📢 నంద్యాల జిల్లాలోని 6 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 03 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 67 అంగన్‌వాడీ ఆయాల పోస్టులు, మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పోస్టులకు సాధారణంగా 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థుల వయస్సు 01-07-2026 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా వివాహిత మహిళలు అయి ఉండడంతో పాటు సంబంధిత ప్రాంతానికి స్థానికులై ఉండాలి. అయితే యు.సి.యస్.టీ జనాభా ప్రాంతాల్లో 21 సంవత్సరాల వయస్సు నిండిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో, 18 సంవత్సరాల వయస్సు నిండిన అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తుతో పాటు పుట్టిన తేదీ/వయస్సు ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, విద్యార్హత ధృవపత్రాలు, నివాస ధృవీకరణ పత్రం తదితర అవసరమైన పత్రాలను సమర్పించాలి. వితంతువులు, దివ్యాంగులు తదితర ప్రత్యేక కేటగిరీల అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలను కూడా జతచేయాలి. దరఖాస్తులు 05-09-2026 నుంచి 18-09-2026 సాయంత్రం 5:00 గంటల వరకు సంబంధిత సీడీపీఓ కార్యాలయాల్లో సమర్పించాలి.
నంద్యాల జిల్లా అంగన్వాడీ ఉద్యోగాల రిక్రూట్మెంట్ అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసి చూడండి
ధరకాస్తు చెయ్యడానికి చివరి తేది :18-09-2026
🔹 ఖాళీల వివరాలు
| క్రమ సంఖ్య | ఉద్యోగం | మొత్తం ఖాళీలు |
|---|---|---|
| 1 | మొయినర్ అంగన్‌వాడీ కార్యకర్తలు (Main Anganwadi Workers) | 03 |
| 2 | అంగన్‌వాడీ ఆయాలు (Anganwadi Helpers) | 67 |
| మొత్తం | 70 |
🔹 ఉద్యోగాల వారీగా అర్హతలు
| అంశం | మొయినర్ అంగన్‌వాడీ కార్యకర్తలు | అంగన్‌వాడీ ఆయాలు |
|---|---|---|
| విద్యార్హత | అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి | అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఒకవేళ 10వ తరగతి ఉత్తీర్ణత లేని పక్షంలో 7వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి |
| వయస్సు | 01-07-2026 నాటికి 21–35 సంవత్సరాలు | 01-07-2026 నాటికి 21–35 సంవత్సరాలు |
| వివాహ స్థితి | తప్పనిసరిగా వివాహిత మహిళ అయి ఉండాలి | తప్పనిసరిగా వివాహిత మహిళ అయి ఉండాలి |
| స్థానికత | సంబంధిత గ్రామం/ప్రాంతానికి చెందిన స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత | సంబంధిత గ్రామం/ప్రాంతానికి చెందిన స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత |
| ప్రత్యేక నిబంధన | యు.సి.యస్.టీ జనాభా ప్రాంతాల్లో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. | యు.సి.యస్.టీ జనాభా ప్రాంతాల్లో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు |
🔹 జతపరచాల్సిన ధృవపత్రాలు
| క్రమ సంఖ్య | ధృవపత్రం |
|---|---|
| 1 | పుట్టిన తేదీ / వయస్సు ధృవీకరణ పత్రం |
| 2 | కుల ధృవీకరణ పత్రం |
| 3 | విద్యార్హత ధృవపత్రాలు – యు.పి./హైస్కూల్ మార్కుల జాబితా, టి.సి. మరియు యు.యు.సి. లోపు ఎక్కువ తరగతి చదివిన మార్కుల లిస్ట్ |
| 4 | నివాస స్థల ధృవీకరణ పత్రం |
| 5 | వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం మరియు 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లు ధృవీకరణ పత్రం |
| 6 | వికలాంగులు అయితే పి.హెచ్. సర్టిఫికేట్ |
| 7 | వితంతువు అయితే 8వ తరగతి మార్కుల కార్డు మరియు (9) రేషన్ కార్డు |
📅 ముఖ్యమైన తేదీలు
| అంశం | తేదీ / సమయం |
|---|---|
| నోటిఫికేషన్ తేదీ | 02-09-2026 |
| దరఖాస్తులు/ధృవపత్రాల సమర్పణ ప్రారంభం | 05-09-2026 |
| సమర్పణ సమయం | ఉదయం 10:30 గంటల నుండి |
| చివరి తేదీ | 18-09-2026 |
| చివరి సమయం | సాయంత్రం 5:00 గంటల వరకు |
📍 దరఖాస్తులు ఎక్కడ సమర్పించాలి?
దరఖాస్తులను సంబంధిత CDPO (Child Development Project Officer) కార్యాలయాలకు నిర్ణీత గడువులో సమర్పించాలి.
గమనిక: ఈ నోటిఫికేషన్ నంద్యాల జిల్లాలోని 6 CDPO ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పోస్టుల భర్తీకి సంబంధించినది. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, స్థానికత మరియు ధృవపత్రాల నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించి దరఖాస్తు చేయాలి.

Leave a Reply