ఆశా వర్కర్ నియామకం – అవలోకనం
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ | జిల్లా కార్యక్రమ నిర్వహణ విభాగం (DPMU), జాతీయ ఆరోగ్య మిషన్ (NHM), తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
| ఉద్యోగము | ఆశా వర్కర్ (ASHA – Accredited Social Health Activist) |
| మొత్తం ఖాళీలు | 44 పోస్టులు (43 మండలాలు/UPHC ప్రాంతాల్లో) |
| విద్యార్హత | కనీసం 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత; వివాహిత/వితంతువు/విడాకులు పొందిన/విడిగా ఉంటున్న మహిళకు ప్రాధాన్యత; వయసు 25-45 సంవత్సరాలు; ఆ గ్రామం/మురికివాడకు చెందిన మహిళ అయి ఉండాలి |
| అప్లికేషన్ విధానం | దరఖాస్తుతో పాటు ఈ కింది పత్రాలు జతచేయాలి: SSC సర్టిఫికెట్ (పుట్టిన తేదీ కోసం), VHNC తీర్మానం/ఆమోదం కాపీ, కుల ధృవీకరణ పత్రం (వర్తించేవారికి), ఆధార్/రేషన్ కార్డ్ కాపీ, వికలాంగుల కోటాకైతే SADAREM సర్టిఫికెట్ |
| అప్లై చెయ్యవలసిన స్థలం | సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) / పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) కార్యాలయంలో |
| అప్లై చెయ్యడానికి చివరి రోజు | 25-09-2026 |
. నియామక ప్రక్రియ షెడ్యూల్ (Schedule for Recruitment Process)
| క్రమ సంఖ్య | వివరాలు | తేదీ |
|---|---|---|
| 1 | నోటిఫికేషన్ విడుదల తేదీ | 15-09-2026 |
| 2 | దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ | 25-09-2026 |
| 3 | తాత్కాలిక మెరిట్ జాబితా ప్రచురణ మరియు అభ్యంతరాల స్వీకరణ | 12-10-2026 |
| 4 | తుది మెరిట్ జాబితా ప్రచురణ మరియు ఎంపిక | 19-10-2026 |
| 5 | సంబంధిత మెడికల్ ఆఫీసర్లకు నియామక అనుమతి జారీ | 27-10-2026 |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – ఆశా వర్కర్ల నియామకం
- నోటిఫికేషన్ నం: 01/2026
- తేదీ: 15-09-2026
- జిల్లా: తూర్పు గోదావరి (East Godavari)
- జారీ చేసిన సంస్థ: జిల్లా కార్యక్రమ నిర్వహణ విభాగం (DPMU), జాతీయ ఆరోగ్య మిషన్ (NHM), తూర్పు గోదావరి జిల్లా
ముఖ్యాంశాలు:
- ఉద్దేశ్యం: గ్రామీణ ప్రాంతాల్లో VHNC కమిటీ ద్వారా ఆశా వర్కర్లుగా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
- సంబంధిత ఉత్తర్వు: Rc.No. HMF04-12021(34)/9/2022, తేదీ 27-08-2026 (కమిషనర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, మిషన్ డైరెక్టర్ NHM – మంగళగిరి మరియు కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా ఉత్తర్వుల మేరకు)
- మొత్తం ఖాళీలు: 44 పోస్టులు (ఆశా వర్కర్లు)
- మండలాల వారీగా ఖాళీలు ఉన్న ముఖ్య ప్రాంతాలు:
- అనపర్తి, చాగల్లు, దేవరపల్లి, గోకవరం, గోపాలపురం, కడియం, కోరుకొండ, కొవ్వూరు, నల్లజర్ల, పెరవలి, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, రంగంపేట, సీతానగరం, ఉండ్రాజవరం, రాజమండ్రి అర్బన్ (UPHC) మొదలైనవి.
- రంగంపేట మండలంలోని వడిసలేరు-1 గ్రామంలో అత్యధికంగా 2 ఖాళీలు ఉన్నాయి; మిగిలిన అన్ని చోట్లా తలా 1 ఖాళీ చొప్పున ఉంది.

అర్హత ప్రమాణాలు (Eligibility Criteria)
గ్రామీణ ప్రాంతాలు (Rural Areas):
- ఆశా వర్కర్ తప్పనిసరిగా ఆ గ్రామానికి చెందిన మహిళ అయి ఉండాలి – వివాహిత/వితంతువు/విడాకులు పొందిన/విడిగా ఉంటున్న మహిళకు ప్రాధాన్యత, వయసు 25 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
- సమర్థవంతమైన సంభాషణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు కలిగి, సంఘంతో అనుసంధానం అయ్యే సామర్థ్యం ఉండాలి.
- కనీసం 10వ తరగతి వరకు చదువుకున్న అక్షరాస్యురాలు అయి ఉండాలి.
- తన బాధ్యతలు నిర్వర్తించడానికి తగినంత సమయం కేటాయించుకునేలా కుటుంబం మరియు సామాజిక మద్దతు ఉండాలి.
- ఆ ప్రాంతంలో ఈ అర్హతలు గల మహిళ అందుబాటులో లేకపోతే, విద్యార్హత మరియు వయో పరిమితిని సడలించవచ్చు.
పట్టణ ప్రాంతాలు (Urban Areas):
- గుర్తించిన మురికివాడ/వల్నరబుల్ క్లస్టర్‌కు చెందిన మహిళ అయి ఉండాలి, ఎంపిక చేయబడుతున్న వల్నరబుల్ గ్రూప్‌కు చెందినదైతే ప్రాధాన్యత.
- వివాహిత/వితంతువు/విడాకులు పొందిన/విడిగా ఉంటున్న మహిళకు ప్రాధాన్యత, వయసు 25-45 సంవత్సరాల మధ్య ఉండాలి.
- సమర్థవంతమైన సంభాషణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మరియు స్థానిక భాషలో అనర్గళంగా మాట్లాడగలగాలి.
- కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన అక్షరాస్యురాలు అయి ఉండాలి.
3. దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన పత్రాలు (సంబంధిత PHCలకు అందజేయాలి):
- A. SSC సర్టిఫికెట్ కాపీ (పుట్టిన తేదీ నిరూపణకు)
- B. సంబంధిత ప్రాంత VHNC యొక్క తీర్మానం మరియు ఆమోదం కాపీ
- C. మండల రెవెన్యూ అధికారులు జారీ చేసిన తాజా కుల ధృవీకరణ పత్రం కాపీ (SC, ST, BC అభ్యర్థులకు వర్తిస్తుంది; లేనిపక్షంలో OC గా పరిగణించబడతారు)
- D. ఆధార్ కార్డ్/రేషన్ కార్డ్ వంటి ధృవీకరణ పత్రాల కాపీ
- E. వికలాంగుల కోటా (P.H. Quota) కింద దరఖాస్తు చేసుకున్నవారు మెడికల్ బోర్డు (SADAREM) జారీ చేసిన తాజా వైకల్య ధృవీకరణ పత్రం జతచేయాలి
తూర్పు గోదావరి జిల్లా ఆశా వర్కర్ల నియామక అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసి చూడండి
తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Leave a Reply