ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

455 IB సెక్యూరిటీ అసిస్టెంట్ /మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల అయింది.

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) 455 పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 6, 2025న ప్రారంభమై సెప్టెంబర్ 28, 2025 వరకు కొనసాగుతోంది . 10 వ తరగతి చదివి LMV లైసెన్స్ కలిగిన 27 సంవత్సరాలు దాటని (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది) అర్హత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://www.mha.gov.in లేదా http://www.ncs.gov.in ద్వారా నిర్ణీత గడువు లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

⁜B సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటారు ట్రాన్స్పోర్టు) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం

సంస్థఇంటెలిజెన్స్ బ్యూరో (IB)/ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్
ఉద్యోగంసెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్పోర్ట్
మొత్తం ఖాళీలు 455
ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీలు 9
తెలంగాణలో ఖాళీలు 7
విద్యార్హతమెట్రిక్యులేషన్ మరియు మోటార్ కార్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్
అనుభవం ఒక సంవత్సరం
డిసైరబుల్ క్వాలిఫికేషన్మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్
అప్లై చెసుకోవలసిన స్థానండొమసైల్ సర్టిఫికెట్ (నివాసం పత్రం) ఉన్న రాష్ట్రంలోనే అప్లై చేసుకోవాలి
వయోపరిమితి28-09-2025 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
పరీక్షా విధానంటైర్ I(ఆబ్జెక్టివ్ టైప్ MCQ పద్దతి పరీక్ష) మరియు

టైర్II ( మోటార్ మెకానిసం, డ్రైవింగ్ టెస్ట్ మరియు ఇంటర్యూ)
పరీక్ష సెంటర్లు.ఆంధ్ర ప్రదేశ్ లో 11 మరియు తెలంగాణలో 5
ఉద్యోగ స్థానందెశంలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చెయ్యవచ్చు
ధరకాస్తు రుసుముUR, EWS, OBC పురుషులకు
రు. 650/-

మహిళలకు మరియు మిగిలిన కేటగిరీల వారికి రు. 550/-
అప్లై చేసుకునే విధానం ఆన్లైన్
అప్లై చెయ్యడానికి చివరి తేది. 28-09-2025 (23.59 వరకు)
ధరకాస్తు రుసుము చెల్లించడానికి ( ఆఫ్లైన్ బ్రాంచ్ సబ్మిషన్ కొరకు మాత్రమే) చివరి తేది 30-09-2025
అధికారిక వెబ్సైట్MHA వెబ్సైట్ http://www.mha.gov.in మరియు NCS పోర్టల్ http://www.ncs.gov.in
హెల్ప్ డెస్క్ నెం.00-61306283 (10 గం||నుండి 18 గం||వరకు-సోమవారం నుండి శనివారం వరకు)

ఉద్యోగం: సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్పోర్ట్)
మొత్తం ఖాళీలు: 455

అర్హత*విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.

*డ్రైవింగ్ లైసెన్స్: సంబంధిత అథారిటీ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే LMV (లైట్ మోటార్ వెహికల్) లైసెన్స్ కలిగి ఉండాలి.

*అనుభవం: LMV లైసెన్స్ పొందిన తర్వాత కనీసం 1 సంవత్సరం డ్రైవింగ్ అనుభవం.
నైపుణ్యాలు: మోటార్ మెకానిక్స్ యొక్క ప్రాథమిక జ్ఞానం మరియు చిన్న వాహన సమస్యలను నిర్వహించే సామర్థ్యం.

*నివాసం: దరఖాస్తు చేయదలచిన రాష్ట్రం యొక్క చెల్లుబాటు అయ్యే నివాస ధృవీకరణ పత్రం ఉండాలి.
ధరకాస్తు రుసుముUR,EWS,OBC పురుషులు రిక్రూట్మెంట్ ప్రొసెసింగ్ రుసుము రు. 550/-మరియు పరీక్ష ఫీజు రు.100/- (మొత్తం రు.650) చెల్లించాలి.

స్త్రీలు మరియు మిగిలిన కేటగిరీల వారికి రిక్రూట్మెంట్ ప్రొసెసింగ్ ఛార్జ్ రు.550/-చెల్లిస్తే సరిపోతుంది.
జీతం7 వ సిపిసి లో లెవెల్ 3 రు.21,700-69,100 మరియు సంబంధీత సెంట్రల్ గవర్నమెంట్ ఎలవెన్సులు
టైర్ I పరీక్ష సెంటర్లుఆంధ్ర ప్రదేశ్ లో అనంతపూర్, గుంటూరు,కడప, కాకినాడ
కర్నూలు, రాజమండ్రి,తిరుపతి, విజయవాడ ,విశాఖపట్నం మరియు విజయనగరం

తెలంగాణలో హైదరాబాద్, కరీమ్నగర్, ఖమ్మమ్, మహబూబ్నగర్, వరంగల్
పరీక్షా విధానంటైర్ I(ఆబ్జెక్టివ్ టైప్ MCQ పద్దతి పరీక్ష) మరియు

టైర్II ( మోటార్ మెకానిసం, డ్రైవింగ్ టెస్ట్ మరియు ఇంటర్యూ)
నెగెటివ్ మార్కింగ్ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు
👍ముఖ్యమైన తేదీలు👍అప్లై చెయ్యడానికి చివరి తేది. 28-09-2025 (23.59 వరకు)

👍ధరకాస్తు రుసుము చెల్లించడానికి ( ఆఫ్లైన్ బ్రాంచ్ సబ్మిషన్ కొరకు మాత్రమే) చివరి తేది 30-09-2025
వయోపరిమితి28-09-2025 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
(నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.)

⁜వయొ సడలింపు

కేటగిరిసడలింపు
SC/ST5 సంవత్సరాలు
OBC3 సంవత్సరాలు
కనీసం 3సంవత్సరాలు పనిచేసిన డిపార్ట్మెంటల్ కేండిడేట్లకు40 సంవత్సరాలు మించకుండా
వితంతువు మరియు విడాకులు తీసుకుని పునర్వివాహం చేసుకోని మహిళలకుUR -35 సంవత్సరాలు మించకుండా

OBC-38 సంవత్సరాలు మించకుండా

SC/ST-40 సంవత్సరాలు మించకుండా
ఎక్స్ సర్వీస్ మెన్సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం
నైపుణ్యం గల స్పోర్ట్స్ పెర్సన్లకు5 సంవత్సరాలు
😒సూచన
వికలాంగులు (PwBD కేండిడేటులు)అప్లై చెయ్యడానికి అనర్హులు

⁜టైర్I పరీక్ష విధానం⁜

సబ్జెక్టుప్రశ్నలుమార్కులు సమయము
జనరల్ అవేర్నెస్20
బేసిక్ ట్రాన్స్పోర్ట్/డ్రైవింగ్ రరూల్స్20
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్20
న్యూమరికల్ ఎబిలిటీ/లాజికల్ ఎబిలిటీ/అనలిటికల్ ఎబిలిటీ & రీజనింగ్20
ఇంగ్లీషు భాష20
మొత్తం1001001 గంట

Posted in

Leave a comment