ఐఐటీ తిరుపతి నియామకం – వివరాలు (ప్రకటన సంఖ్య: IITT/STAFFREC/01/2026, తేదీ 31-08-2026)
ముఖ్యమైన తేదీలు:
| క్రమ సంఖ్య | వివరణ | తేదీ |
|---|---|---|
| I | ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రారంభ తేదీ | 31-08-2026 |
| II | ఆన్‌లైన్‌లో దరఖాస్తు చివరి తేదీ | 30-09-2026, సాయంత్రం 5.00 గంటల వరకు |
| III | వయసు మరియు అనుభవం లెక్కించే తేదీ | 30-09-2026 |
సారాంశం: అభ్యర్థులు 2026 ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 30, సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు మరియు అనుభవాన్ని సెప్టెంబర్ 30, 2026 తేదీ ఆధారంగా లెక్కిస్తారు.
ఉద్యోగం. జీతం ,విభాగం ,ఖాళీలు , కేటగరి మరియు గరిష్ట వయో పరిమితి వివరాలు
గ్రూప్-A పోస్టులు
| క్రమ సంఖ్య | పోస్టు పేరు | పే లెవెల్ | విభాగం | ఖాళీలు | కేటగిరీ | గరిష్ట వయసు |
|---|---|---|---|---|---|---|
| 1 | సూపరింటెండింగ్ ఇంజనీర్ (సివిల్/ఎలక్ట్రికల్) | 13 (₹1,23,100–2,15,900) | ఇంజనీరింగ్ యూనిట్ | 1 | UR | 50 |
| 2 | సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ | 12 (₹78,800–2,09,200) | కంప్యూటర్ సెంటర్ | 1 | UR | 45 |
| 3 | అసిస్టెంట్ రిజిస్ట్రార్ | 10 (₹56,100–1,77,500) | అడ్మినిస్ట్రేషన్ | 2 | UR-1, OBC-1 | 45 |
| 4 | కౌన్సెలర్ | 10 (₹56,100–1,77,500) | గైడెన్స్ & కౌన్సెలింగ్ యూనిట్ | 1 | UR | 45 |
| 5 | సెక్యూరిటీ ఆఫీసర్ | 10 (₹56,100–1,77,500) | సెక్యూరిటీ సెక్షన్ | 1 | UR | 45 |
గ్రూప్-B పోస్టులు
| క్రమ సంఖ్య | పోస్టు పేరు | పే లెవెల్ | విభాగం | ఖాళీలు | కేటగిరీ | గరిష్ట వయసు |
|---|---|---|---|---|---|---|
| 6 | హిందీ ట్రాన్స్‌లేటర్ | 6 (₹35,400–1,12,400) | హిందీ సెల్ | 1 | UR | 35 |
| 7.1 | జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (CSE) | 6 (₹35,400–1,12,400) | కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ | 2 | UR-1, EWS-1 | 35 |
| 7.2 | జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ) | 6 (₹35,400–1,12,400) | కంప్యూటర్ సెంటర్ | 1 | UR | 35 |
గ్రూప్-C పోస్టులు
| క్రమ సంఖ్య | పోస్టు పేరు | పే లెవెల్ | విభాగం | ఖాళీలు | కేటగిరీ | గరిష్ట వయసు |
|---|---|---|---|---|---|---|
| 8.1 | జూనియర్ టెక్నీషియన్ – CH | 4 (₹25,500–81,100) | కెమికల్ ఇంజనీరింగ్ | 1 | OBC | 27 |
| 8.2 | జూనియర్ టెక్నీషియన్ – సిస్టమ్స్ | 4 (₹25,500–81,100) | సివిల్ & ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ | 1 | UR | 27 |
| 8.3 | జూనియర్ టెక్నీషియన్ – CSE (బ్యాక్‌లాగ్) | 4 (₹25,500–81,100) | కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ | 1* | OBC | 27 |
ముఖ్య గమనికలు:
- పోస్టు 1 (సూపరింటెండింగ్ ఇంజనీర్): డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ లేదా డెప్యుటేషన్ ద్వారా భర్తీ; డెప్యుటేషన్‌కు గరిష్ట వయసు 56, కాలవ్యవధి 3+2 సంవత్సరాలు
- పోస్టు 3లో ఒకటి PwBD (వికలాంగుల) రిజర్వేషన్
- పోస్టు 7.1/7.2లో ఒకటి PwBD రిజర్వేషన్
- పోస్టు 8.1/8.2/8.3లో ఒకటి ESM (మాజీ సైనికులు) రిజర్వేషన్
- = బ్యాక్‌లాగ్ పోస్టు
IIT తిరుపతి – పోస్టుల వారీగా అవసరమైన కనీస అర్హతలు (Essential Qualification/Experience)
| పోస్టు నెం. | పోస్టు పేరు | కనీస విద్యార్హత | కనీస అనుభవం |
|---|---|---|---|
| 1 | సూపరింటెండింగ్ ఇంజనీర్ (సివిల్/ఎలక్ట్రికల్) | సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ (55% మార్కులు/5.5 CGPA) | 15 సంవత్సరాల నిర్మాణ/అమలు అనుభవం, లేదా పే లెవెల్-11లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా 7 సంవత్సరాలు |
| 2 | సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ | CSE/IT లో B.E/B.Tech/M.Sc/MCA (55%/5.5 CGPA) | 10 సంవత్సరాలు (5 సంవత్సరాలు పే లెవెల్-10లో) – ERP/సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనుభవం |
| 3 | అసిస్టెంట్ రిజిస్ట్రార్ | మాస్టర్స్ డిగ్రీ (55%/5.5 CGPA) | 8 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్/ఫైనాన్స్/అకడమిక్ అనుభవం (6 సంవత్సరాలు సూపర్‌వైజరీ లెవెల్‌లో) |
| 4 | కౌన్సెలర్ | సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ (55%/5.5 CGPA) + RCI రిజిస్ట్రేషన్ (క్లినికల్ సైకాలజిస్ట్) | 5 సంవత్సరాల క్లినికల్ అనుభవం |
| 5 | సెక్యూరిటీ ఆఫీసర్ | బ్యాచిలర్ డిగ్రీ (55%/5.5 CGPA) + లైట్ మోటర్ వెహికల్/మోటార్‌సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ | 10 సంవత్సరాల సెక్యూరిటీ సూపర్‌వైజరీ అనుభవం (5 సంవత్సరాలు పే లెవెల్-7లో) |
| 6 | హిందీ ట్రాన్స్‌లేటర్ | హిందీ & ఇంగ్లీష్ మెయిన్ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ (55%/5.5 CGPA) | 2 సంవత్సరాల ట్రాన్స్‌లేషన్ అనుభవం |
| 7.1 | జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (CSE) | B.E/B.Tech/M.Sc/MCA (CSE/IT/Electronics) (55%/5.5 CGPA) | 2 సంవత్సరాలు (డిప్లొమా అయితే 5 సంవత్సరాలు) |
| 7.2 | జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ) | B.E/B.Tech/M.Sc (CSE/IT/Electronics) (55%/5.5 CGPA) | 2 సంవత్సరాలు సైబర్ సెక్యూరిటీ/నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ అనుభవం |
| 8.1 | జూనియర్ టెక్నీషియన్ – కెమికల్ | కెమికల్ ఇంజనీరింగ్‌లో B.E/B.Tech (55%/5.5 CGPA) | డిగ్రీకి అనుభవం అవసరం లేదు (డిప్లొమా/ITIకి 3-5 సంవత్సరాలు) |
| 8.2 | జూనియర్ టెక్నీషియన్ – సిస్టమ్స్ | CSE/IT లో B.E/B.Tech/M.Sc/MCA (55%/5.5 CGPA) | డిగ్రీకి అనుభవం అవసరం లేదు (డిప్లొమా/ITIకి 3-5 సంవత్సరాలు) |
| 8.3 | జూనియర్ టెక్నీషియన్ – CSE | CSE/IT లో B.E/B.Tech/M.Sc/MCA (55%/5.5 CGPA) | డిగ్రీకి అనుభవం అవసరం లేదు (డిప్లొమా/ITIకి 3-5 సంవత్సరాలు) |
దరఖాస్తు రుసుము (Application/Processing Fee) వివరాలు:
దరఖాస్తు రుసుము ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చెల్లించాలి.
| క్రమ సంఖ్య | గ్రూప్ | దరఖాస్తు రుసుము (₹) | ప్రాసెసింగ్ రుసుము (₹) |
|---|---|---|---|
| 1 | A | 500/- | 200/- |
| 2 | B | 300/- | 200/- |
| 3 | C | 200/- | 200/- |
ముఖ్యమైన గమనికలు:
- SC/ST/మాజీ సైనికులు (Ex-Servicemen)/మహిళలు/ట్రాన్స్‌జెండర్లు/PwBD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఉంది — దరఖాస్తు సమయంలో తగిన ధృవీకరణ పత్రాలు (డాక్యుమెంటరీ ప్రూఫ్) సమర్పించాలి.
- అయితే, కేటగిరీ/జెండర్‌తో సంబంధం లేకుండా అందరు అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్టుకు వేర్వేరుగా ప్రాసెసింగ్ ఫీజు తప్పనిసరిగా చెల్లించాలి.
ఎంపిక విధానం (Mode of Selection):
| గ్రూప్ | ఎంపిక దశలు |
|---|---|
| గ్రూప్-A పోస్టులు | స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ లేదా రెండూ |
| గ్రూప్-B & C పోస్టులు | లెవెల్-I: ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ పరీక్ష) |
| లెవెల్-II: రాత పరీక్ష (డిస్క్రిప్టివ్) | |
| లెవెల్-III: స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ |
దరఖాస్తుదారులకు సూచనలు (Instructions to Applicants):
సాధారణ సూచనలు:
| క్రమ సంఖ్య | సూచన |
|---|---|
| 1 | అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి: https://www.iittp.ac.in/recruitment |
| 2 | ప్రతి పోస్టుకు వేర్వేరు దరఖాస్తు సమర్పించాలి |
| 3 | ఒక్కో పోస్టుకు ఒక్క దరఖాస్తు మాత్రమే పూరించాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థి అన్‌రిజర్వ్డ్ పోస్టుకు అర్హత కలిగి ఉంటే అదే దరఖాస్తు రెండింటికీ (రిజర్వ్డ్ & అన్‌రిజర్వ్డ్) పరిగణించబడుతుంది |
| 4 | నిర్దేశించిన విధానం ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించాలి, కింది డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి |
అప్‌లోడ్ చేయవలసిన డాక్యుమెంట్లు:
| క్రమం | డాక్యుమెంట్ | వివరాలు |
|---|---|---|
| a | విద్యార్హత సర్టిఫికెట్లు/మార్క్‌షీట్లు | 10th, 12th, ITI, డిప్లొమా, UG, PG, PhD మరియు కనీస అర్హతకు కన్సాలిడేటెడ్ మార్క్‌షీట్ |
| b | జనన ధృవీకరణ పత్రం | పుట్టిన తేదీ నిర్ధారించే బర్త్ సర్టిఫికెట్ లేదా హైస్కూల్ సర్టిఫికెట్ |
| c | కేటగిరీ సర్టిఫికెట్ | SC/ST/OBC-NCL/EWS/PwBD/Ex-Servicemen (వర్తిస్తే); OBC-NCL & EWS సర్టిఫికెట్లు 01.04.2026 తర్వాత జారీ చేసినవి మాత్రమే చెల్లుబాటు |
| d | NOC (ప్రస్తుత యజమాని నుండి) | వర్తిస్తే అవసరం; ఆలస్యమైతే నిర్దేశిత అండర్‌టేకింగ్ ఫార్మాట్‌లో సమర్పించవచ్చు |
| e | అనుభవ ధృవీకరణ పత్రాలు | సంస్థ లెటర్‌హెడ్‌పై, తేదీ, పోస్టు పేరు, పని కాలం, విధులు, సంతకం, సీల్‌తో సహా (Annexure-II ఫార్మాట్ ప్రకారం) |
| f | చెల్లని డాక్యుమెంట్లు | అపాయింట్మెంట్ లెటర్లు/పే స్లిప్‌లు/ప్రమోషన్ ఆర్డర్లు/సంతకం లేని అనుభవ సర్టిఫికెట్లు అనుభవ ఆధారంగా పరిగణించబడవు — ఇలాంటివి సమర్పిస్తే దరఖాస్తు తిరస్కరించబడుతుంది |
| g | అనుభవాన్ని ధృవీకరించే స్టాట్యుటరీ డాక్యుమెంట్లు | EPF స్టేట్‌మెంట్/UAN వివరాలు/ESI రికార్డులు/Form-16/ITR/జీతం జమ అయిన బ్యాంక్ స్టేట్‌మెంట్ (వీటిలో ఏదైనా ఒకటి) |
| h | జీతం సర్టిఫికెట్లు | Pay, DA, HRA తదితర అలవెన్సుల బ్రేకప్‌తో సహా ఉండాలి; కన్సాలిడేటెడ్ మొత్తంతో ఉన్న ప్రైవేట్ కంపెనీ సర్టిఫికెట్లు పరిగణించబడవు |
| i | ప్రావీణ్య ధృవీకరణ పత్రం | Desirable అర్హతలకు సంబంధించి అవసరమైన చోట సమర్పించాలి |
గమనిక: పైన పేర్కొన్న డాక్యుమెంట్లు సరిగ్గా, పూర్తి సమాచారంతో అప్‌లోడ్ చేయకపోతే దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంది.
Leave a Reply