా పరిగణిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
దశ 1:
- దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించే ముందు పూర్తి నోటిఫికేషన్ / సమాచార పుస్తకాన్ని (Information Bulletin) జాగ్రత్తగా చదవండి.
- అభ్యర్థులు తమ వద్ద చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్ ఇ-మెయిల్ ఐడి, వాట్సాప్ నంబర్, మొబైల్ నంబర్ ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
- ఈ వివరాలు మొత్తం నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండాలి.
దశ 2:
- భారతీయ ఏవియేషన్ సర్వీసెస్ (BAS) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
దశ 3:
- అధికారిక వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ఉన్న “Apply Now” ఎంపికపై క్లిక్ చేయండి.
దశ 4:
- కొత్త అభ్యర్థులు పేరు, ఇ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, జన్మతేది వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
- జన్మతేది (Date of Birth) ప్రారంభ (డిఫాల్ట్) పాస్‌వర్డ్‌గా ఉపయోగించబడుతుంది.
- ఇప్పటికే రిజిస్టర్ అయిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్తో లాగిన్ అవ్వవచ్చు.
దశ 5:
- దరఖాస్తు చేయాలనుకునే ఉద్యోగాన్ని ఎంపిక చేసి, ఈ వివరాలను నమోదు చేయాలి:
- మొదటి పేరు (First Name)
- ఇంటి పేరు (Last Name)
- చెల్లుబాటు అయ్యే ఇ-మెయిల్ ఐడి
- వాట్సాప్ నంబర్
- పాస్‌వర్డ్ (జన్మతేది)
దశ 6:
- సంబంధిత సర్టిఫికెట్లు/మార్కుల పట్టికల ప్రకారం విద్యార్హత వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి.
దశ 7:
- సూచించిన ఫార్మాట్‌లో ఈ పత్రాలను అప్‌లోడ్ చేయాలి:
- ఇటీవల తీసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో (3 నెలల కంటే పాతది కాకూడదు)
- అభ్యర్థి సంతకం
దశ 8:
- పూర్తి శాశ్వత చిరునామా మరియు సంప్రదింపు చిరునామా, పిన్ కోడ్‌తో సహా నమోదు చేయాలి.
దశ 9:
- మీకు కావలసిన పరీక్ష జరిగే రాష్ట్రం మరియు పరీక్షా నగరాన్ని ఎంచుకుని దరఖాస్తును సమర్పించాలి.
దశ 10:
- చెల్లింపు చేయడానికి ముందు దరఖాస్తులో నమోదు చేసిన అన్ని వివరాలను పూర్తిగా పరిశీలించి ధృవీకరించాలి.
- దరఖాస్తు రుసుము చెల్లింపు పూర్తయిన తర్వాత వివరాలను సవరించడానికి లేదా మార్చడానికి అవకాశం ఉండదు.
గమనిక
- చెల్లింపు ప్రక్రియ జరుగుతున్న సమయంలో వెబ్‌పేజీని రిఫ్రెష్ చేయకండి లేదా Back బటన్‌ను నొక్కకండి.
- నిర్ధారణ (Confirmation) సందేశం వచ్చే వరకు వేచి ఉండండి. అనంతరం సిస్టమ్ స్వయంచాలకంగా అభ్యర్థి డ్యాష్‌బోర్డ్‌కు మళ్లిస్తుంది.
దశ 11:
- సమర్పించిన దరఖాస్తు ఫారమ్ కాపీ రిజిస్టర్ చేసిన ఇ-మెయిల్ ఐడీకి పంపబడుతుంది.
- భవిష్యత్ అవసరాల కోసం అభ్యర్థులు తమ డ్యాష్‌బోర్డ్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించే ముందు అభ్యర్థులు ఈ క్రింది పత్రాలు మరియు వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి:
- అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు మరియు జన్మతేదీకి ఆధారంగా బోర్డు/విశ్వవిద్యాలయం జారీ చేసిన సర్టిఫికేట్ లేదా మార్కుల మెమో.
- ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం (ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, బ్యాంక్ పాస్‌బుక్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి).
- విద్యార్హత సర్టిఫికెట్లు / మార్కుల మెమోలు లేదా అవసరమైతే తాజా సెమిస్టర్/సంవత్సర మార్కుల మెమో.
- పూర్తి ఉత్తర ప్రత్యుత్తర (Correspondence/Mailing) చిరునామా, శాశ్వత చిరునామా మరియు పిన్ కోడ్.
- వర్తించే వారికి కుల ధృవీకరణ పత్రం (Category Certificate).
- అవసరమైతే ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు (Result Awaited) ధృవీకరణ పత్రం.
- ఇటీవల తీసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం స్కాన్ చేసిన కాపీలు JPG/JPEG ఫార్మాట్‌లో.
అదనంగా:
- భవిష్యత్ సమాచార మార్పిడికి చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్ ఇ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.
| అధికారిక నోటిఫికేషన్ | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగాలకు అప్లై చెయ్యడానికి లింక్ | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| లోడర్ / హౌస్‌కీపింగ్ ఉద్యోగాలకు అప్లై చెయ్యడానికి లింక్ | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| అధికారిక వెబ్సైట్ | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| లేటెస్ట్ ఉద్యోగ ప్రకటనలు చూడడానికి లింక్ | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్ | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| EMPLOYMENT NEWS వీక్లీలు చూడడానికి లింక్ | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
Leave a Reply