| APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II నోటిఫికేషన్ 2026 – 97 పోస్టులు |
|---|
| ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), విజయవాడ, నోటిఫికేషన్ నం. 25/2026, తేదీ 09-10-2026 ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల సబార్డినేట్ సర్వీసుల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నియామకం ద్వారా మొత్తం 97 పోస్టులు భర్తీ చేయనున్నారు. విద్యార్హతల విషయానికి వస్తే, సాంఘిక సంక్షేమ శాఖ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు B.Ed./B.T. డిగ్రీ, గిరిజన సంక్షేమ శాఖ పోస్టులకు డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా B.Ed., వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పోస్టులకు డిగ్రీతో పాటు B.Ed. లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 09-10-2026 నుంచి 29-10-2026 రాత్రి 11:59 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: APPSC అధికారిక వెబ్‌సైట్. https://psc.ap.gov.in |
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II నోటిఫికేషన్ 2026 – అవలోకనం
- నియామక సంస్థ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
- నోటిఫికేషన్ నంబర్: 25/2026
- నోటిఫికేషన్ తేదీ: 09/10/2026
- పోస్టు పేరు: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II
- మొత్తం ఖాళీలు: 97
- వయోపరిమితి: 18–44 సంవత్సరాలు
- వేతనం: ₹37,640–₹1,15,500
- పరీక్ష విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) & కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష(CPT )
- ధరకాస్తు రుసుము :SC, ST) BC EWS ,తెల్ల రేషన్ గలవారు మరియు నిరుద్యోగ అభ్యర్థులకు రు 250/-, మిగిలిన వారికి రు.330/-
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 09/10/2026
- దరఖాస్తుకు చివరి తేదీ: 29/10/2026, రాత్రి 11:59 గంటల వరకు
- అధికారిక వెబ్‌సైట్: https://psc.ap.gov.in
జిల్లా వారీగా పోస్టుల వివరాలు
| పోస్టు కోడ్ నం. | పోస్టు పేరు & సర్వీస్ | మొత్తం ఖాళీలు | వయోపరిమితి (01/07/2026 నాటికి) (కనిష్ఠ–గరిష్ఠ) | వేతన స్కేలు (రూ.) |
|---|---|---|---|---|
| 01 | ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ సబార్డినేట్ సర్వీస్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II | 41 (07 CF) | 18–44 సంవత్సరాలు | ₹37,640–₹1,15,500 |
| 02 | ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సబార్డినేట్ సర్వీస్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II | 23 (03 CF) | 18–44 సంవత్సరాలు | ₹37,640–₹1,15,500 |
| 03 | ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ సబార్డినేట్ సర్వీస్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II | 33 (01 CF) | 18–44 సంవత్సరాలు | ₹37,640–₹1,15,500 |
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II నియామకం – జిల్లా వారీగా ఖాళీల వివరాలు
పోస్టు కోడ్: 01 | ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ
| క్రమ సంఖ్య | జిల్లా పేరు | ఓపెన్ కేటగిరీ పోస్టులు | స్థానిక పోస్టులు | మొత్తం పోస్టులు |
|---|---|---|---|---|
| 1 | శ్రీకాకుళం | 0 | 1* | 1* |
| 2 | పార్వతీపురం మన్యం | 0 | 1 | 1 |
| 3 | విశాఖపట్నం | 0 | 1 | 1 |
| 4 | అనకాపల్లి | 0 | 1 | 1 |
| 5 | కాకినాడ | 1 | 3 | 4 |
| 6 | డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ | 0 | 1 | 1 |
| 7 | తూర్పు గోదావరి | 0 | 1 | 1 |
| 8 | పశ్చిమ గోదావరి | 0 | 1 | 1 |
| 9 | ఏలూరు | 0 | 1 | 1 |
| 10 | కృష్ణా | 0 | 1 | 1 |
| 11 | గుంటూరు | 1 | 1 | 2 |
| 12 | ప్రకాశం | 1 | 3 | 4 |
| 13 | ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు | 1 | 3* | 4* |
| 14 | కర్నూలు | 1 | 2* | 3* |
| 15 | నంద్యాల | 0 | 1 | 1 |
| 16 | అనంతపురము | 0 | 1* | 1* |
| 17 | శ్రీ సత్యసాయి | 0 | 1 | 1 |
| 18 | వైఎస్ఆర్ కడప | 1 | 4* | 5* |
| 19 | అన్నమయ్య | 0 | 1 | 1 |
| 20 | తిరుపతి | 0 | 1 | 1 |
| 21 | చిత్తూరు | 1 | 4 | 5 |
| మొత్తం | 21 జిల్లాలు | 7 | 34 | 41 |
పోస్టు కోడ్: 02,గిరిజన సంక్షేమ శాఖ
| క్రమ సంఖ్య | జిల్లా పేరు | ఓపెన్ కేటగిరీ పోస్టులు | స్థానిక పోస్టులు | మొత్తం పోస్టులు |
|---|---|---|---|---|
| 1 | శ్రీకాకుళం | 0 | 1 | 1 |
| 2 | పార్వతీపురం మన్యం | 1 | 2 | 3 |
| 3 | అల్లూరి సీతారామరాజు (ఏజెన్సీ ప్రాంతం) | 1 | 16 | 17 |
| 4 | ఏలూరు | 0 | 2 | 2 |
| మొత్తం | 4 జిల్లాలు | 2 | 21 | 23 |
పోస్టు కోడ్: 03, శాఖ: ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ
| క్రమ సంఖ్య | జిల్లా పేరు | ఓపెన్ కేటగిరీ పోస్టులు | స్థానిక పోస్టులు | మొత్తం పోస్టులు |
|---|---|---|---|---|
| 1 | శ్రీకాకుళం | 1 | 1 | 2 |
| 2 | విజయనగరం | 1 | 2 | 3 |
| 3 | అనకాపల్లి | 1 | 1 | 2 |
| 4 | ఏలూరు | 1 | 1 | 2 |
| 5 | కృష్ణా | 1 | 1 | 2 |
| 6 | ఎన్టీఆర్ | 1 | 1 | 2 |
| 7 | పల్నాడు | 1 | 1 | 2 |
| 8 | ప్రకాశం | 1 | 2 | 3 |
| 9 | నంద్యాల | 1 | 1 | 2 |
| 10 | ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు | 1 | 1 | 2 |
| 11 | వైఎస్ఆర్ కడప | 1 | 1 | 2 |
| 12 | అనంతపురము | 1 | 2 | 3 |
| 13 | శ్రీ సత్యసాయి | 1 | 2 | 3 |
| 14 | కర్నూలు | 1 | 2 | 3 |
| మొత్తం | 14 జిల్లాలు | 14 | 19 | 33 |
గమనిక:కేటగరి వారి ఉద్యోగాలకు అధికారిక నోటిఫికేషన్ లో annexure-I చూడండి
విద్యార్హతలు
| క్రమ సంఖ్య | పోస్టు పేరు | విద్యార్హతలు |
|---|---|---|
| 1 | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II – సాంఘిక సంక్షేమ శాఖ | భారతదేశంలో కేంద్ర చట్టం లేదా రాష్ట్ర చట్టం ద్వారా స్థాపించబడిన లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీతో పాటు B.Ed. / B.T. డిగ్రీ కలిగి ఉండాలి. సంబంధిత విశ్వవిద్యాలయం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తింపు పొందినదై ఉండాలి. |
| 2 | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II – గిరిజన సంక్షేమ శాఖ | భారతదేశంలో కేంద్ర చట్టం లేదా రాష్ట్ర చట్టం ద్వారా స్థాపించబడిన లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (D.Ed.) లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed.) కలిగి ఉండాలి. సంబంధిత సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తింపు పొందినదై ఉండాలి. |
| 3 | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II – వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ | భారతదేశంలో కేంద్ర చట్టం లేదా రాష్ట్ర చట్టం ద్వారా స్థాపించబడిన లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు B.Ed. లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. సంబంధిత విశ్వవిద్యాలయం లేదా సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తింపు పొందినదై ఉండాలి. |
వయోపరిమితి, వయో సడలింపులు
వయోపరిమితి
- అభ్యర్థుల వయస్సు 01/07/2026 నాటికి కనిష్ఠం 18 సంవత్సరాలు, గరిష్ఠం 44 సంవత్సరాలు ఉండాలి.
వివిధ కేటగిరీలకు వయో సడలింపులు
| క్రమ సంఖ్య | అభ్యర్థుల కేటగిరీ | అనుమతించబడే వయో సడలింపు |
|---|---|---|
| 1 | ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులు | 5 సంవత్సరాలు |
| 2 | ఎస్సీ / ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ (CF) ఖాళీలకు పరిమిత నియామకం | 10 సంవత్సరాలు |
| 3 | బెంచ్‌మార్క్ వైకల్యాలు కలిగిన వ్యక్తులు (PwBD) | 10 సంవత్సరాలు |
| 4 | మాజీ సైనికులు (Ex-Servicemen) | సాయుధ దళాల్లో అందించిన సేవా కాలానికి అదనంగా 3 సంవత్సరాలు మినహాయింపు |
| 5 | రెగ్యులర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు | రాష్ట్ర ప్రభుత్వంలో చేసిన రెగ్యులర్ సర్వీస్ కాలాన్ని గరిష్ఠంగా 5 సంవత్సరాల వరకు వయస్సు నుంచి మినహాయిస్తారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఉద్యోగులకు ఈ సడలింపు వర్తించదు. |
| 6 | రాష్ట్ర జనగణన శాఖలో కనీసం 6 నెలల సర్వీస్ చేసిన తొలగించబడిన తాత్కాలిక ఉద్యోగులు | 3 సంవత్సరాలు |
వయో సడలింపులకు సంబంధించిన వివరణ
1. మాజీ సైనికులు మరియు ఎన్‌సీసీ (NCC) ఇన్‌స్ట్రక్టర్లు:
- మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
- ఎన్‌సీసీలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసిన అభ్యర్థులకు, ఎన్‌సీసీలో పనిచేసిన కాలానికి అదనంగా 3 సంవత్సరాల మినహాయింపు ఇవ్వబడుతుంది.
2. గరిష్ఠ వయోపరిమితి:
మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు వర్తించే సడలింపులు కలిపినప్పటికీ, సంబంధిత పోస్టుకు నిర్దేశించిన గరిష్ఠ వయోపరిమితిని మించకూడదనే నిబంధన వర్తిస్తుంది.
3. మాజీ సైనికులకు వర్తించే నిబంధన:
క్రమశిక్షణా రాహిత్యం లేదా అసమర్థత కారణంగా తొలగించబడిన లేదా డిశ్చార్జ్ చేయబడిన వ్యక్తులకు మినహా, సాయుధ దళాల నుంచి విడుదలైన వారికి నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
ముఖ్యమైన విషయాలు
- సాధారణ గరిష్ఠ వయస్సు: 44 సంవత్సరాలు.
- SC/ST/BC/EWS అభ్యర్థులకు: 5 సంవత్సరాల సడలింపు.
- PwBD అభ్యర్థులకు: 10 సంవత్సరాల సడలింపు.
- SC/ST CF ఖాళీలకు: 10 సంవత్సరాల సడలింపు.
- రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు: గరిష్ఠంగా 5 సంవత్సరాల సర్వీస్ మినహాయింపు.
దరఖాస్తు ఫీజు.
| క్రమ సంఖ్య | ఫీజు వివరాలు | చెల్లించాల్సిన మొత్తం |
|---|---|---|
| 1 | దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు | ₹250/- |
| 2 | పరీక్ష ఫీజు | ₹80/- |
| మొత్తం | రెండు ఫీజులు కలిపి | ₹330/- |
పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు పొందే అభ్యర్థులు
క్రింది కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ₹80/- పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
| క్రమ సంఖ్య | అభ్యర్థుల కేటగిరీ | పరీక్ష ఫీజు మినహాయింపు |
|---|---|---|
| 1 | ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), బెంచ్‌మార్క్ వైకల్యాలు కలిగిన వ్యక్తులు (PwBD), మాజీ సైనికులు (Ex-Servicemen) | ₹80/- పరీక్ష ఫీజు మినహాయింపు |
| 2 | ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ జారీ చేసిన కుటుంబ తెల్ల రేషన్ కార్డు (Household Supply White Card) కలిగిన కుటుంబాల సభ్యులు | ₹80/- పరీక్ష ఫీజు మినహాయింపు |
| 3 | G.O.Ms.No.439, G.A. (Ser-A) Department, తేదీ 18/10/1996 ప్రకారం నిరుద్యోగ యువత | నిబంధనల ప్రకారం పరీక్ష ఫీజు మినహాయింపు కోసం కమిషన్‌కు డిక్లరేషన్ సమర్పించాలి |
ముఖ్యమైన నిబంధనలు:
- పై మినహాయింపు పొందే కేటగిరీలకు చెందిన ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు (PwBD, మాజీ సైనికులు మినహా) ఫీజు మినహాయింపు వర్తించదు. అలాగే, వారికి ఎలాంటి రిజర్వేషన్ ప్రయోజనాలు కూడా వర్తించవు.
- ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ₹80/- పరీక్ష ఫీజుతో పాటు ₹250/- ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాలి.
- నిర్దేశించిన ఫీజులు చెల్లించని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
. ఫీజు చెల్లింపు విధానం
- పై ఫీజులను ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.
- నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఆన్‌లైన్ చెల్లింపుకు అందుబాటులో ఉన్న బ్యాంకుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయి.
- ఒకసారి చెల్లించిన ఫీజును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించరు లేదా ఇతర చెల్లింపులకు సర్దుబాటు చేయరు.
- ఫీజు మినహాయింపు లేని అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించకపోతే, వారి దరఖాస్తు తిరస్కరించబడుతుంది.
- IPOలు (Indian Postal Orders), డిమాండ్ డ్రాఫ్ట్‌లు (Demand Drafts) అంగీకరించబడవు.
జిల్లా వారీ స్థానిక రిజర్వేషన్ వివరాలు
- ఈ పోస్టులు జిల్లా క్యాడర్ పరిధిలోకి వస్తాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్–2025 ప్రకారం, 95% స్థానిక రిజర్వేషన్ ప్రయోజనం సంబంధిత జిల్లాలకు చెందిన స్థానిక అభ్యర్థులకు వర్తిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల జాబితా
| క్రమ సంఖ్య | జిల్లా పేరు | క్రమ సంఖ్య | జిల్లా పేరు |
|---|---|---|---|
| 1 | శ్రీకాకుళం | 14 | గుంటూరు |
| 2 | విజయనగరం | 15 | పల్నాడు |
| 3 | పార్వతీపురం మన్యం | 16 | బాపట్ల |
| 4 | విశాఖపట్నం | 17 | ప్రకాశం |
| 5 | అనకాపల్లి | 18 | ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు |
| 6 | అల్లూరి సీతారామరాజు | 19 | తిరుపతి |
| 7 | తూర్పు గోదావరి | 20 | చిత్తూరు |
| 8 | కాకినాడ | 21 | అన్నమయ్య |
| 9 | డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ | 22 | వై.ఎస్.ఆర్. కడప |
| 10 | పశ్చిమ గోదావరి | 23 | నంద్యాల |
| 11 | ఏలూరు | 24 | అనంతపురము |
| 12 | ఎన్టీఆర్ జిల్లా | 25 | కర్నూలు |
| 13 | కృష్ణా | 26 | శ్రీ సత్యసాయి |
షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించిన స్థానిక రిజర్వేషన్
- పోస్టు కోడ్ నం. 02కు సంబంధించి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.
- తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చిన అభ్యర్థులకు స్థానిక స్థితి02 జూన్ 2014 నుంచి 01 జూన్ 2024 మధ్య తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చిన అభ్యర్థులు, నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం తమ స్థానిక స్థితిని నిర్ధారించుకోవాలి.
- వారు సంబంధిత అధికారుల నుంచి స్థానిక స్థితి ధృవీకరణ పత్రం (Local Status Certificate) పొందాలి. ధృవీకరణ సమయంలో ఆ పత్రాన్ని సమర్పించాలి.
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష కేంద్రాలు
| క్రమ సంఖ్య | జిల్లా పేరు | క్రమ సంఖ్య | జిల్లా పేరు |
|---|---|---|---|
| 1 | శ్రీకాకుళం | 14 | గుంటూరు |
| 2 | విజయనగరం | 15 | పల్నాడు |
| 3 | పార్వతీపురం మన్యం | 16 | ప్రకాశం |
| 4 | విశాఖపట్నం | 17 | ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు |
| 5 | అనకాపల్లి | 18 | తిరుపతి |
| 6 | అల్లూరి సీతారామరాజు | 19 | చిత్తూరు |
| 7 | తూర్పు గోదావరి | 20 | అన్నమయ్య |
| 8 | కాకినాడ | 21 | వై.ఎస్.ఆర్. కడప |
| 9 | డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ | 22 | నంద్యాల |
| 10 | పశ్చిమ గోదావరి | 23 | అనంతపురము |
| 11 | ఏలూరు | 24 | కర్నూలు |
| 12 | ఎన్టీఆర్ జిల్లా | 25 | శ్రీ సత్యసాయి |
| 13 | కృష్ణా |
పరీక్షా కేంద్రానికి సంబంధించిన ముఖ్యమైన నిబంధన
- అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న జిల్లాలోనే పరీక్ష రాయాలి.
నియామక పరీక్ష విధానం
ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష (Written Examination), కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష (Computer Proficiency Test – CPT) నిర్వహిస్తారు. పరీక్షల విధానం, మార్కులు, సమయం, అర్హత మార్కుల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
1. రాత పరీక్ష విధానం (Scheme of Written Examination)
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ (Objective Type)
స్థాయి: డిగ్రీ స్థాయి (Degree Standard)
| పేపర్ | సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | పరీక్ష సమయం | గరిష్ఠ మార్కులు |
|---|---|---|---|---|
| పేపర్–I | జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (సాధారణ అధ్యయనాలు, మానసిక సామర్థ్యం) | 150 | 150 నిమిషాలు | 150 |
| పేపర్–II | సబ్జెక్ట్ (ఎడ్యుకేషన్) – విద్యాశాస్త్రం | 150 | 150 నిమిషాలు | 150 |
| మొత్తం | 300 | 300 నిమిషాలు | 300 |
రాత పరీక్ష ముఖ్యాంశాలు
- మొత్తం ప్రశ్నలు: 300
- మొత్తం మార్కులు: 300
- ప్రతి పేపర్‌కు కేటాయించిన మార్కులు: 150
- ప్రతి పేపర్ పరీక్ష సమయం: 150 నిమిషాలు
- పరీక్ష స్థాయి: డిగ్రీ స్థాయి
2. కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష (CPT)
కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష ప్రాక్టికల్ విధానంలో నిర్వహిస్తారు.
| పరీక్ష అంశం | పరీక్ష సమయం | గరిష్ఠ మార్కులు |
|---|---|---|
| కంప్యూటర్లు మరియు సంబంధిత సాఫ్ట్‌వేర్ వినియోగంతో ఆఫీస్ ఆటోమేషన్‌లో ప్రావీణ్యం | 60 నిమిషాలు | 100 |
కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులు
| అభ్యర్థుల కేటగిరీ | కనీస అర్హత మార్కులు |
|---|---|
| SC / ST / PBD | 30 |
| BC | 35 |
| OC | 40 |
దరఖాస్తు చేసుకునే విధానం (HOW TO APPLY)
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు కింది సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
1. దరఖాస్తు ప్రక్రియ – దశలవారీగా
దశ–1: OTPR నమోదు
- APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- ఇప్పటికే OTPR నంబర్ ఉన్నవారు దాని ద్వారా లాగిన్ కావాలి.
- మొదటిసారి దరఖాస్తు చేసుకునేవారు ముందుగా OTPR నమోదు చేసుకుని ఐడీ పొందాలి.
- నమోదు చేసిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలి.
- అవసరమైతే Modify OTPR ద్వారా వివరాలను సవరించి సేవ్ చేయాలి.
దశ–2: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం
- OTPR ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
- వెబ్‌సైట్‌లోని Online Application Submission పై క్లిక్ చేయాలి.
- నోటిఫికేషన్ నం. 25/2026కు ఎదురుగా ఉన్న Fill Application బటన్‌ను ఎంచుకోవాలి.
దశ–3: దరఖాస్తు వివరాలు నమోదు
- విద్యార్హతలు, స్థానిక / స్థానికేతర స్థితి, వైట్ రేషన్ కార్డు వివరాలు, పోస్టుల ప్రాధాన్యతలు, పరీక్షా కేంద్రం తదితర వివరాలను నమోదు చేయాలి.
- ఫీజు, వయో సడలింపు లెక్కింపునకు ఉపయోగించే వివరాలను సరిచూసుకోవాలి.
- అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి Save & Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
- కేవలం Save చేస్తే దరఖాస్తు పూర్తికాదు. Save & Submit చేసిన తర్వాతే చెల్లింపు లింక్ అందుబాటులోకి వస్తుంది.
2. ఫీజు చెల్లింపు విధానం
- Save & Submit చేసిన తర్వాత చెల్లింపు గేట్‌వేకు వెళ్లాలి.
- ఫీజు విజయవంతంగా చెల్లించిన తర్వాతే దరఖాస్తు పూర్తిగా సమర్పించబడుతుంది.
- చెల్లింపు విజయవంతమైతే పేమెంట్ రిఫరెన్స్ ID రూపొందుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS వస్తుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం సమర్పించిన దరఖాస్తు PDFను డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి.
- చెల్లింపు ప్రక్రియ విఫలమైతే, సూచించిన విధంగా మళ్లీ చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలి.
3. దరఖాస్తులో సవరణలు
- దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ముగిసిన తర్వాత 7 రోజుల వరకు సవరణలకు అవకాశం ఉంటుంది.
- ప్రతి సవరణకు ₹100 చెల్లించాలి.
- పేరు, ఫీజు, వయో సడలింపులు, కమ్యూనిటీ / రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన వివరాలను సవరించడానికి అనుమతి లేదు.
- సవరణలు నిర్ణీత గడువులోనే చేసుకోవాలి.
- మాన్యువల్ దరఖాస్తుల ద్వారా సవరణలకు అనుమతి లేదు.
4. అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు
- దరఖాస్తు సమర్పించే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
- OTPRలో నమోదు చేసిన వివరాలనే ఈ నోటిఫికేషన్‌కు పరిగణనలోకి తీసుకుంటారు. తరువాత OTPRలో మార్పులు చేసినా ఈ నియామకానికి పరిగణించరు.
- అసంపూర్ణమైన లేదా తప్పులున్న దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
- దరఖాస్తులో సంబంధిత కాలమ్‌లను ఖాళీగా వదలకూడదు.
- విద్యార్హతలు, వయస్సు, రిజర్వేషన్ తదితర అర్హతలను ముందుగానే నిర్ధారించుకోవాలి.
- తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే అభ్యర్థిత్వం తిరస్కరణకు గురికావచ్చు.
- దరఖాస్తు సమర్పించిన తర్వాత వివరాలు మార్పు చేయడానికి పరిమిత అవకాశమే ఉంటుంది కాబట్టి, మొదటిసారే సరైన వివరాలు నమోదు చేయాలి.
5. ముఖ్యమైన అంశాలు – సంక్షిప్తంగా
ముఖ్య గమనిక: దరఖాస్తు వివరాలను సేవ్ చేయడం మాత్రమే సరిపోదు. Save & Submit చేసి, ఫీజు చెల్లింపు విజయవంతంగా పూర్తయినప్పుడే దరఖాస్తు సమర్పణ పూర్తవుతుంది.
| హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II అధికారిక నోటిఫికేషన్ చూడడానికి లింక్ | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II అధికారిక నోటిఫికేషన్ |
| హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II ఉద్యోగాలకి అప్లై చెయ్యడానికి డైరెక్ట్ లింక్ | అప్లికేషన్ లింక్ |
| AP సర్వీస్ కమిషన్ అధికారిక లింక్ | Andhra Pradesh Public Service Commission |
| లేటెస్ట్ ఉద్యోగాల వివరాలు చూడడానికి లింక్ | https://uchitaudyogasamachar.in/ |
| ఎంప్లాయ్మెంట్ న్యూస్ వీక్లీలు చూడదడానికి లింక్ | ఎంప్లాయ్మెంట్ న్యూస్ pdfలు |
| జాబ్ ప్రిపరేషన్ హబ్ లో స్టడీ మెటీరీయల్ చూడడానికి లింక్ | ఉద్యోగసమాచార వేదిక -జాబ్ ప్రిపరేషన్ హబ్ |
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II నోటిఫికేషన్ 2026, ప్రశ్నలు – సమాధానాలు
విభాగం–1: నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు
1. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంస్థ ఏది?
సమాధానం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), విజయవాడ.
2. ఈ నియామక నోటిఫికేషన్ నంబర్ ఎంత?
సమాధానం: నోటిఫికేషన్ నం. 25/2026.
3. నోటిఫికేషన్ విడుదల తేదీ ఏది?
సమాధానం: 09 అక్టోబర్ 2026.
4. ఈ నియామకంలో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
సమాధానం: 97 పోస్టులు.
5. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–II పోస్టులు ఎన్ని శాఖల్లో భర్తీ చేస్తున్నారు?
సమాధానం: మూడు శాఖల్లో.
- సాంఘిక సంక్షేమ శాఖ.
- గిరిజన సంక్షేమ శాఖ.
- వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ.
6. సాంఘిక సంక్షేమ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
సమాధానం: 41 పోస్టులు.
7. గిరిజన సంక్షేమ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
సమాధానం: 23 పోస్టులు.
8. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
సమాధానం: 33 పోస్టులు.
9. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏది?
సమాధానం: 29 అక్టోబర్ 2026, రాత్రి 11:59 గంటల వరకు.
10. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
సమాధానం: APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా — APPSC అధికారిక వెబ్‌సైట్.
విభాగం–2: విద్యార్హతలకు సంబంధించిన ప్రశ్నలు
11. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు అవసరమైన విద్యార్హత ఏమిటి?
సమాధానం: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు B.Ed. లేదా B.T. డిగ్రీ ఉండాలి.
12. గిరిజన సంక్షేమ శాఖ పోస్టుకు అవసరమైన విద్యార్హత ఏమిటి?
సమాధానం: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా B.Ed. ఉండాలి.
13. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పోస్టుకు అవసరమైన విద్యార్హత ఏమిటి?
సమాధానం: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు B.Ed. లేదా సమానమైన అర్హత ఉండాలి.
14. అన్ని శాఖల పోస్టులకు విద్యార్హతలు ఒకే విధంగా ఉన్నాయా?
సమాధానం: లేదు. శాఖను బట్టి విద్యార్హతల్లో తేడాలు ఉన్నాయి.
15. విద్యార్హతను ఏ సంస్థ గుర్తించి ఉండాలి?
సమాధానం: సంబంధిత విశ్వవిద్యాలయం లేదా సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తింపు పొందినదై ఉండాలి.
విభాగం–3: వయోపరిమితికి సంబంధించిన ప్రశ్నలు
16. ఈ పోస్టులకు కనిష్ఠ వయస్సు ఎంత?
సమాధానం: 18 సంవత్సరాలు.
17. గరిష్ఠ వయస్సు ఎంత?
సమాధానం: 44 సంవత్సరాలు.
18. వయస్సును ఏ తేదీ నాటికి లెక్కిస్తారు?
సమాధానం: 01 జూలై 2026 నాటికి.
19. SC, ST, BC, EWS అభ్యర్థులకు సాధారణంగా ఎంత వయో సడలింపు ఉంటుంది?
సమాధానం: 5 సంవత్సరాలు.
20. బెంచ్‌మార్క్ వైకల్యాలు కలిగిన వ్యక్తులకు (PwBD) ఎంత వయో సడలింపు ఉంటుంది?
సమాధానం: నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం 10 సంవత్సరాలు.
21. SC/ST క్యారీ ఫార్వర్డ్ ఖాళీలకు ఎంత వయో సడలింపు ఉంటుంది?
సమాధానం: నోటిఫికేషన్‌లో పేర్కొన్న పరిమిత నియామకానికి 10 సంవత్సరాలు.
22. రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు గరిష్ఠంగా ఎంత సడలింపు ఉంటుంది?
సమాధానం: అర్హత కలిగిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెగ్యులర్ సర్వీస్ కాలాన్ని గరిష్ఠంగా 5 సంవత్సరాల వరకు వయస్సు నుంచి మినహాయిస్తారు.
విభాగం–4: దరఖాస్తు ఫీజుకు సంబంధించిన ప్రశ్నలు
23. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు ఎంత?
సమాధానం: ₹250.
24. పరీక్ష ఫీజు ఎంత?
సమాధానం: ₹80.
25. రెండు ఫీజులు కలిపి ఎంత చెల్లించాలి?
సమాధానం: ₹330.
26. పరీక్ష ఫీజు మినహాయింపు పొందే అభ్యర్థులు ఎవరు?
సమాధానం: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలకు లోబడి SC, ST, BC, PwBD, మాజీ సైనికులు, అర్హత కలిగిన తెల్ల రేషన్ కార్డు కుటుంబాల అభ్యర్థులు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు మినహాయింపు వర్తించవచ్చు.
27. ఫీజును ఏ విధంగా చెల్లించాలి?
సమాధానం: ఆన్‌లైన్ ద్వారా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఉపయోగించి చెల్లించాలి.
28. ఫీజు చెల్లించిన తర్వాత తిరిగి పొందవచ్చా?
సమాధానం: లేదు. నోటిఫికేషన్ ప్రకారం చెల్లించిన ఫీజు తిరిగి చెల్లించబడదు.
విభాగం–5: పరీక్ష విధానానికి సంబంధించిన ప్రశ్నలు
29. రాత పరీక్ష ఏ విధంగా నిర్వహిస్తారు?
సమాధానం: కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షగా నిర్వహిస్తారు.
30. రాత పరీక్షలో ఎన్ని పేపర్లు ఉంటాయి?
సమాధానం: రెండు పేపర్లు.
31. పేపర్–I ఏ సబ్జెక్టుకు సంబంధించినది?
సమాధానం: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ.
32. పేపర్–Iలో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి?
సమాధానం: 150 ప్రశ్నలు.
33. పేపర్–I గరిష్ఠ మార్కులు, పరీక్ష సమయం ఎంత?
సమాధానం: 150 మార్కులు, 150 నిమిషాలు.
34. పేపర్–II ఏ సబ్జెక్టుకు సంబంధించినది?
సమాధానం: సబ్జెక్ట్ (ఎడ్యుకేషన్) – విద్యాశాస్త్రం.
35. పేపర్–IIలో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి?
సమాధానం: 150 ప్రశ్నలు.
36. పేపర్–II గరిష్ఠ మార్కులు, పరీక్ష సమయం ఎంత?
సమాధానం: 150 మార్కులు, 150 నిమిషాలు.
37. రాత పరీక్షలో మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి?
సమాధానం: 300 ప్రశ్నలు.
38. రాత పరీక్ష మొత్తం మార్కులు ఎన్ని?
సమాధానం: 300 మార్కులు.
39. రాత పరీక్షకు మొత్తం ఎంత సమయం కేటాయించారు?
సమాధానం: రెండు పేపర్లకు కలిపి 300 నిమిషాలు, అంటే 5 గంటలు.
రాత పరీక్ష వివరాల పట్టిక
| పేపర్ | సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు | సమయం |
|---|---|---|---|---|
| పేపర్–I | జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ | 150 | 150 | 150 నిమిషాలు |
| పేపర్–II | ఎడ్యుకేషన్ | 150 | 150 | 150 నిమిషాలు |
| మొత్తం | 300 | 300 | 300 నిమిషాలు |
విభాగం–6: కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష (CPT)
40. CPT పూర్తి రూపం ఏమిటి?
సమాధానం: Computer Proficiency Test (కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష).
41. CPT ఏ విధంగా నిర్వహిస్తారు?
సమాధానం: ప్రాక్టికల్ పరీక్షగా నిర్వహిస్తారు.
42. CPT గరిష్ఠ మార్కులు ఎన్ని?
సమాధానం: 100 మార్కులు.
43. CPT పరీక్ష సమయం ఎంత?
సమాధానం: 60 నిమిషాలు.
44. CPTలో ఏ అంశాన్ని పరీక్షిస్తారు?
సమాధానం: కంప్యూటర్ల వినియోగం, ఆఫీస్ ఆటోమేషన్, సంబంధిత సాఫ్ట్‌వేర్‌పై అభ్యర్థుల ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు.
45. SC/ST/PBD అభ్యర్థులకు CPT కనీస అర్హత మార్కులు ఎన్ని?
సమాధానం: 30 మార్కులు.
46. BC అభ్యర్థులకు CPT కనీస అర్హత మార్కులు ఎన్ని?
సమాధానం: 35 మార్కులు.
47. OC అభ్యర్థులకు CPT కనీస అర్హత మార్కులు ఎన్ని?
సమాధానం: 40 మార్కులు.
CPT కనీస అర్హత మార్కుల పట్టిక
| అభ్యర్థుల కేటగిరీ | కనీస అర్హత మార్కులు |
|---|---|
| SC / ST / PBD | 30 |
| BC | 35 |
| OC | 40 |
| గరిష్ఠ మార్కులు | 100 |
విభాగం–7: స్థానిక రిజర్వేషన్, పరీక్షా కేంద్రాలు
48. ఈ పోస్టులు ఏ క్యాడర్‌కు సంబంధించినవి?
సమాధానం: జిల్లా క్యాడర్ పోస్టులు.
49. స్థానిక రిజర్వేషన్ శాతం ఎంత?
సమాధానం: నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్–2025 ప్రకారం 95% స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది.
50. పరీక్షా కేంద్రాన్ని ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు?
సమాధానం: నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న జిల్లాలోనే పరీక్ష రాయాలి.
51. పోస్టు కోడ్–02కు సంబంధించి ఏ ప్రత్యేక నిబంధన వర్తిస్తుంది?
సమాధానం: నోటిఫికేషన్‌లోని పేరా 4.2 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.
విభాగం–8: ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
52. OTPR అంటే ఏమిటి?
సమాధానం: One Time Profile Registration. ఇది APPSC వెబ్‌సైట్‌లో అభ్యర్థి ప్రొఫైల్ నమోదు చేసుకునే విధానం.
53. మొదటిసారి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ముందుగా ఏమి చేయాలి?
సమాధానం: ముందుగా OTPR నమోదు చేసుకుని OTPR ID పొందాలి.
54. దరఖాస్తు పూర్తవడానికి ఏ బటన్‌పై క్లిక్ చేయాలి?
సమాధానం: Save & Submit బటన్‌పై క్లిక్ చేసి, ఫీజు చెల్లింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలి.
55. కేవలం Save బటన్‌పై క్లిక్ చేస్తే దరఖాస్తు పూర్తవుతుందా?
సమాధానం: కాదు. Save బటన్‌తో వివరాలు తాత్కాలికంగా మాత్రమే సేవ్ అవుతాయి. Save & Submit చేసి ఫీజు చెల్లించాలి.
56. దరఖాస్తులో సవరణలకు ఎంత ఫీజు చెల్లించాలి?
సమాధానం: అనుమతించిన సవరణలకు ఒక్కో సవరణకు ₹100 చెల్లించాలి.
57. దరఖాస్తు సమర్పణ చివరి తేదీ తర్వాత సవరణలకు ఎంత సమయం ఇస్తారు?
సమాధానం: నోటిఫికేషన్ ప్రకారం 7 రోజుల వరకు.
58. పేరు, ఫీజు, వయో సడలింపు, కమ్యూనిటీ వివరాలను సవరించవచ్చా?
సమాధానం: లేదు. నోటిఫికేషన్ ప్రకారం ఈ వివరాలకు సవరణలు అనుమతించబడవు.
Leave a Reply