🚆 RRB ALP CBT-II ఫలితాలు – CBATకు అభ్యర్థులకు ముఖ్య సూచన
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) CEN 01/2025 ALP పోస్టులకు నిర్వహించిన 2వ దశ CBT-II పరీక్ష ఫలితాలను పరిశీలించి, CBAT (Computer Based Aptitude Test) కోసం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల సంఖ్య మరియు తమ రోల్ నంబర్ వివరాలను తప్పనిసరిగా చెక్ చేసుకొండి . RRB సికింద్రాబాద్ ద్వారా మొత్తం 10,644 మంది అభ్యర్థులు 3వ దశ CBATకు షార్ట్‌లిస్ట్ అయ్యారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు 25-10-2026 తర్వాత నిర్వహించనున్న CBAT పరీక్షకు హాజరు కావడానికి సిద్ధంగా ఉండాలి. పరీక్షకు సుమారు 10 రోజుల ముందు RRB వెబ్‌సైట్, SMS లేదా E-mail ద్వారా అందించే City Intimation Adviceను తప్పనిసరిగా పరిశీలించి, పరీక్ష తేదీ, పరీక్షా కేంద్రం తదితర వివరాలను తెలుసుకోవాలి.
📌 RRB-ALP/ సికింద్రాబాద్ CBT-II ఫలితాల వివరాలు
- CBATకు షార్ట్‌లిస్ట్ చేసిన మొత్తం అభ్యర్థులు: 10,644 మంది .
- ఫలితాల తేదీ: 01-10-2026
- జారీ చేసిన సంస్థ: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), సికింద్రాబాద్
- అధికారి: చైర్మన్, RRB/సికింద్రాబాద్
ఫలితాలు చూసుకొండి:
| RRB సికింద్రాబాద్ అసిస్టేన్ట్ లోకో పైలెట (ALP) CBT- II ఫలితాలు చూడడానికి లింక్ | RRB సికింద్రాబాద్ ALP – సి బి టి 2 ఫలితాలు ఇక్కడ క్లిక్ క్లిక్ చెయ్యండి లేదా rrb.secunderabad-Selection List ఇక్కడ కూడా క్లిక్ చేసి చూడవచ్చు |
| RRB సికింద్రాబాద్ అధికారిక వెబ్సైట్ లింక్ | RRB-సికింద్రాబాద్ అధికారిక వెబ్సైట్ |
| RRB centralized వెబ్సైట్ లింక్ | RRB indian railways అధికారిక వెబ్సైట్ |
📌 ముఖ్యమైన తేదీలు
| అంశం | తేదీ |
|---|---|
| CBT-II నిర్వహించిన తేదీ | 28-07-2026 |
| CBAT నిర్వహణ | 25-10-2026 తర్వాత |
| City Intimation Advice | పరీక్షకు సుమారు 10 రోజుల ముందు |
| వ్యక్తిగత ఫలితం/స్కోర్ కార్డ్ అందుబాటు | 16-10-2026 వరకు |
🚆 RRB సికింద్రాబాద్ – ALP పరీక్ష ఫలితాలు, CBATపై ముఖ్యమైన సమాచారం
సంస్థ: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), సికింద్రాబాద్
పోస్ట్: అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)
CEN నం.: 01/2025
విషయం: 2వ దశ CBT-II ఫలితాలు మరియు 3వ దశ CBATకు సంబంధించిన సమాచారం
ముఖ్యాంశాలు
- ALP పోస్టులకు 2వ దశ CBT పరీక్షను 28-07-2026న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు నిర్వహించాయి.
- 2వ దశ CBT-IIలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా 3వ దశ పరీక్ష అయిన CBAT (Computer Based Aptitude Test) కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశారు.
- CBT-IIలో 16 అంకెల రోల్ నంబర్ల ఆధారంగా అభ్యర్థుల వివరాలను క్రమబద్ధీకరించి, CBAT కోసం షార్ట్‌లిస్ట్ చేశారు.
- పార్ట్-Aలో కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించినప్పటికీ, పార్ట్-Bలో అర్హత సాధించని అభ్యర్థులను CBATకు షార్ట్‌లిస్ట్ చేయలేదు.
- 3వ దశ CBAT పరీక్ష 25 అక్టోబర్ 2026 తర్వాత నిర్వహించబడుతుంది.
- CBATకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు పరీక్ష తేదీకి సుమారు 10 రోజుల ముందు:
- వెబ్‌సైట్ ద్వారా,
- SMS ద్వారా,
- E-mail ద్వారా
City Intimation Advice అందజేస్తారు.
- అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు జన్మతేదీ ఉపయోగించి RRB అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి తమ:
- వ్యక్తిగత ఫలితం,
- స్కోర్ కార్డ్
చూడవచ్చు.
- ఈ వ్యక్తిగత ఫలితం/స్కోర్ కార్డ్ సదుపాయం 16-10-2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- CBAT కోసం అర్హత సాధించిన అభ్యర్థుల అభ్యర్థిత్వం తాత్కాలికం (Provisional) మాత్రమే.
- నియామక ప్రక్రియలో ఏ దశలోనైనా అభ్యర్థి:
- అర్హత ప్రమాణాలు పాటించకపోయినా,
- తప్పుడు సమాచారం ఇచ్చినా,
- పత్రాల్లో/దరఖాస్తులో లోపాలు ఉన్నా
వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయవచ్చు.
- CBATకు పిలవబడటం లేదా CBATకు అర్హత సాధించడం ద్వారా రైల్వేలో ఉద్యోగ నియామకంపై ఎటువంటి హక్కు కలగదు.
- ఫలితాల తయారీలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఏదైనా టైపింగ్/ప్రింటింగ్ లేదా అనుకోకుండా జరిగిన పొరపాటు ఉంటే దాన్ని సరిచేసే హక్కు RRBకు ఉంది.
- అనర్హులైన అభ్యర్థులను డబ్బులు తీసుకుని ఉద్యోగంలో ఎంపిక చేయిస్తామని చెప్పే దళారులు/మోసగాళ్ల పట్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి.
- RRB నియామక ప్రక్రియ పూర్తిగా కంప్యూటరైజ్డ్గా ఉంటుంది. అభ్యర్థుల మెరిట్ మరియు పనితీరు ఆధారంగానే ఎంపిక జరుగుతుంది.
- ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అక్రమంగా డబ్బులు అడిగే వ్యక్తులను నమ్మవద్దని RRB అభ్యర్థులను హెచ్చరించింది.
- తాజా సమాచారం కోసం అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించాలి.
గమనిక: CBATకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు తదుపరి దశకు సంబంధించిన City Intimation Advice, పరీక్ష తేదీ, ఇతర సూచనలను RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా తప్పనిసరిగా పరిశీలించాలి.
Leave a Reply