NICL AO రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2026: 321 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) AO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) అనేది భారత ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థ. ఈ సంస్థ స్కేల్ I కేడర్‌లో 321 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్ & స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (NICL AO Recruitment 2026-27) విడుదల చేసింది. వీటిలో జనరలిస్ట్ విభాగంలో 200 పోస్టులు, స్పెషలిస్ట్ విభాగంలో 121 పోస్టులు (ఫైనాన్స్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజినీర్స్, రిస్క్ ఇంజినీర్స్, కంపెనీ సెక్రటరీస్, అగ్రికల్చర్) ఉన్నాయి. జనరలిస్ట్ పోస్టులకు ఏదైనా స్ట్రీమ్‌లో డిగ్రీ లేదా పీజీ ఉంటే చాలు. స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధిత విభాగంలో నిర్దేశించిన అర్హత ఉండాలి. అన్ని పోస్టులకూ డిగ్రీలో కనీసం 60% మార్కులు అవసరం (SC/ST/PwBD లకు 55%). అర్హులైన అభ్యర్థులు 28 అక్టోబర్ 2026 లోపు అధికారిక వెబ్‌సైట్ https://nationalinsurance.nic.co.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

NICL AO రిక్రూట్‌మెంట్ 2026-27: అవలోకనం

అంశంవివరాలు
సంస్థనేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL)
పోస్టులుఅడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్ & స్పెషలిస్ట్), స్కేల్ I
మొత్తం ఖాళీలు321 (తాత్కాలికం)
విద్యార్హత (1.10.2026 నాటికి)జనరలిస్ట్ పోస్టులకు ఏదైనా స్ట్రీమ్‌లో డిగ్రీ లేదా పీజీ ఉంటే చాలు. స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధిత విభాగంలో నిర్దేశించిన అర్హత ఉండాలి
వయో పరిమితి (1.10.2026 నాటికి)
21 నుంచి 30 ఏళ్లు (జననం 02.10.1996 నుంచి 01.10.2005 మధ్య). ప్రభుత్వ నియమాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది
ధరకాస్తు రుసుము SC/ST/PwBD విద్యార్ధులకు రు.250/-, మిగతావారికి రు.1000/-
పరీక్ష విధానం ఫేజ్ I ప్రిలిమ్స్ → ఫేజ్ II మెయిన్స్ → ఇంటర్వ్యూ
దరఖాస్తుకు చివరి తేదీ28 అక్టోబర్ 2026 (ప్రారంభం: 8 అక్టోబర్ 2026)
అధికారిక వెబ్‌సైట్https://nationalinsurance.nic.co.in

ముఖ్య మైన తేదీలు

కార్యక్రమంతేదీ
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం8 అక్టోబర్ 2026 (గురువారం)
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ28 అక్టోబర్ 2026 (బుధవారం)
దరఖాస్తు ఫీజు చెల్లింపు8 నుంచి 28 అక్టోబర్ 2026 వరకు (రెండు రోజులూ కలిపి)
ఆన్‌లైన్ పరీక్ష – ఫేజ్ I17 నవంబర్ 2026 (మంగళవారం)
ఆన్‌లైన్ పరీక్ష – ఫేజ్ II22 డిసెంబర్ 2026 (మంగళవారం)
కాల్ లెటర్ల డౌన్‌లోడ్తర్వాత తెలియజేస్తారు

ఖాళీలు

స్పెషలిస్ట్ ఖాళీలు (తాత్కాలికం)

విభాగంమొత్తంUROBCSCSTEWS
ఫైనాన్స్ (CA & CMA)20105212
లీగల్20105212
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ1052111
ఆటోమొబైల్ ఇంజినీర్స్20105212
రిస్క్ ఇంజినీర్స్28137323
కంపెనీ సెక్రటరీస్211000
అగ్రికల్చర్2095312
స్పెషలిస్ట్ బ్యాక్‌లాగ్: IT1–1–––
స్పెషలిస్ట్ మొత్తం121583113712

జనరలిస్ట్ ఖాళీలు

విభాగంమొత్తంUROBCSCSTEWS
జనరలిస్ట్2008055301520

మొత్తం (జనరలిస్ట్ + స్పెషలిస్ట్)

మొత్తంUROBCSCSTEWS
32113886432232

విద్యార్హతలు (1.10.2026 నాటికి)

ఆ తేదీ నాటికి అర్హత పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి. అన్ని విభాగాలకూ డిగ్రీ పరీక్షల్లో ఏదో ఒకదానిలో కనీసం 60% మార్కులు కావాలి. SC/ST/PwBD లకు 55%.

క్ర.సం.విభాగంకనీస అర్హత
1ఫైనాన్స్ (CA & CMA)CA (ICAI) లేదా CMA (ICMAI, పూర్వం ICWAI) మరియు ఏదైనా విభాగంలో డిగ్రీ/పీజీ
2లీగల్లా లో డిగ్రీ లేదా పీజీ
3ఇన్ఫర్మేషన్ టెక్నాలజీB.E/B.Tech/M.E/M.Tech (కంప్యూటర్ సైన్స్/IT) లేదా MCA
4ఆటోమొబైల్ ఇంజినీర్స్ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో B.E/B.Tech/M.E/M.Tech, లేదా ఏదైనా ఇంజినీరింగ్ బ్రాంచిలో B.E/B.Tech/M.E/M.Tech తో పాటు ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో కనీసం ఒక ఏడాది డిప్లొమా
5రిస్క్ ఇంజినీర్స్సెలెక్షన్ 3, 4 లోని విభాగాలు (కంప్యూటర్/IT, ఆటోమొబైల్) మినహా ఏ ఇంజినీరింగ్ విభాగంలోనైనా డిగ్రీ/పీజీ
6కంపెనీ సెక్రటరీస్ICSI నుంచి ACS/FCS మరియు ఏదైనా విభాగంలో డిగ్రీ/పీజీ
7అగ్రికల్చర్అగ్రికల్చర్ / అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ / అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో 4 ఏళ్ల డిగ్రీ లేదా పీజీ
8జనరలిస్ట్ ఆఫీసర్స్ఏదైనా స్ట్రీమ్‌లో డిగ్రీ లేదా పీజీ

వయోపరిమితి (1.10.2026 నాటికి)

  • కనీసం 21 ఏళ్లు, గరిష్ఠం 30 ఏళ్లు
  • అంటే 02.10.1996 నుంచి 01.10.2005 మధ్య (రెండు తేదీలూ కలిపి) జన్మించినవారే అర్హులు.

గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు

క్ర.సం.కేటగిరీసడలింపు
1SC/ST5 ఏళ్లు
2OBC (నాన్-క్రీమీ లేయర్)3 ఏళ్లు
3బెంచ్‌మార్క్ డిజెబిలిటీ ఉన్నవారు (PwBD), RPwD చట్టం 2016 ప్రకారం
PwBD (జనరల్/EWS)10 ఏళ్లు
PwBD (SC/ST)15 ఏళ్లు
PwBD (OBC)13 ఏళ్లు
4మాజీ సైనికులు, ECOs/SSCOs సహా కమిషన్డ్ ఆఫీసర్లు (1.10.2026 నాటికి కనీసం 5 ఏళ్ల మిలిటరీ సర్వీసు పూర్తిచేసి, విడుదలైనవారు)5 ఏళ్లు
5విదేశాలతో యుద్ధంలో లేదా అల్లర్ల ప్రాంతంలో వికలాంగులై విడుదలైన రక్షణ సిబ్బంది3 ఏళ్లు
6ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల (GIC, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాతో సహా) కన్‌ఫర్మ్ అయిన ఉద్యోగులు8 ఏళ్లు

మాజీ సైనికుల అర్హత: ఈ 5 ఏళ్ల సడలింపు పొందాలంటే సర్వీసు తప్పుడు ప్రవర్తన లేదా అసమర్థత కారణంగా డిస్మిస్/డిశ్చార్జ్ కాకుండా ముగియాలి. అసైన్‌మెంట్ పూర్తయినవారు, ఏడాదిలోపు పూర్తయ్యేవారు, సైనిక సేవ వల్ల వచ్చిన వైకల్యం కారణంగా లేదా ఇన్వాలిడ్‌మెంట్ కారణంగా విడుదలైనవారు అర్హులు. ECOs/SSCOs లో 5 ఏళ్ల ప్రారంభ కాలం దాటి సర్వీసు పొడిగించినవారికి, రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి “సివిల్ ఉద్యోగానికి దరఖాస్తు చేయవచ్చు, ఎంపికైతే 3 నెలల నోటీసుతో విడుదల చేస్తాం” అనే సర్టిఫికెట్ ఉండాలి.

గమనికలు:

  1. ఒకటికంటే ఎక్కువ కేటగిరీల్లో సడలింపు పొందే అర్హత ఉంటే, అవి కలిపి వర్తిస్తాయి, కానీ గరిష్ఠ వయసు 45 ఏళ్లు దాటకూడదు.
  2. సడలింపు కోరేవారు అవసరమైన సర్టిఫికెట్ల కాపీలు సమర్పించాలి. ఇంటర్వ్యూ సమయంలో లేదా తర్వాత దశల్లో ఒరిజినల్స్ చూపించాలి.

దరఖాస్తు ఫీజు (తిరిగి ఇవ్వరు)

ఆన్‌లైన్‌లో 08-10-2026 నుంచి 28-10-2026 వరకు (రెండు తేదీలూ కలిపి) చెల్లించవచ్చు.

కేటగిరీఫీజు
SC/ST/PwBD₹250 (ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే + GST)
SC/ST/PwBD కాని అభ్యర్థులందరూ₹1,000 (అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఛార్జీలు, GST కలిపి)

ముఖ్య నిబంధనలు

  • బ్యాంకు ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఉంటే అభ్యర్థే భరించాలి.
  • ఒకసారి చెల్లించిన ఫీజును తిరిగి ఇవ్వరు, భవిష్యత్తులో వచ్చే ఏ ఇతర నియామక ప్రక్రియకూ సర్దుబాటు చేయరు.

జీతభత్యాలు

ప్రారంభ మూల వేతనం ₹82,485. పే స్కేల్ ₹82,485 నుంచి ₹1,56,745 వరకు. మెట్రో నగరాల్లో అన్ని అలవెన్సులతో కలిపి నెలకు సుమారు ₹1,14,000 వస్తుంది.

పరీక్షా కేంద్రాలు (ప్రిలిమ్స్)

ఆంధ్రప్రదేశ్ (South 1 జోన్)

  1. ఏలూరు
  2. విజయవాడ/గుంటూరు
  3. కడప
  4. కాకినాడ
  5. కర్నూలు
  6. ఒంగోలు
  7. రాజమండ్రి
  8. శ్రీకాకుళం
  9. తిరుపతి
  10. విశాఖపట్నం
  11. విజయనగరం

తెలంగాణ (South 1 జోన్)

  1. హైదరాబాద్
  2. కరీంనగర్
  3. ఖమ్మం
  4. వరంగల్

ఎంపిక విధానం: పార్ట్ A, ఆన్‌లైన్ పరీక్ష

రాత పరీక్ష రెండు దశల్లో ఉంటుంది: ఫేజ్ I ప్రిలిమినరీ మరియు ఫేజ్ II మెయిన్. రెండూ ఆన్‌లైన్.

ఫేజ్ I: ప్రిలిమినరీ (అన్ని విభాగాలకు)

ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ ఛాయిస్), మొత్తం 100 మార్కులు, 60 నిమిషాలు. ప్రతి సెక్షన్‌కు వేర్వేరు సమయం.

సెక్షన్ప్రశ్నలుమార్కులుసమయంభాష
ఇంగ్లీష్ లాంగ్వేజ్303020 నిమిషాలుఇంగ్లీష్
రీజనింగ్ ఎబిలిటీ353520 నిమిషాలుఇంగ్లీష్/హిందీ
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్353520 నిమిషాలుఇంగ్లీష్/హిందీ
మొత్తం100100
  • ప్రతి సెక్షన్‌లో విడివిడిగా కంపెనీ నిర్ణయించే కనీస ఉత్తీర్ణత మార్కులు తెచ్చుకోవాలి.
  • ప్రతి కేటగిరీలో ఖాళీల సంఖ్యకు సుమారు 15 రెట్లు మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు (అభ్యర్థుల లభ్యతను బట్టి).

ఫేజ్ II: మెయిన్ పరీక్ష

ఆబ్జెక్టివ్ టెస్ట్ 250 మార్కులు, డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మార్కులు. రెండూ ఆన్‌లైన్. డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు జవాబులు కంప్యూటర్‌పై టైప్ చేయాలి, ఆబ్జెక్టివ్ టెస్ట్ ముగిసిన వెంటనే ఇస్తారు.

(i) ఆబ్జెక్టివ్ టెస్ట్ (3 గంటలు)

జనరలిస్ట్‌లకు (5 సెక్షన్లు):

సెక్షన్ప్రశ్నలుమార్కులుసమయంభాష
రీజనింగ్505040 ని.ఇంగ్లీష్/హిందీ
జనరల్ అవేర్‌నెస్505030 ని.ఇంగ్లీష్/హిందీ
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్505040 ని.ఇంగ్లీష్/హిందీ
ఇంగ్లీష్ లాంగ్వేజ్505040 ని.ఇంగ్లీష్
కంప్యూటర్ నాలెడ్జ్505030 ని.ఇంగ్లీష్/హిందీ
మొత్తం250250

స్పెషలిస్ట్‌లకు (6 సెక్షన్లు):

సెక్షన్ప్రశ్నలుమార్కులుసమయంభాష
రీజనింగ్404035 ని.ఇంగ్లీష్/హిందీ
జనరల్ అవేర్‌నెస్404020 ని.ఇంగ్లీష్/హిందీ
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్404035 ని.ఇంగ్లీష్/హిందీ
ఇంగ్లీష్ లాంగ్వేజ్404030 ని.ఇంగ్లీష్
కంప్యూటర్ నాలెడ్జ్404025 ని.ఇంగ్లీష్/హిందీ
సంబంధిత విభాగంలో టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్505035 ని.ఇంగ్లీష్/హిందీ
మొత్తం250250

(ii) డిస్క్రిప్టివ్ టెస్ట్: 30 నిమిషాలు, 30 మార్కులు, ఇంగ్లీష్‌లో, ఆన్‌లైన్ విధానంలో.

  • ఎస్సే: 10 మార్కులు
  • ప్రెసీ: 10 మార్కులు
  • కాంప్రహెన్షన్: 10 మార్కులు

డిస్క్రిప్టివ్ టెస్ట్ నిబంధనలు

  • డిస్క్రిప్టివ్ జవాబు పత్రాలను దిద్దాలంటే, ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో ప్రతి సెక్షన్‌లో విడివిడిగా కనీస స్కోరు రావాలి.
  • ఖాళీల సంఖ్యను బట్టి, డిస్క్రిప్టివ్ పేపర్ల మూల్యాంకనానికి కటాఫ్ నిర్ణయిస్తారు. అంటే డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు ప్రత్యేక కటాఫ్ ఉంటుంది.
  • డిస్క్రిప్టివ్ టెస్ట్ అర్హత కోసం మాత్రమే (క్వాలిఫయింగ్). ఇందులో వచ్చిన మార్కులు ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ చేయడానికి, తుది ఎంపికకు లెక్కలోకి తీసుకోరు.

ఇంటర్వ్యూ (జనరలిస్ట్ & స్పెషలిస్ట్ ఇద్దరికీ)

  • ఎవరిని పిలుస్తారు: ఆన్‌లైన్ ఫేజ్ II (మెయిన్ పరీక్ష)లో పనితీరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ అయినవారిని.
  • ఎవరు నిర్వహిస్తారు: కంపెనీ, ఎంపిక చేసిన కేంద్రాల్లో.
  • వివరాల ప్రకటన: ఇంటర్వ్యూ కేంద్రం పేరు, చిరునామా, తేదీ, సమయం కంపెనీ వెబ్‌సైట్‌లో తెలియజేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన ప్రతి అభ్యర్థికి కాల్ లెటర్ జారీ చేస్తారు.
  • కాల్ లెటర్: అభ్యర్థులు కంపెనీ వెబ్‌సైట్ నుంచి ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

A. దరఖాస్తు విధానం

  1. దరఖాస్తు చేసే ముందు వయసు, విద్యార్హతలు, ఇతర అర్హతలు మీకు ఉన్నాయో లేదో, ఇచ్చే వివరాలు అన్నీ సరైనవో సరిచూసుకోండి. అనర్హులని తేలితే ఏ దశలోనైనా అభ్యర్థిత్వం రద్దవుతుంది.
  2. https://nationalinsurance.nic.co.in/ లో RECRUITMENT విభాగంలో APPLY ONLINE ఎంచుకోండి.
  3. Click here for New Registration ద్వారా పేరు, సంప్రదింపు వివరాలు, ఈమెయిల్ ఇవ్వండి. తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరు, పాస్‌వర్డ్ వస్తాయి (ఈమెయిల్, SMS కూడా వస్తాయి). వాటిని నోట్ చేసుకోండి.
  4. ఒకేసారి ఫారం పూర్తిచేయలేకపోతే SAVE AND NEXT తో సేవ్ చేసుకుని తర్వాత కొనసాగించవచ్చు. తుది సబ్మిషన్ ముందు వివరాలు సరిచూసుకోండి. దృష్టి లోపం ఉన్నవారు వేరొకరితో వివరాలు ధృవీకరించుకోవడం మంచిది.
  5. COMPLETE REGISTRATION నొక్కిన తర్వాత ఎలాంటి మార్పులూ అనుమతించరు.
  6. మీ పేరు, తండ్రి/భర్త పేరు సర్టిఫికెట్లు, మార్కుషీట్లు, ID ప్రూఫ్‌లో ఉన్నట్లే రాయాలి. తేడా ఉంటే అనర్హులు కావచ్చు.
  7. ఫారం నింపే క్రమం: VALIDATE YOUR DETAILS → SAVE & NEXT → ఫోటో, సంతకం అప్‌లోడ్ → మిగతా వివరాలు → Preview → COMPLETE REGISTRATION (ఫోటో, సంతకం సరిగ్గా అప్‌లోడ్ అయ్యాయని చూసుకున్నాకే) → PAYMENT → SUBMIT.

B. ఫీజు చెల్లింపు (ఆన్‌లైన్ మాత్రమే)

  • చెల్లింపు మార్గాలు: డెబిట్ కార్డులు (RuPay/Visa/MasterCard/Maestro), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, క్యాష్ కార్డులు/మొబైల్ వాలెట్లు.
  • చెల్లింపు వివరాలు ఇచ్చాక సర్వర్ నుంచి సమాచారం వచ్చేవరకు వేచి ఉండండి. రెండుసార్లు డబ్బు కట్ కాకుండా Back లేదా Refresh బటన్ నొక్కవద్దు.
  • చెల్లింపు విజయవంతమైతే e-Receipt వస్తుంది. రాకపోతే చెల్లింపు విఫలమైనట్లే. అప్పుడు రిజిస్ట్రేషన్ నంబరు, పాస్‌వర్డ్‌తో మళ్లీ లాగిన్ అయి చెల్లించాలి.
  • e-Receipt, ఫీజు వివరాలతో కూడిన దరఖాస్తు ఫారం ప్రింట్‌అవుట్ తీసి ఉంచుకోవాలి. అవి రాకపోతే ఆన్‌లైన్ లావాదేవీ విజయవంతం కాకపోయి ఉండవచ్చు.
  • భారతీయేతర క్రెడిట్ కార్డు వాడితే, మీ బ్యాంకు ప్రస్తుత మారకం రేటు ప్రకారం మారుస్తుంది.
  • లావాదేవీ పూర్తయ్యాక భద్రత కోసం బ్రౌజర్ విండో మూసేయండి.
  • ఫీజు చెల్లించాక దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకునే సౌకర్యం ఉంది.

C. పత్రాల స్కానింగ్/అప్‌లోడ్ మార్గదర్శకాలు

పత్రంసైజు (పిక్సెళ్లు)ఫైల్ సైజుఫైల్ రకం
ఫోటో200 x 230 (ప్రాధాన్యం), 4.5 సెం.మీ x 3.5 సెం.మీ20–50 KB
సంతకం140 x 60 (ప్రాధాన్యం)10–20 KB (20 KB మించకూడదు)
ఎడమ బొటనవేలి ముద్ర240 x 240, 200 DPI (3 x 3 సెం.మీ)20–50 KBjpg/jpeg
చేతిరాత డిక్లరేషన్800 x 400, 200 DPI (10 x 5 సెం.మీ)50–100 KBjpg/jpeg

ఫోటో నియమాలు:

  • ఇటీవల తీసిన పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటో, లేత రంగు (ప్రాధాన్యంగా తెలుపు) నేపథ్యంతో.
  • కెమెరా వైపు నేరుగా, ప్రశాంతమైన ముఖంతో చూడాలి. కళ్లకు రెడ్-ఐ, కఠినమైన నీడలు ఉండకూడదు.
  • కళ్లజోడు వాడితే ప్రతిబింబాలు లేకుండా కళ్లు స్పష్టంగా కనిపించాలి.
  • టోపీలు, నల్ల కళ్లజోళ్లు వద్దు. మతపరమైన శిరోవస్త్రం ఉండవచ్చు, కానీ ముఖాన్ని కప్పకూడదు.
  • ఫోటో అప్‌లోడ్ చేయకపోతే పరీక్షకు ప్రవేశం నిరాకరిస్తారు. ఫోటో స్థానంలో ఫోటో, సంతకం స్థానంలో సంతకమే అప్‌లోడ్ చేయాలి.

లైవ్ ఫోటో క్యాప్చర్: పై ఫోటోతో పాటు వెబ్‌క్యామ్ లేదా మొబైల్ ఫోన్‌తో లైవ్ ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి.

  • Capture Photo: వెబ్‌క్యామ్ ఆన్ అయి ఫోటో తీస్తే ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అవుతుంది.
  • Click here to Scan: QR కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేసి ఫోన్‌లో ఫోటో తీస్తే ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అవుతుంది.
  • చేయాల్సినవి: తెలుపు/లేత నేపథ్యం, తగినంత వెలుతురు, కెమెరా వైపు నేరుగా చూడటం, పాస్‌పోర్ట్ సైజు.
  • చేయకూడనివి: చిన్న సైజు ఫోటో, రంగు కళ్లజోడు/టోపీ, ముఖంపై నీడ, కెమెరాకు ఎదురుగా లేకపోవడం, వక్రీకరించిన/మాస్క్ పెట్టుకున్న/బ్లర్ ఫోటో, చీకటి లేదా సరికాని నేపథ్యం.

సంతకం, బొటనవేలి ముద్ర, డిక్లరేషన్:

  • సంతకం తెల్ల కాగితంపై నల్ల ఇంకు పెన్‌తో చేయాలి. ఇదే సంతకాన్ని కాల్ లెటర్‌పై కూడా వాడతారు.
  • ఎడమ బొటనవేలి ముద్ర తెల్ల కాగితంపై నలుపు లేదా నీలం ఇంకుతో వేయాలి.
  • డిక్లరేషన్ ఇంగ్లీష్‌లో, తెల్ల కాగితంపై నల్ల ఇంకుతో చేతిరాతతో రాయాలి. అసలైన డిక్లరేషన్ వాక్యం నోటిఫికేషన్‌లో వేరే చోట ఉంటుంది.
  • సంతకం, బొటనవేలి ముద్ర, డిక్లరేషన్ అభ్యర్థివే అయి ఉండాలి, వేరొకరివి కాకూడదు.
  • పరీక్ష సమయంలో హాజరు పత్రం/కాల్ లెటర్‌పై చేసే సంతకం అప్‌లోడ్ చేసిన సంతకంతో సరిపోకపోతే అభ్యర్థిని అనర్హులుగా ప్రకటిస్తారు.
  • క్యాపిటల్ అక్షరాల సంతకం లేదా డిక్లరేషన్‌ను అంగీకరించరు.

స్కానింగ్ సెట్టింగులు: కనీసం 200 DPI, కలర్ “True Colour”, ఫైల్ సైజు పైన చెప్పినట్లు. ఫైల్ సైజు ఎక్కువైతే స్కానర్‌లో DPI లేదా రంగుల సంఖ్య తగ్గించండి.

NICL AO రిక్రూట్మెంట్ అధికారిక నోటిఫికేషన్ లింక్ NICL AO Recruitment Advertisment 2026-27
అప్లై చెయ్యడానికి డైరెక్ట్ లింక్ NICL AO అప్లికేషన్ లింక్
NICL వెబ్సైట్ లింక్ National Insurance Company Limited: Trusted Since 1906
లేటెస్ట్ ఉద్యోగాల వివరాలు చూడడానికి లింక్ https://uchitaudyogasamachar.in/
ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగాల వివరాలు చూడడానికి లింక్ https://uchitaudyogasamachar.ap
తెలంగాణ ఉద్యోగాలు చూడడానికి లింక్ https://uchitaudyogasamachar.telangana
Employment News వీక్లీలు ఇక్కడ క్లిక్ చేసి చూడండి
జాబ్ ప్రిపరేషన్ హబ్ లో స్టడీ మెటీరీయల్ చూడడానికి లింక్
NICL AOనోటిఫికేషన్ 2026-27 లో అదైనా డిగ్రీ అర్హతతో 200 ఉద్యోగాలు ఉన్నాయి
పూర్తి అధికారిక నోటిఫికేషన్ చదివి అర్హతలు ,విధానం తెలుసుకొని 28 అక్టోబర్ 2026 (బుధవారం) లోపల అప్లై చెయ్యండి.

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading