ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవారిక HALలో అద్భూత అవకాశం .మేనేజ్‌మెంట్ ట్రైనీ & డిజైన్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల అయింది

HAL Recruitment 2026: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) దేశంలోని ప్రముఖ మహారత్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి. HAL Management Trainee (MT) మరియు Design Trainee (DT) పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 120 ఖాళీలకు ఇంజినీరింగ్ పట్టభద్రుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ నోటిఫికేషన్ ద్వారా BE/B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగంలో ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు14-08-2026 లోపల ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి .


ముఖ్యమైన అంశాలు

సంస్థ

  • హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)
  • భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మహారత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ (PSU).

ప్రకటన సంఖ్య

HAL/CHRC-TM/RECT-02/2026

ఉద్యోగాలు

  • Management Trainee (MT)
  • Design Trainee (DT)

మొత్తం ఖాళీలు: 120 పోస్టులు

  • Design Trainee (DT) – 60
  • Management Trainee (MT) – 60

విభాగాలు

Design Trainee (DT):

  • ఏరోనాటికల్
  • ఎలక్ట్రికల్
  • ఎలక్ట్రానిక్స్
  • ఇన్‌స్ట్రుమెంటేషన్
  • మెకానికల్
  • కంప్యూటర్ సైన్స్
  • మెటలర్జీ

Management Trainee (MT):

  • ఎలక్ట్రికల్
  • ఎలక్ట్రానిక్స్
  • మెకానికల్
  • కంప్యూటర్ సైన్స్
  • మెటలర్జీ
  • ప్రొడక్షన్
  • సివిల్

విద్యార్హత

  • సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో BE/B.Tech లేదా సమాన అర్హత (పూర్తి విద్యార్హతలు వివరమైన నోటిఫికేషన్‌లో ప్రకటించబడతాయి.)

ధరకాస్తు రుసుము

  • UR / OBC (NCL) / EWS లకు ₹500/- (GSTతో కలిపి)
  • మిగిలిన వారికి ధరకాస్తు రుసుము లేదు

వయో పరిమితి

  • UR (General) మరియు EWS అభ్యర్థులు: 14-08-2026 నాటికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు.నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది

పరీక్ష విధానం

  • ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test – CBT)
  • వ్యక్తిగత ఇంటర్వ్యూ (Personal Interview) – బెంగళూరులో నిర్వహించబడుతుంది.

దరఖాస్తు విధానం

  • ఆన్‌లైన్ ద్వారా మాత్రమే

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 29-07-2026 మధ్యాహ్నం 2:00 గంటలకు
  • చివరి తేది: 14-08-2026 మధ్యాహ్నం 2:00 గంటలకు

ఉద్యోగ స్థలం

  • HAL యొక్క భారతదేశంలోని వివిధ డివిజన్లు, రీసెర్చ్ & డిజైన్ సెంటర్లు మరియు కార్యాలయాలు.

అధికారిక వెబ్సైట్


Design Trainee (DT) – పోస్టుల వారీ రిజర్వేషన్

విభాగంSCSTOBC (NCL)EWSURమొత్తం
ఏరోనాటికల్1124
ఎలక్ట్రికల్113117
ఎలక్ట్రానిక్స్3352720
ఇన్‌స్ట్రుమెంటేషన్1113
మెకానికల్2263922
కంప్యూటర్ సైన్స్123
మెటలర్జీ11
మొత్తం861762360

Management Trainee (MT) – పోస్టుల వారీ రిజర్వేషన్

విభాగంSCSTOBC (NCL)EWSURమొత్తం
ఎలక్ట్రికల్1121611
ఎలక్ట్రానిక్స్2141412
మెకానికల్5483727
కంప్యూటర్ సైన్స్11
మెటలర్జీ112
ప్రొడక్షన్111115
సివిల్112
మొత్తం1071762060

120 ఖాళీలలో బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా చేర్చబడ్డాయి.

  • SC: 2 బ్యాక్‌లాగ్ పోస్టులు
  • ST: 5 బ్యాక్‌లాగ్ పోస్టులు
  • OBC (NCL): 5 బ్యాక్‌లాగ్ పోస్టులు

విద్యార్హత

HAL విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం Design Trainee (DT) మరియు Management Trainee (MT) పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు క్రింది విద్యార్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

  • అభ్యర్థి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో BE/B.Tech లేదా దానికి సమానమైన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • Regular / Full-Time Degree మాత్రమే అర్హతగా పరిగణించబడుతుంది.
  • AICTE/UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • 10+2+4 లేదా 10+3+3 (Lateral Entry) విధానంలో పూర్తి చేసిన ఇంజినీరింగ్ డిగ్రీలు అర్హత పొందుతాయి.

Design Trainee (DT) – అర్హత గల ఇంజినీరింగ్ విభాగాలు

పోస్టుఅర్హత గల ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు
AeronauticalAerospace Engineering, Aeronautical Engineering
ElectricalElectrical, Electrical & Electronics (EEE), Electrical & Instrumentation, Electrical Instrumentation & Control Engineering, Electrical & Power Engineering
ElectronicsElectronics, Electronics & Communication (ECE), Electronics & Telecommunication, Electronics Engineering (VLSI Design & Technology), Electronics & Control Systems, Electronics & Communication (Communication Systems Engineering)
InstrumentationInstrumentation & Control, Instrumentation & Electronics, Applied Electronics & Instrumentation, Electronics & Instrumentation
MechanicalMechanical Engineering, Mechanical & Industrial Engineering, Mechanical & Production Engineering, Mechatronics Engineering, Mechanical & Automation Engineering
Computer ScienceComputer Science, Computer Engineering, Computer Science & IT, Information Technology, Information Science & Technology, Computer Systems Engineering, Information Systems, Information Science & Engineering, Software Engineering, Computer Technology, Computer Science & Engineering, Computer Science & Engineering (Artificial Intelligence), Computer Science & Engineering (Artificial Intelligence & Machine Learning), Computer Science & Engineering (Cyber Security), Computer & Communication Engineering, Computer Networking
MetallurgyMetallurgy, Materials & Metallurgy, Metallurgy & Materials Engineering, Metallurgy & Materials Technology, Metallurgy & Material Science

Management Trainee (MT) – అర్హత గల ఇంజినీరింగ్ విభాగాలు

పోస్టుఅర్హత గల ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు
ElectricalElectrical, Electrical & Electronics (EEE), Electrical & Instrumentation, Electrical Instrumentation & Control Engineering, Electrical & Power Engineering
ElectronicsElectronics, Electronics & Communication (ECE), Electronics & Telecommunication, Electronics Engineering (VLSI Design & Technology), Electronics & Control Systems, Electronics & Communication (Communication Systems Engineering)
MechanicalMechanical Engineering, Mechanical & Industrial Engineering, Mechanical & Production Engineering, Mechatronics Engineering, Mechanical & Automation Engineering
Computer ScienceComputer Science, Computer Engineering, Computer Science & IT, Information Technology, Information Science & Technology, Computer Systems Engineering, Information Systems, Information Science & Engineering, Software Engineering, Computer Technology, Computer Science & Engineering, Computer Science & Engineering (Artificial Intelligence), Computer Science & Engineering (Artificial Intelligence & Machine Learning), Computer Science & Engineering (Cyber Security), Computer & Communication Engineering, Computer Networking
MetallurgyMetallurgy, Materials & Metallurgy, Metallurgy & Materials Engineering, Metallurgy & Materials Technology, Metallurgy & Material Science
ProductionProduction Engineering, Production & Industrial Engineering, Industrial Engineering, Manufacturing Engineering, Production Engineering & Management (నోటిఫికేషన్‌లో పేర్కొన్న సమాన బ్రాంచ్‌లు వర్తిస్తాయి.)
CivilCivil Engineering

కనీస అర్హత మార్కులు (Aggregate Percentage of Marks )

HAL విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం Design Trainee (DT) మరియు Management Trainee (MT) పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు తమ BE/B.Tech కోర్సులో అన్ని సెమిస్టర్లు/సంవత్సరాల మొత్తం మార్కుల ఆధారంగా క్రింది కనీస అగ్రిగేట్ శాతాన్ని తప్పనిసరిగా సాధించి ఉండాలి.

కనీస అగ్రిగేట్ మార్కులు

పోస్టుUR / OBC (NCL) / EWSSC / ST / PwBD
Design Trainee (అన్ని విభాగాలు)70%60%
Management Trainee (అన్ని విభాగాలు)70%60%

వయోపరిమితి

  • UR (General) మరియు EWS అభ్యర్థులు: 14-08-2026 నాటికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు.

గమనిక: OBC (NCL), SC, ST, EWS అభ్యర్థులు UR (General) కేటగిరీలో దరఖాస్తు చేస్తే, వారికి UR వయోపరిమితి (28 సంవత్సరాలు) మాత్రమే వర్తిస్తుంది.


వయో సడలింపులు

కేటగిరీవయో సడలింపు
SC / ST5 సంవత్సరాలు
OBC (Non-Creamy Layer)3 సంవత్సరాలు
PwBD (Persons with Benchmark Disabilities)10 సంవత్సరాలు (SC/ST/OBC వారికి వర్తించే సడలింపుకు అదనంగా)
జమ్మూ & కాశ్మీర్ నివాసితులు (01-01-1980 నుండి 31-12-1989 మధ్య అక్కడ నివసించిన వారు)5 సంవత్సరాలు
Ex-Servicemen / Commissioned Officers / ECO / SSCOప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్టంగా 5 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము (Application Fee)

కేటగిరీదరఖాస్తు రుసుము
UR / OBC (NCL) / EWS₹500/- (GSTతో కలిపి)
SC / ST / PwBD / HAL Internal Candidatesరుసుము లేదు (Fee Exempted)
  • దరఖాస్తు రుసుము ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
  • ఒకసారి చెల్లించిన Application Fee ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వబడదు (Non-Refundable).
  • తప్పు ఖాతాకు లేదా ఒకటి కంటే ఎక్కువసార్లు చెల్లించిన రుసుముకు HAL బాధ్యత వహించదు.
  • రుసుము చెల్లించే ముందు అభ్యర్థులు తమ అర్హతలను పూర్తిగా పరిశీలించుకోవాలి.

HAL నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్, శిక్షణ మరియు వేతనానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు


పోస్టింగ్ (Placement)

ఎంపికైన Management Trainee (MT) మరియు Design Trainee (DT) అభ్యర్థులను HAL అవసరాలను బట్టి దేశంలోని వివిధ యూనిట్లలో నియమిస్తారు.

పోస్టింగ్ పొందే విభాగాలు:

  • ఉత్పత్తి విభాగాలు (Production Divisions)
  • ఓవర్‌హాల్ విభాగాలు (Overhaul Divisions)
  • సర్వీస్ డివిజన్లు (Services Divisions)
  • రీసెర్చ్ & డిజైన్ సెంటర్లు (R&D Centres)
  • HAL కార్యాలయాలు (Offices)

గమనిక: పోస్టింగ్ స్థలాన్ని అభ్యర్థి ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు. కంపెనీ అవసరాల మేరకు నియామకం జరుగుతుంది.


శిక్షణ (Training)

ఎంపికైన అభ్యర్థులు 52 వారాల (1 సంవత్సరం) శిక్షణను పూర్తి చేయాలి.

శిక్షణలో భాగంగా:

  • సిద్ధాంత (Theoretical) శిక్షణ
  • ప్రాక్టికల్ / On-the-Job Training (OJT)
  • HAL యొక్క వివిధ యూనిట్లలో శిక్షణ

శిక్షణ కాలంలో వేతనం (Stipend During Training)

శిక్షణ కాలంలో అభ్యర్థులకు క్రింది ప్రయోజనాలు అందిస్తారు.

అంశంవివరాలు
బేసిక్ పే₹50,000/- నెలకు
డియర్‌నెస్ అలవెన్స్ (VDA)కంపెనీ నిబంధనల ప్రకారం
కాంటీన్ అలవెన్స్కంపెనీ నిబంధనల ప్రకారం
బ్యాచిలర్ వసతికంపెనీ నిబంధనల ప్రకారం ఉచితంగా/అర్హత మేరకు

శిక్షణ పూర్తయిన తర్వాత

52 వారాల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులను Engineer – Grade IIగా నియమిస్తారు.

పే స్కేల్

₹50,000 – ₹1,60,000


శిక్షణ అనంతరం లభించే ప్రయోజనాలు

Engineer Grade-IIగా నియామకం పొందిన తర్వాత అభ్యర్థులకు క్రింది సౌకర్యాలు లభిస్తాయి.

  • ✅ బేసిక్ పే
  • ✅ వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (VDA)
  • ✅ Cafeteria విధానంలో వివిధ అలవెన్సులు
  • ✅ కంపెనీ వసతి లేదా HRA (House Rent Allowance)
  • ✅ Performance Related Pay (PRP)
  • ✅ వైద్య సదుపాయాలు (Medical Facilities)
  • ✅ ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund – PF)
  • ✅ గ్రాట్యుటీ (Gratuity)
  • ✅ పదవీ విరమణ అనంతర ప్రయోజనాలు (Superannuation Benefits)
  • ✅ HAL నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు

HAL రిక్రూట్మెంట్ 2026 – ఎంపిక విధానం (Selection Process)

HAL విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం Design Trainee (DT) మరియు Management Trainee (MT) పోస్టుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది.

ఎంపిక దశలు

  1. ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test – CBT)
  2. వ్యక్తిగత ఇంటర్వ్యూ (Personal Interview) – బెంగళూరులో నిర్వహించబడుతుంది.

ఆన్‌లైన్ పరీక్ష (CBT) వివరాలు

  • పరీక్ష అఖిల భారత స్థాయిలో (All India Basis) నిర్వహించబడుతుంది.
  • పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు (150 నిమిషాలు).
  • పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQs) ఉంటాయి.
  • మొత్తం పరీక్షను మూడు భాగాలుగా నిర్వహిస్తారు.

పరీక్షా నమూనా

భాగంసబ్జెక్ట్ప్రశ్నలు
Part-Iజనరల్ అవేర్‌నెస్ (General Awareness)20
Part-IIఇంగ్లీష్ & రీజనింగ్ (English & Reasoning)40
Part-IIIసంబంధిత ఇంజినీరింగ్ విభాగం (Concerned Discipline)100
మొత్తంMCQs160 ప్రశ్నలు

పరీక్ష భాష

అభ్యర్థులు పరీక్షను క్రింది రెండు భాషల్లో ఏదైనా ఒకదానిలో రాయవచ్చు.

  • English
  • Hindi

ముఖ్య గమనిక: దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు English లేదా Hindi భాషను ఎంపిక చేయాలి. ఒకసారి ఎంపిక చేసిన తర్వాత పరీక్ష భాషను మార్చుకునే అవకాశం ఉండదు.


వ్యక్తిగత ఇంటర్వ్యూ

  • ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను బెంగళూరులో (Bengaluru) నిర్వహించే Personal Interviewకు పిలుస్తారు.
  • తుది ఎంపిక HAL నిబంధనల ప్రకారం CBT మరియు ఇంటర్వ్యూలో అభ్యర్థి ప్రతిభ ఆధారంగా ఉంటుంది.

HAL రిక్రూట్మెంట్ 2026 – దరఖాస్తు విధానం (Registration Process)

దరఖాస్తు చేయడానికి ముందు సిద్ధంగా ఉంచాల్సినవి

  • చెల్లుబాటు అయ్యే E-mail ID మరియు మొబైల్ నంబర్.
  • పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో (.JPG, 180 KB లోపు).
  • ఆధార్ నంబర్ మరియు ఇతర వ్యక్తిగత వివరాలు.
  • విద్యార్హత వివరాలు (సెమిస్టర్ వారీ మార్కులు).
  • ఉద్యోగ అనుభవ వివరాలు (ఉంటే).

దరఖాస్తు విధానం

  • HAL అధికారిక వెబ్‌సైట్ www.hal-india.co.inద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
  • దరఖాస్తు కాలం: 29-07-2026 (2:00 PM) నుండి 14-08-2026 (2:00 PM) వరకు.
  • ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులు స్వీకరించబడవు.

ఆన్‌లైన్ దరఖాస్తు దశలు

  1. Career విభాగంలో సంబంధిత పోస్టును ఎంపిక చేసి రిజిస్ట్రేషన్ చేయాలి.
  2. OTP ద్వారా E-mail ధృవీకరణ పూర్తి చేయాలి.
  3. అర్హత వివరాలు, ఫోటో అప్‌లోడ్ చేసి Application Number పొందాలి.
  4. వ్యక్తిగత & విద్యార్హత వివరాలను నమోదు చేసి సమర్పించాలి.
  5. UR/OBC(NCL)/EWS అభ్యర్థులు ₹500 దరఖాస్తు రుసుమును Credit Card / Internet Banking / UPI ద్వారా చెల్లించాలి.
  6. చివరగా Application Confirmation Pageను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

ముఖ్య సూచనలు

  • SC/ST/PwBD/HAL Internal Candidates దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
  • ఒకసారి చెల్లించిన Application Fee తిరిగి ఇవ్వబడదు.
  • చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది.
  • రుసుము చెల్లించకుండా లేదా అన్ని దశలు పూర్తి చేయకుండా ఉంటే దరఖాస్తు తిరస్కరించబడుతుంది.

HAL అధికారిక షార్ట్ నోటిఫికేషన్ చూడడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
అధికారిక వివరణాత్మక నోటిఫికేషన్ లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
అప్లై చెయ్యడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
అధికారిక వెబ్సైట్ లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
లేటెస్ట్ ఉద్యోగాల వివరాలు చూడడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
డైలీ హెడ్ లైన్ న్యూస్ మరియు కరంట్ అఫిర్స్ చూడడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
డైలీ హెడ్లైన్ న్యూస్ కరంట్ అఫైర్స్ చూడడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading