ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) లో111 ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది .అప్లై చెయ్యడానికి చివరి తేది 13 ఆగస్టు 2026

రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) బెంగళూరు, ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 పోస్టుల భర్తీ కోసం తాత్కాలిక (Tenure Basis) ప్రాతిపదికన నియామకాలు చేపడుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://www.ada.gov.in ద్వారా 13-08-2026 సాయంత్రం 5:00 గంటల లోపు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. GATEIIT/NIT నుండి M.E./M.Tech/ B.Sc + M.Sc + చెల్లుబాటు అయ్యే GATE/NET స్కోర్ (కంప్యూటర్ సైన్స్ & ECE పోస్టులకు వర్తిస్తుంది) ఉన్న అభ్యర్ధులకు నమోదు పూర్తయిన తర్వాత 01-09-2026 నుండి 04-09-2026 వరకు జరిగే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు ఉదయం 8:30 గంటలకు ADA, బెంగళూరులో రిపోర్ట్ చేయాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యేటప్పుడు దరఖాస్తు ప్రింట్ కాపీతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు వాటి స్వీయ ధృవీకరించిన ప్రతులు తీసుకెళ్లడం తప్పనిసరి. ఎంపిక పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది, మరియు నిర్ణీత తేదీ, సమయానికి హాజరుకాని అభ్యర్థులను ఇంటర్వ్యూకు అనుమతించకపోవచ్చు కాబట్టి, గడువు తేదీలను జాగ్రత్తగా గమనించుకోవడం ముఖ్యం. మిగిలిన వారికి ఎంపికరాత పరీక్ష + ఇంటర్వ్యూ ద్వారా ద్వారా ఉంటుంది. వారికి రాత పరీక్ష తాత్కాలిక తేదీలు16 ఆగస్టు 2026, 23 ఆగస్టు 2026 లేదా 30 ఆగస్టు 2026.

ADA (ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) – సంక్షిప్త పరిచయం
Aeronautical Development Agency (ADA) భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence) ఆధ్వర్యంలో పనిచేసే ప్రముఖ ఏరోస్పేస్ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. భారతదేశానికి అత్యాధునిక యుద్ధ విమానాల రూపకల్పన (Design) మరియు అభివృద్ధి (Development) చేయడం దీని ప్రధాన లక్ష్యం.స్వదేశీ యుద్ధ విమానాల రూపకల్పనలో ప్రపంచ స్థాయి సాంకేతికతను అభివృద్ధి చేస్తూ, భారత వైమానిక రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ రంగంలో ఏరోస్పేస్, ఇంజనీరింగ్ మరియు రక్షణ సాంకేతికతలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ADA ఒక అద్భుతమైన కెరీర్ అవకాశాలను అందించే సంస్థ.

ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) – ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 నియామకాలు 2026 (సంక్షిప్త వివరాలు)

అంశంవివరాలు
సంస్థఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
నోటిఫికేషన్ నం.ADA: ADV-138:2026
ప్రకటన తేదీ03-08-2026
ఉద్యోగంప్రాజెక్ట్ అసిస్టెంట్-1 (Project Assistant-1)
ఉద్యోగ విధానంకాంట్రాక్ట్ (Tenure Basis)
అర్హులుభారతీయ పౌరులు
విద్యార్హతB.E./B.Tech / M.E./M.Tech/B.Sc + M.Sc GATE స్కోర్ ఉన్నా లేకున్నా అప్లై చేసుకోవచ్చు
దరఖాస్తు విధానంఆన్‌లైన్ నమోదు అనంతరం ఇంటర్వ్యూ/రాత పరీక్షకు హాజరు కావాలి
దరఖాస్తు వెబ్‌సైట్https://ada.gov.in
ఆన్‌లైన్ నమోదు చివరి తేదీ13 ఆగస్టు 2026 సాయంత్రం 5:00 గంటల వరకు
ఇంటర్వ్యూ / రాత పరీక్షదరఖాస్తు ఫారం, ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు స్వీయ ధృవీకరించిన (Self-attested) ప్రతులతో హాజరు కావాలి
రాతపరీక్షా కేంద్రం /ఇంటర్వ్యూ కేంద్రంబెంగళూరు

    ADA నియామకాలు 2026 – ముఖ్యమైన తేదీలు

    కార్యక్రమంతేదీ
    ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ24-07-2026
    ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ13-08-2026
    విద్యార్హత & వయస్సు నిర్ణయించే తేదీ13-08-2026 (దరఖాస్తుల చివరి తేదీ నాటికి)
    రాత పరీక్ష / ఇంటర్వ్యూ తేదీ16 ఆగస్టు 2026, 23 ఆగస్టు 2026 లేదా 30 ఆగస్టు 2026.01-09-2026 నుండి 04-09-2026 వరకు జరిగే వాక్-ఇన్ ఇంటర్వ్యూ. ఖచ్చితమైన తేదీలు తరువాత ADA అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు
    వయస్సు & విద్యార్హత నిర్ణయ తేదీఅభ్యర్థుల వయస్సు మరియు విద్యార్హతను 13 ఆగస్టు 2026 (దరఖాస్తుల చివరి తేదీ) నాటికి పరిగణనలోకి తీసుకుంటారు.

    గమనిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం, అవసరమైన ధృవీకరణ పత్రాలు మరియు ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలి.

    పోస్టుల వివరాలు

    ఇంజినీరింగ్ విభాగంఅంగీకరించే బ్రాంచ్‌లుఖాళీలు
    కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ఇన్ఫర్మేషన్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ15
    ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ఎలక్ట్రానిక్స్ / టెలికమ్యూనికేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్20
    ఏరోనాటికల్ ఇంజినీరింగ్ఏరోస్పేస్10
    ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ / పవర్ ఎలక్ట్రానిక్స్20
    మెకానికల్ ఇంజినీరింగ్ప్రొడక్షన్ / ఇండస్ట్రియల్ ప్రొడక్షన్43
    మెటలర్జీ ఇంజినీరింగ్మెటీరియల్ సైన్స్01
    సివిల్ ఇంజినీరింగ్స్ట్రక్చరల్02

    మొత్తం తాత్కాలిక ఖాళీలు: 111 (15 + 20 + 10 + 20 + 43 + 1 + 2).

    అర్హతలు (First Class తప్పనిసరి)

    ఇంటర్వ్యూతో నేరుగా ఎంపిక (Written Test లేకుండ ) సంబంధిత విభాగంలో :

    • B.E./B.Tech + చెల్లుబాటు అయ్యే GATE స్కోర్
    • IIT/NIT నుండి M.E./M.Tech
    • B.Sc + M.Sc + చెల్లుబాటు అయ్యే GATE/NET స్కోర్ (కంప్యూటర్ సైన్స్ & ECE పోస్టులకు వర్తిస్తుంది)

    రాత పరీక్ష + ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక( సంబంధిత విభాగంలో ):

    • B.E./B.Tech + M.E./M.Tech
    • B.E./B.Tech + సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం
    • B.Sc + M.Sc + 2 సంవత్సరాల అనుభవం (CSE & ECEకు వర్తిస్తుంది)
    • కేవలం B.E./B.Tech (First Class)

    ఎంపిక విధానం

    • GATE/NET లేదా IIT/NIT అర్హత ఉన్న అభ్యర్థులకు: ఇంటర్వ్యూ మాత్రమే
    • మిగిలిన అభ్యర్థులకు: రాత పరీక్షలో షార్ట్‌లిస్టింగ్ → ఇంటర్వ్యూ

    ముఖ్య గమనిక

    • రాత పరీక్ష GATE సిలబస్ ఆధారంగా ఉంటుంది.
    • తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
    • పరీక్షకు Scientific Calculator తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు.

    వయోపరిమితి, స్టైపెండ్ & ఉద్యోగ కాలపరిమితి

    అంశంవివరాలు
    గరిష్ట వయోపరిమితి28 సంవత్సరాలు
    వయో సడలింపుSC / ST / OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
    స్టైపెండ్ (B.E./B.Tech ఫస్ట్ క్లాస్ మాత్రమే ఉన్న అభ్యర్థులు)నెలకు ₹31,000 + నిబంధనల ప్రకారం HRA
    స్టైపెండ్ (ఇతర అర్హతలు కలిగిన అభ్యర్థులు)నెలకు ₹37,000 + నిబంధనల ప్రకారం HRA
    ఉద్యోగ కాలపరిమితి (Tenure)ప్రారంభంలో 2 సంవత్సరాలు
    పొడిగింపు అవకాశంపనితీరు సంతృప్తికరంగా ఉంటే, రివ్యూ కమిటీ సిఫారసు మేరకు మరో 2 సంవత్సరాల వరకు (ఒక్కోసారి 1 సంవత్సరం చొప్పున) పొడిగించవచ్చు.

    తప్పక గుర్తుంచుకోవాలసిన ముఖ్యాంశాలు

    అంశంవివరాలు
    వయస్సు & విద్యార్హత నిర్ణయ తేదీఅభ్యర్థుల వయస్సు మరియు విద్యార్హతను 13 ఆగస్టు 2026 (దరఖాస్తుల చివరి తేదీ) నాటికి పరిగణనలోకి తీసుకుంటారు.
    ఇంటర్వ్యూకు తీసుకురావాల్సిన పత్రాలుపూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం, విద్యార్హత, అనుభవం, కుల ధృవీకరణ పత్రాల అట్టెస్టెడ్ కాపీలు మరియు ఇతర అవసరమైన పత్రాలు తీసుకురావాలి.
    ఫోటోదరఖాస్తు మొదటి పేజీ కుడి పై మూలలో తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో అతికించాలి.
    ఆంగ్లేతర పత్రాలుఇంగ్లీష్ కాకుండా ఇతర భాషల్లో ఉన్న సర్టిఫికెట్లకు స్వీయ ధృవీకరించిన ఆంగ్ల అనువాద ప్రతిని జత చేయాలి.
    ఒరిజినల్ సర్టిఫికెట్లుధృవీకరణ కోసం అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాలి.
    అనుభవం లెక్కింపుపార్ట్‌టైమ్ అనుభవం, అప్రెంటిస్‌షిప్, శిక్షణ కాలం, ట్రైనీ అనుభవం, బోధన అనుభవం అనుభవ సంవత్సరాల లెక్కింపులో పరిగణించబడవు.
    అప్‌డేట్స్తాజా సమాచారం కోసం అభ్యర్థులు ADA అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా సందర్శించాలి.
    పరీక్ష / ఇంటర్వ్యూ అర్హతఆన్‌లైన్‌లో నమోదు (Registration) చేసిన అభ్యర్థులకు మాత్రమే రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.
    దరఖాస్తు ఫారంరిజిస్ట్రేషన్ మాత్రమే సరిపోదు. పరీక్ష/ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం మరియు సంబంధిత ఆధార పత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలి.
    ADA – ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 అధికారిక నోటిఫికేషన్ https://ada.gov.in/currentdocs/ADV138/ADV_138_noti.pdf
    అప్లై చెయ్యడానికి లింక్ ADV_138_APPL.pdf
    ADA వెబ్సైట్ లింక్ Aeronautical Development Agency
    లేటెస్ట్ ఉద్యోగాలు చెయ్యడానికి లింక్ https://uchitaudyogasamachar.in/
    టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్ https://t.me/+_YbmSS-J7-I0ODg1
    ఎంప్లాయ్మెంట్ న్యూస్ వీక్లీలు చూడడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
    డైలీ టాప్ న్యూస్ ,కరంట్ అఫైర్స్ & GK-ఉద్యోగపోటీ పరీక్షలే టార్గెట్ -చూడడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి

    ఈ నోటిఫికేషన్‌కు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి, అర్హతలు మరియు నిబంధనలు నిర్ధారించుకున్న తర్వాత నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.

    అలాగే, ఎంపిక ప్రక్రియలో విజయాన్ని సాధించేందుకు ఇప్పటి నుంచే సిలబస్‌కు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి.

    ప్రభుత్వ ఉద్యోగాల తాజా నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలు, సిలబస్, పరీక్షా విధానం, కరెంట్ అఫైర్స్, పరీక్షా సన్నాహక సమాచారం మరియు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందడానికి ఉద్యోగ సమాచార వేదికను క్రమం తప్పకుండా సందర్శించండి.

    మీ ఉద్యోగ విజయమే మా లక్ష్యం. మీ భవిష్యత్తు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

    Leave a Reply

    About the author

    Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

    Get updates

    Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

    Discover more from ఉద్యోగ సమాచార వేదిక

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading