GK మరియు డైలీ కరంట్ అఫైర్స్,05 నవంబర్ 2026

జనరల్ నాలెడ్జ్

ఆధునిక భారతదేశ ప్రముఖులు – బిరుదులు మరియు అసలు పేర్లు

(Famous Personalities of Modern Indian History – Titles and Original Names)

1. ప్రముఖుల బిరుదులు – పేర్లు – ముఖ్యమైన వ్యాఖ్యలు

బిరుదు (Nickname/Title)అసలు పేరు (Original Name)ముఖ్యమైన వ్యాఖ్యలు
ఆంధ్ర కేసరి (Andhra Kesari)టంగుటూరి ప్రకాశం పంతులుబ్రిటిష్ పోలీసుల తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యసాహసాలకు ఈ బిరుదు లభించింది. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి.
అన్నా (Anna)సి.ఎన్. అన్నాదురైతమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు. ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
బాద్షా ఖాన్ (Badshah Khan)అబ్దుల్ గఫార్ ఖాన్వాయవ్య సరిహద్దు ప్రాంతంలో అహింసా ఉద్యమాన్ని నడిపారు. ఖుదాయ్ ఖిద్మత్‌గార్ ఉద్యమ స్థాపకుడు.
బాపు / మహాత్మా (Bapu / Mahatma)మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీభారత స్వాతంత్ర్యోద్యమంలో అహింస, సత్యాగ్రహ మార్గాలను అనుసరించారు.
ఆసియా వెలుగుదీపం (Beacon of Light of Asia)గౌతమ బుద్ధుడుబౌద్ధమత స్థాపకుడు. అహింస, కరుణ, శాంతి సందేశాలను ప్రపంచానికి అందించారు.
చాచా (Chacha)జవహర్‌లాల్ నెహ్రూపిల్లలంటే ఎంతో ప్రేమ ఉండటంతో చాచా నెహ్రూ అని పిలుస్తారు. నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటారు.
సి.ఆర్. (C.R.)సి. రాజగోపాలాచారిభారతదేశ చివరి గవర్నర్ జనరల్. రాజాజీ అని కూడా పిలుస్తారు.
దీనబంధు (Deenbandhu)చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్భారతీయుల హక్కుల కోసం, ముఖ్యంగా కార్మికుల సంక్షేమం కోసం పోరాడారు.
దేశబంధు (Deshbandhu)చిత్తరంజన్ దాస్భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు. స్వరాజ్ పార్టీ స్థాపకుల్లో ఒకరు.
జ్ఞానోదయం పొందినవాడు (The Enlightened One)గౌతమ బుద్ధుడుబోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందినట్లు బౌద్ధ సంప్రదాయం చెబుతుంది.
భారత అశాంతికి పితామహుడు (Father of Indian Unrest)బాలగంగాధర్ తిలక్బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో జాతీయ భావాలను, స్వాతంత్ర్య కాంక్షను పెంపొందించారు.
స్థానిక స్వపరిపాలన పితామహుడు (Father of Local Self-Government)లార్డ్ రిప్పన్భారతదేశంలో స్థానిక స్వపరిపాలన అభివృద్ధికి కీలక సంస్కరణలు ప్రవేశపెట్టారు.
భారత జాతిపిత (Father of the Nation)మహాత్మా గాంధీభారత స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించిన ప్రముఖ నాయకుడు.
సరిహద్దు గాంధీ (Frontier Gandhi)ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్అహింసా సిద్ధాంతాన్ని అనుసరించిన పఠాన్ నాయకుడు.
భారత వృద్ధ నాయకుడు (Grand Old Man of India)దాదాభాయ్ నౌరోజీభారత జాతీయ కాంగ్రెస్ తొలి నాయకుల్లో ఒకరు. సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
గురుదేవ్ (Gurudev)రవీంద్రనాథ్ ఠాగూర్గీతాంజలి రచనకు నోబెల్ బహుమతి పొందారు. భారత జాతీయ గీతం రచయిత.
భారత బిస్మార్క్ (Indian Bismarck)సర్దార్ వల్లభభాయ్ పటేల్స్వాతంత్ర్యం తర్వాత 500కు పైగా సంస్థానాల విలీనంలో కీలక పాత్ర పోషించారు.
భారత ఐన్‌స్టీన్ (Indian Einstein)నాగార్జునుడుప్రాచీన భారతీయ తత్వవేత్త, బౌద్ధ తాత్వికుడు. ఆయనను ఈ బిరుదుతో కూడా ప్రస్తావిస్తారు.
భారత నెపోలియన్ (Indian Napoleon)సముద్రగుప్తుడుగుప్త సామ్రాజ్యాన్ని విస్తరించిన గొప్ప చక్రవర్తి. అలహాబాద్ ప్రశస్తి ఆయన విజయాలను వివరిస్తుంది.
జె.పి. / లోక్ నాయక్ (J.P. / Loknayak)జయప్రకాశ్ నారాయణ్సంపూర్ణ విప్లవ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
లాల్, బాల్, పాల్ (Lal, Bal, Pal)లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్స్వదేశీ ఉద్యమం, జాతీయవాద ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ముగ్గురు నాయకులు.
భారత పత్రికా స్వేచ్ఛా విమోచకుడు (Liberator of Indian Press)సర్ చార్లెస్ మెట్కాఫ్భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు అనుకూలంగా చర్యలు తీసుకున్నారు.
పంజాబ్ సింహం (Lion of Punjab / Sher-e-Punjab)లాలా లజపతిరాయ్బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.
లోకమాన్య (Lokmanya)బాలగంగాధర్ తిలక్ప్రజలచే గౌరవించబడిన నాయకుడు. స్వరాజ్యం నా జన్మహక్కు అనే నినాదంతో ప్రసిద్ధి చెందారు.
మహామన (Mahamana)పండిట్ మదన్ మోహన్ మాలవ్యబనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపనలో కీలక పాత్ర పోషించారు.
భారత మార్టిన్ లూథర్ (Martin Luther of India)స్వామి దయానంద సరస్వతిఆర్యసమాజ్ స్థాపకుడు. వేదాల ప్రాముఖ్యతను ప్రచారం చేశారు.
ఉక్కు మనిషి (Man of Iron / Iron Man of India)సర్దార్ వల్లభభాయ్ పటేల్భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం కృషి చేశారు.
నేతాజీ (Netaji)సుభాష్ చంద్రబోస్ఆజాద్ హింద్ ఫౌజ్‌కు నాయకత్వం వహించి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడారు.
భారత కోకిల (Nightingale of India)సరోజినీ నాయుడుప్రముఖ కవయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు. భారతదేశ తొలి మహిళా రాష్ట్ర గవర్నర్.
భారత చిలుక (Parrot of India / Tuti-e-Hindustan)అమీర్ ఖుస్రోపర్షియన్, హిందవీ సాహిత్యంలో ప్రసిద్ధ కవి, సంగీతకారుడు.
దేశభక్తులలో అగ్రగణ్యుడు (Patriot of Patriots)సుభాష్ చంద్రబోస్దేశ స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు.
పంజాబ్ కేసరి (Punjab Kesari)లాలా లజపతిరాయ్పంజాబ్ ప్రాంతంలో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు.
దేవుని శాపం (Scourge of God)చెంఘిజ్ ఖాన్మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు. తన సైనిక దండయాత్రలకు ప్రసిద్ధి చెందాడు.

2. పోటీ పరీక్షలకు అత్యంత ముఖ్యమైన బిరుదులు

బిరుదుప్రముఖుడు
ఆంధ్ర కేసరిటంగుటూరి ప్రకాశం పంతులు
భారత జాతిపితమహాత్మా గాంధీ
సరిహద్దు గాంధీఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
భారత వృద్ధ నాయకుడుదాదాభాయ్ నౌరోజీ
భారత బిస్మార్క్సర్దార్ వల్లభభాయ్ పటేల్
భారత నెపోలియన్సముద్రగుప్తుడు
లోకమాన్యబాలగంగాధర్ తిలక్
పంజాబ్ కేసరిలాలా లజపతిరాయ్
భారత కోకిలసరోజినీ నాయుడు
గురుదేవ్రవీంద్రనాథ్ ఠాగూర్
నేతాజీసుభాష్ చంద్రబోస్
మహామనమదన్ మోహన్ మాలవ్య
చాచా నెహ్రూజవహర్‌లాల్ నెహ్రూ
భారత మార్టిన్ లూథర్దయానంద సరస్వతి
ఉక్కు మనిషిసర్దార్ వల్లభభాయ్ పటేల్

3. ముఖ్యమైన గమనికలు

  1. ఆంధ్ర కేసరి: టంగుటూరి ప్రకాశం పంతులుకు ఆంధ్ర కేసరి అనే బిరుదు లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పోటీ పరీక్షలకు ఇది చాలా ముఖ్యమైనది.
  2. సరిహద్దు గాంధీ – బాద్షా ఖాన్: ఈ రెండు బిరుదులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు సంబంధించినవే.
  3. ఉక్కు మనిషి – భారత బిస్మార్క్: ఈ రెండు బిరుదులు సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు సంబంధించినవి.
  4. పంజాబ్ కేసరి – పంజాబ్ సింహం: ఈ రెండు బిరుదులు లాలా లజపతిరాయ్‌కు సంబంధించినవి.
  5. గౌతమ బుద్ధుడు: Enlightened One అనే బిరుదుతో పాటు Light of Asia అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందారు.

కరంట్ అఫైర్స్

అమెరికా మధ్యంతర ఎన్నికలు – 2026 (US Midterm Elections 2026)

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ ఘన విజయం

2026 నవంబర్ 3న జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ ఘన విజయం సాధించి, ప్రతినిధుల సభ (House of Representatives), సెనేట్ (Senate) రెండింటిలోనూ మెజారిటీ సాధించారు . దీంతో రిపబ్లికన్ పార్టీకి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఫలితాల ద్వారా ట్రంప్ ప్రభుత్వ విధానాలపై విచారణలు చేపట్టడానికి, ఆయన పరిపాలనపై మరింత రాజకీయ ఒత్తిడి తీసుకురావడానికి ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీకి అవకాశం లభించింది.

టెక్సాస్‌లో డెమొక్రటిక్ అభ్యర్థి జాస్మిన్ తలారికో సెనేట్ ఎన్నికల్లో విజయం సాధించారు. మిచిగాన్‌లో అబ్దుల్ ఎల్-సయీద్ విజయం సాధించి అమెరికా సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తిగా నిలిచినట్లు తెలుస్తుంది . కాన్సాస్‌లో ఆడమ్ హామిల్టన్, మైనేలో ట్రాయ్ జాక్సన్ విజయం సాధించారు.

అలాగే జార్జియాలో కైషా లాన్స్ బాటమ్స్ గవర్నర్‌గా ఎన్నికై అమెరికా చరిత్రలో తొలి నల్లజాతి మహిళా గవర్నర్‌గా గుర్తింపు పొందారు. ప్రతినిధుల సభలోనూ డెమొక్రటిక్ పార్టీ గణనీయమైన స్థానాలను గెలుచుకుంది. రిపబ్లికన్ పార్టీకి ఫ్లోరిడాలో మాత్రం కొంత ఊరట లభించింది.

ముఖ్యమైన విషయం: ఈ ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడిని నేరుగా మార్చవు. అయితే కాంగ్రెస్‌లో మెజారిటీ మారడం వల్ల అధ్యక్షుడి విధానాలు, చట్టాల ఆమోదం, ప్రభుత్వంపై పర్యవేక్షణ వంటి అంశాలపై ప్రభావం పడుతుంది.


2. అమెరికా కాంగ్రెస్ నిర్మాణం (Structure of US Congress)

అమెరికా పార్లమెంటును కాంగ్రెస్ (Congress) అంటారు. ఇది ద్విసభా వ్యవస్థ (Bicameral Legislature) కలిగి ఉంటుంది.

అమెరికా కాంగ్రెస్‌లో రెండు సభలు ఉంటాయి.

అంశంప్రతినిధుల సభ (House of Representatives)సెనేట్ (Senate)
సభల సంఖ్యదిగువ సభఎగువ సభ
మొత్తం సభ్యులు435100
సభ్యుల ఎన్నికప్రజల ద్వారా ప్రత్యక్ష ఎన్నికప్రజల ద్వారా ప్రత్యక్ష ఎన్నిక
పదవీకాలం2 సంవత్సరాలు6 సంవత్సరాలు
ప్రాతినిధ్యంజనాభా ఆధారంగాప్రతి రాష్ట్రానికి ఇద్దరు సభ్యులు
అధ్యక్షతస్పీకర్అమెరికా ఉపాధ్యక్షుడు (Vice President)
ప్రత్యేక అధికారంమనీ బిల్లులు మొదట ప్రవేశపెట్టడంకీలక నియామకాలు, ఒప్పందాలకు ఆమోదం

ముఖ్యమైన అంశాలు

  1. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి.
  2. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సెనేటర్లు ఎన్నికవుతారు.
  3. సెనేట్‌లో మొత్తం 100 మంది సభ్యులు ఉంటారు.
  4. ప్రతినిధుల సభలో 435 మంది ఓటింగ్ సభ్యులు ఉంటారు.
  5. సెనేటర్ల పదవీకాలం 6 సంవత్సరాలు.
  6. ప్రతినిధుల సభ సభ్యుల పదవీకాలం 2 సంవత్సరాలు.
  7. సెనేట్‌లో ప్రతి రెండు సంవత్సరాలకు సుమారు మూడింట ఒక వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

3. అమెరికా ఎన్నికల విధానం (US Electoral System)

అమెరికాలో ప్రధానంగా రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి.

  • డెమొక్రటిక్ పార్టీ (Democratic Party)
  • రిపబ్లికన్ పార్టీ (Republican Party)

A. అధ్యక్ష ఎన్నికలు (Presidential Elections)

  • అమెరికా అధ్యక్షుడి పదవీకాలం 4 సంవత్సరాలు.
  • అధ్యక్షుడిని ఎలక్టోరల్ కాలేజీ (Electoral College) విధానం ద్వారా ఎన్నుకుంటారు.
  • మొత్తం ఎలక్టోరల్ ఓట్లు 538.
  • అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం.
  • ఒక వ్యక్తి గరిష్ఠంగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నిక కావచ్చు.

B. మధ్యంతర ఎన్నికలు (Midterm Elections)

అధ్యక్షుడి నాలుగు సంవత్సరాల పదవీకాలంలో రెండేళ్లు పూర్తయినప్పుడు జరిగే ఎన్నికలను మధ్యంతర ఎన్నికలు అంటారు.

ఈ ఎన్నికల్లో:

  • ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
  • సెనేట్‌లోని సుమారు మూడింట ఒక వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
  • కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల ఎన్నికలు కూడా జరుగుతాయి.
  • రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు.

ముఖ్యమైన విషయం: మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడి పదవికి ఎన్నికలు జరగవు.


4. పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు (Exam Special)

ప్రశ్నసమాధానం
అమెరికా పార్లమెంటు పేరు ఏమిటి?కాంగ్రెస్
అమెరికా కాంగ్రెస్‌లో ఎన్ని సభలు ఉన్నాయి?రెండు
అమెరికా దిగువ సభ పేరు ఏమిటి?హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్
అమెరికా ఎగువ సభ పేరు ఏమిటి?సెనేట్
అమెరికా సెనేట్‌లో మొత్తం సభ్యులు ఎంతమంది?100
అమెరికా ప్రతినిధుల సభలో ఓటింగ్ సభ్యులు ఎంతమంది?435
అమెరికాలో మొత్తం రాష్ట్రాలు ఎన్ని?50
ఒక్కో రాష్ట్రం నుంచి ఎంతమంది సెనేటర్లు ఎన్నికవుతారు?ఇద్దరు
అమెరికా సెనేటర్ పదవీకాలం ఎంత?6 సంవత్సరాలు
ప్రతినిధుల సభ సభ్యుల పదవీకాలం ఎంత?2 సంవత్సరాలు
అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?4 సంవత్సరాలు
అమెరికాలో మొత్తం ఎలక్టోరల్ ఓట్లు ఎన్ని?538
అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ఎన్ని ఎలక్టోరల్ ఓట్లు అవసరం?270
మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి?అధ్యక్షుడి పదవీకాలంలో రెండేళ్ల తర్వాత
అమెరికా ఉపాధ్యక్షుడి హోదా ఏమిటి?సెనేట్ అధ్యక్షుడు (President of the Senate)


అగ్నివీరులకు రెండేళ్ల అదనపు సర్వీస్ అవకాశం (Agniveer Service Extension)

కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకంలో కీలక మార్పులు చేస్తూ, అగ్నివీరులకు అదనంగా రెండేళ్లపాటు సైన్యంలో సేవ చేసే అవకాశాన్ని కల్పించేందుకు ఆమోదం తెలిపింది. సవరించిన విధానం ప్రకారం, ప్రతి బ్యాచ్‌లోని 25% మంది అగ్నివీరులు ప్రతిభ, పనితీరు ఆధారంగా సాధారణ సైనికులుగా (Regular Soldiers) కొనసాగడానికి అవకాశం పొందుతారు. మిగిలిన 75% మందికి మరో రెండేళ్లపాటు సేవ చేసే అవకాశం కల్పిస్తారు. ఈ రెండేళ్ల అదనపు సేవ అనంతరం వారు కూడా సాధారణ సైనికులుగా నియామకం పొందేందుకు పరిశీలనకు అర్హులవుతారు. ఈ పొడిగింపు కాలంలో అధిక వేతనం, మెరుగైన సేవా నిధి (Seva Nidhi) ప్రయోజనాలు, సీనియారిటీ వంటి అదనపు ప్రయోజనాలు కల్పించనున్నారు. అగ్నివీరుల పనితీరు, క్రమశిక్షణ, శారీరక సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యాలు, విద్యార్హతలు తదితర అంశాల ఆధారంగా ఈ విధానం అమలు చేయనున్నారు.

ముఖ్యమైన అంశాలు

  1. అగ్నిపథ్ పథకంలో మార్పు: అగ్నివీరులకు అదనంగా రెండేళ్ల సర్వీస్ పొడిగింపు అవకాశం కల్పించనున్నారు.అదనపు రెండేళ్ల సేవా కాలంలో అధిక వేతనం, మెరుగైన సేవా నిధి ప్రయోజనాలు, సీనియారిటీ ప్రయోజనాలు లభిస్తాయి.
  2. నియామక విధానం: 25% మంది ప్రతిభ ఆధారంగా సాధారణ సైనికులుగా కొనసాగుతారు. మిగిలిన 75% మందికి మరో రెండేళ్ల సేవ అనంతరం సాధారణ సైనికులుగా నియామకం పొందేందుకు అవకాశం కల్పిస్తారు.

ISRO NVS-03 ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అక్టోబర్ 30న ప్రయోగించిన NVS-03 ఉపగ్రహం విజయవంతంగా నిర్దేశిత భూస్థిర బదిలీ కక్ష్య (Geosynchronous Orbit)లోకి చేరుకుంది. ఈ ఉపగ్రహం భారతదేశ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అయిన నావిక్ (NavIC), గతంలో IRNSSగా పిలిచే వ్యవస్థ సేవలను మరింత మెరుగుపరచడానికి రూపొందించారు. ఇది తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో మూడవ ఉపగ్రహం. ఇందులో స్వదేశీ అణు గడియారం (Indigenous Atomic Clock)తో పాటు L1, L5, S బ్యాండ్ సిగ్నల్ వ్యవస్థలు ఉన్నాయి. భారత భూభాగంతో పాటు దేశ సరిహద్దుల చుట్టూ 1,500 కిలోమీటర్ల పరిధిలో నావిగేషన్ సేవలను అందించడం దీని లక్ష్యం. నాలుగు విజయవంతమైన కక్ష్య మార్పుల అనంతరం ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యను చేరుకుంది. ప్రస్తుతం ఉపగ్రహం పనితీరు సాధారణంగా ఉందని ఇస్రో వెల్లడించింది.

ముఖ్యమైన అంశాలు

  1. ఉపగ్రహం పేరు: NVS-03. ఇది భారతదేశ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అయిన NavIC (Navigation with Indian Constellation)లో భాగం.
  2. ప్రధాన ప్రత్యేకతలు:
    • స్వదేశీ అణు గడియారం (Indigenous Atomic Clock)ను కలిగి ఉంది.
    • L1, L5, S బ్యాండ్ సిగ్నల్స్‌ను అందిస్తుంది.
    • భారత భూభాగంతో పాటు సరిహద్దుల చుట్టూ 1,500 కిలోమీటర్ల పరిధిలో నావిగేషన్ సేవలు అందించడం లక్ష్యం.
    • నాలుగు కక్ష్య మార్పుల (Orbit Manoeuvres) అనంతరం నిర్దేశిత కక్ష్యను చేరుకుంది.

గుర్తుంచుకోండి: NavIC అనేది భారతదేశ స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని పాత పేరు IRNSS (Indian Regional Navigation Satellite System).


ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల పథకం 2031 వరకు పొడిగింపు

కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల (Fast Track Special Courts – FTSCs) పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించడానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. అత్యాచారం, చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం (POCSO Act, 2012) కింద నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా మొత్తం 850 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాలను, అందులో ప్రత్యేకంగా 399 POCSO కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో 779 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు పనిచేస్తున్నాయి. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 4,02,457 కేసులను పరిష్కరించాయి. ఈ పథకానికి మొత్తం ₹3,788.04 కోట్ల ఆర్థిక కేటాయింపులు చేయగా, కేంద్ర ప్రభుత్వం ₹2,353.15 కోట్లు, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ₹1,434.89 కోట్లు భరిస్తాయి. ఈ పథకం ద్వారా పెండింగ్ కేసులను తగ్గించడం, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ముఖ్యమైన అంశాలు

  1. పథకం పొడిగింపు: ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల పథకాన్ని 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు ఐదేళ్లపాటు పొడిగించారు.
  2. ముఖ్యమైన గణాంకాలు:
    • మొత్తం లక్ష్యంగా ఏర్పాటు చేయనున్న కోర్టులు: 850.
    • ప్రత్యేక POCSO కోర్టులు: 399.
    • ఇప్పటికే పనిచేస్తున్న కోర్టులు: 779.
    • ఇప్పటివరకు పరిష్కరించిన కేసులు: 4,02,457.
    • మొత్తం ఆర్థిక కేటాయింపు: ₹3,788.04 కోట్లు.

ముఖ్యమైన గమనిక: POCSO Act పూర్తి పేరు – Protection of Children from Sexual Offences Act, 2012 (లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం, 2012).


వయో సమ్మాన్ రాష్ట్రీయ అభియాన్ ప్రారంభం (Vayo Samman Rashtriya Abhiyan)

కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ 2026 నవంబర్ 4న న్యూఢిల్లీలో వయో సమ్మాన్ రాష్ట్రీయ అభియాన్ (Vayo Samman Rashtriya Abhiyan)ను ప్రారంభించారు. వృద్ధులు మరియు యువత మధ్య పరస్పర అనుబంధం, గౌరవం, సహకారాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అటల్ వయో అభ్యుదయ యోజన (AVYAY) కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వృద్ధులకు సహాయం చేయడానికి Vayo SAATHI స్వచ్ఛంద సేవకుల కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. వృద్ధుల అనుభవాలు, జ్ఞానాన్ని యువతతో పంచుకోవడం, వారి ఆరోగ్యం, డిజిటల్ అక్షరాస్యత, సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశం.

ముఖ్యమైన అంశాలు:

  1. ప్రారంభించిన తేదీ: 4 నవంబర్ 2026.
  2. ముఖ్యమైన 5C సూత్రం:
    • Connect – అనుసంధానం
    • Converse – సంభాషణ
    • Co-create – కలిసి సృష్టించడం
    • Contribute – సహకారం అందించడం
    • Continue – కొనసాగించడం.

ముత్తుస్వామి దీక్షితార్ 250వ జయంతి సందర్భంగా ₹250 నాణెం విడుదల

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 నవంబర్ 3న ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు ముత్తుస్వామి దీక్షితార్ 250వ జయంతి సందర్భంగా ₹250 స్మారక నాణెం విడుదల చేశారు. వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (IIT-BHU) స్వతంత్రత భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నాణెం సాధారణ చెలామణి కోసం కాకుండా సేకరణ ప్రయోజనాల కోసం రూపొందించిన పరిమిత ఎడిషన్ నాణెం. దీని బరువు 35 గ్రాములు. ఇందులో 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ ఉన్నాయి. ఈ సందర్భంగా ముత్తుస్వామి దీక్షితార్ జీవిత చరిత్ర, సంగీత సేవలను వివరించే ‘అమర గురుగుహం పోట్రువాం’ అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.

ముఖ్యమైన అంశాలు:

  1. స్మారక నాణెం విడుదల చేసినవారు: నిర్మలా సీతారామన్.
  2. ముత్తుస్వామి దీక్షితార్ కర్ణాటక సంగీత త్రిమూర్తులలో (Carnatic Music Trinity) ఒకరు. మిగిలిన ఇద్దరు త్యాగరాజు, శ్యామశాస్త్రి.

తమిళనాడు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) విధానం – 2026

తమిళనాడు ప్రభుత్వం 2026 నవంబర్ 3న చెన్నైలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (Battery Energy Storage System – BESS) విధానం 2026ను ప్రకటించింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడం, విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, విద్యుత్ సరఫరాలో స్థిరత్వాన్ని మెరుగుపరచడం ఈ విధానం ప్రధాన లక్ష్యాలు. రాబోయే మూడు సంవత్సరాల్లో కనీసం 2.5 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యం, 10 గిగావాట్ అవర్ నిల్వ సామర్థ్యంతో బ్యాటరీ నిల్వ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే నిర్దిష్ట సౌర విద్యుత్ ప్రాజెక్టులకు వాటి స్థాపిత సామర్థ్యంలో కనీసం 10% బ్యాటరీ నిల్వ వ్యవస్థను తప్పనిసరి చేశారు. ఈ విధానం ద్వారా విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో నిల్వ చేసిన విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు.

ముఖ్యమైన అంశాలు:

  1. విధానం పేరు: Tamil Nadu Battery Energy Storage Systems Policy – 2026.
  2. మూడు సంవత్సరాల లక్ష్యం:
    • విద్యుత్ సామర్థ్యం: 2.5 GW.
    • విద్యుత్ నిల్వ సామర్థ్యం: 10 GWh.

గుర్తుంచుకోండి: GW (Gigawatt) అనేది విద్యుత్ శక్తి సామర్థ్యాన్ని, GWh (Gigawatt-hour) అనేది విద్యుత్ శక్తి నిల్వ పరిమాణాన్ని సూచిస్తాయి.


మణిపూర్‌లో తొలి నార్త్ ఈస్ట్ వారీ లీబా ఉత్సవం – 2026

మణిపూర్ రాష్ట్రంలో తొలి నార్త్ ఈస్ట్ వారీ లీబా ఉత్సవం (First North East Waree Leeba Festival 2026) ప్రారంభమైంది. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని ఇరోమ్ మెయిజ్రావో మామాంగ్ కమ్యూనిటీ హాల్‌లో ఐదు రోజులపాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రిపర్టరీ ఆఫ్ వారీ లీబా, ఖురాయ్ సంస్థ ఇరోమ్ మెయిజ్రావో మహిళా సాంస్కృతిక కేంద్రంతో కలిసి నిర్వహిస్తోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ఈశాన్య భారతదేశ సంప్రదాయ కళలు, సంస్కృతి, జానపద కథనాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉత్సవంలో మణిపూర్ నుంచి ఐదు బృందాలు, ఇతర ఈశాన్య రాష్ట్రాల నుంచి ఐదు బృందాలు సహా మొత్తం పది బృందాలు పాల్గొంటున్నాయి.

ముఖ్యమైన అంశాలు:

  1. ఉత్సవం నిర్వహిస్తున్న రాష్ట్రం: మణిపూర్. ప్రారంభించినవారు: గవర్నర్ అజయ్ కుమార్ భల్లా.
  2. వారీ లీబా (Waree Leeba): మణిపూర్‌కు చెందిన సంప్రదాయ మౌఖిక కథా ప్రదర్శన కళ. కథకులు తమ స్వరాలు, చేతి సంజ్ఞల ద్వారా కథలను ప్రేక్షకులకు వివరిస్తారు.

జాబ్ ప్రిపరేషన్ హబ్ – స్టడీ మెటీరీయల్ అప్డేట్
ఉద్యోగ వాహిని – know job notifications

Leave a Reply