| (RRBs) CEN No. 09/2026 Isolated Categories విభాగంలో సుమారు 195 పోస్టుల భర్తీకి సూచనాత్మక నోటీసు |
|---|
| రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) CEN No. 09/2026 ద్వారా Isolated Categories విభాగంలో సుమారు 195 పోస్టుల భర్తీకి సూచనాత్మక నోటీసును విడుదల చేశాయి. ఈ నియామకాల్లో పే లెవెల్ 2 నుండి 7కు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు 05 నవంబర్ 2026 నుంచి ప్రారంభమై 04 డిసెంబర్ 2026 రాత్రి 11:59 గంటలకు ముగియనున్నట్లు ప్రాథమిక నోటీసులో పేర్కొన్నారు. ల్యాబ్ అసిస్టెంట్, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ), స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించే అవకాశం ఉంది . పోస్టులు విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పోస్టుల వారీగా ఖాళీల వివరాలను వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలో ఖచ్చితంగా తెలియజేయ బడతాయి. |
Isolated Categories Recruitment – CEN No. 09/2026 (షార్ట్ నోటిఫికేషన్ )
నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ పేరు | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) |
| మంత్రిత్వ శాఖ | భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ |
| నోటిఫికేషన్ నంబర్ | CEN No. 09/2026 |
| నియామకాల విభాగం | Isolated Categories (ప్రత్యేక కేటగిరీ పోస్టులు) |
| నోటిఫికేషన్ రకం | సూచనాత్మక నోటీసు (Indicative Notice) |
| మొత్తం అంచనా ఖాళీలు | సుమారు 195 పోస్టులు |
| పే లెవెల్స్ | 7వ CPC ప్రకారం Level 2 నుంచి Level 7 వరకు |
| వైద్య ప్రమాణాలు | వివరణాత్మక నోటిఫికేషన్ (Detailed CEN) ప్రకారం |
| వయోపరిమితి | 01-01-2027 నాటికి వర్తించే నిబంధనల ప్రకారం; పూర్తి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌లో ఉంటాయి |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ ద్వారా మాత్రమే |
| ఇండికేటివ్ నోటీసు తేదీ | 24-10-2026 |
| అధికారిక వెబ్‌సైట్ | rrb.indianrailways.gov.in |
ముఖ్యమైన దరఖాస్తు తేదీలు
| అంశం | తేదీ |
|---|---|
| ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ | 05-11-2026 (తాత్కాలికం) |
| ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 04-12-2026 |
| దరఖాస్తుల ముగింపు సమయం | రాత్రి 11:59 గంటలు |
| తేదీల స్థితి | తాత్కాలికం (Tentative) |
అంచనా పోస్టుల జాబితా
| క్రమ సంఖ్య | పోస్టు పేరు (English) | పోస్టు పేరు (తెలుగు) | పే లెవెల్ |
|---|---|---|---|
| 1 | Lab Assistant Gr. III, Chemist & Metallurgist | ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III, కెమిస్ట్ & మెటలర్జిస్ట్ | Level 2 |
| 2 | Chief Law Assistant | చీఫ్ లా అసిస్టెంట్ | Level 7 |
| 3 | Public Prosecutor | పబ్లిక్ ప్రాసిక్యూటర్ | Level 7 |
| 4 | Junior Translator, Hindi | జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ) | Level 6 |
| 5 | Staff and Welfare Inspector | స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ | Level 6 |
| 6 | Senior Publicity Inspector | సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ | Level 6 |
| 7 | Scientific Assistant, Training | సైంటిఫిక్ అసిస్టెంట్ (ట్రైనింగ్) | Level 6 |
అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాల్సిన సూచనలు
- ఆధార్ వివరాలు: ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో ఆధార్ ఆధారిత ధ్రువీకరణలో ఇబ్బందులు రాకుండా వ్యక్తిగత వివరాలను ముందుగానే తనిఖీ చేసుకోవాలి.
- పేరు, పుట్టిన తేదీ: ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ పదో తరగతి సర్టిఫికెట్‌లోని వివరాలతో సరిపోలేలా చూసుకోవాలి.
- బయోమెట్రిక్ వివరాలు: ఆధార్‌లో ఫోటో, వేలిముద్రలు, ఐరిస్ వివరాలు తాజాగా ఉండేలా చూసుకోవాలని నోటీసులో సూచించారు.
- వివరణాత్మక నోటిఫికేషన్: అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, ఇతర నియామక నిబంధనలకు సంబంధించి తుది నిర్ణయాత్మక సమాచారం వివరణాత్మక CEN No. 09/2026లో ఉంటుంది.
- అధికారిక వెబ్‌సైట్: తాజా సమాచారం కోసం RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Leave a Reply