| APPSC ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2026 |
|---|
| ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), విజయవాడ నోటిఫికేషన్ నం. 17/2026 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (Forest Section Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, వ్యవసాయం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, గణితశాస్త్రం, గణాంకశాస్త్రం, భూగర్భశాస్త్రం లేదా నిర్దేశించిన కెమికల్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 01-07-2026 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి (నిబంధనల ప్రకారం వయో సడలింపు వరహిస్తుంది) . అర్హత కలిగిన అభ్యర్థులు 16-10-2026 నుంచి 05-11-2026 రాత్రి 11:59 గంటలలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . ఉద్యోగానికి సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, శారీరక ప్రమాణాలు, పరీక్ష విధానం మరియు ఇతర నిబంధనలను పూర్తిగా APPSC అధికారిక వెబ్సైట్పలో పరిశీలించిన తర్వాత దరఖాస్తు చేయాలి. |
APPSC ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2026 – ముఖ్యాంశాలు
| క్రమ సంఖ్య | అంశం | వివరాలు |
|---|---|---|
| 1 | నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) |
| 2 | నోటిఫికేషన్ నంబర్ | 17/2026 |
| 3 | ఉద్యోగం పేరు | ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ |
| 4 | మొత్తం ఖాళీలు | 26 పోస్టులు |
| 5 | విద్యార్హత | నిర్దేశించిన సైన్స్, ఫారెస్ట్రీ, వ్యవసాయం లేదా సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ |
| 6 | కనీస వయస్సు | 18 సంవత్సరాలు |
| 7 | గరిష్ఠ వయస్సు | 30 సంవత్సరాలు |
| 8 | వయోసడలింపు | SC/ST/BC/EWS వర్గాలకు 5 సంవత్సరాలు; ఇతరులకు నిబంధనల ప్రకారం |
| 9 | పురుషుల శారీరక అర్హత | ఎత్తు 163 సెం.మీ.; ఛాతీ 84 సెం.మీ.; విస్తరణ 5 సెం.మీ. |
| 10 | మహిళల శారీరక అర్హత | ఎత్తు 150 సెం.మీ.; ఛాతీ 79 సెం.మీ.; విస్తరణ 5 సెం.మీ. |
| 11 | పురుషుల నడక పరీక్ష | 25 కి.మీ. – 4 గంటల్లో |
| 12 | మహిళల నడక పరీక్ష | 16 కి.మీ. – 4 గంటల్లో |
| 13 | దరఖాస్తు ఫీజు | ₹250 ప్రాసెసింగ్ ఫీజు + ₹80 పరీక్ష ఫీజు = ₹330 |
| 14 | పరీక్ష ఫీజు మినహాయింపు | అర్హులైన నిర్దిష్ట వర్గాలకు ₹80 పరీక్ష ఫీజు మినహాయింపు |
| 15 | రిజర్వేషన్ విధానం | జిల్లా క్యాడర్; నోటిఫికేషన్ ప్రకారం 95% స్థానిక రిజర్వేషన్ |
| 16 | పరీక్ష విధానం | కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ రాత పరీక్ష |
| 17 | అర్హత పరీక్ష | జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు – మొత్తం 100 మార్కులు |
| 18 | పేపర్-I | జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 మార్కులు |
| 19 | పేపర్-II | గణితశాస్త్రం (SSC స్థాయి) – 150 మార్కులు |
| 20 | పేపర్-III | జనరల్ ఫారెస్ట్రీ – 150 మార్కులు |
| 21 | ప్రధాన పరీక్ష మొత్తం మార్కులు | 450 మార్కులు |
| 22 | నెగెటివ్ మార్కింగ్ | ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కుల కోత |
| 23 | దరఖాస్తుల ప్రారంభ తేదీ | 16-10-2026 |
| 24 | దరఖాస్తులకు చివరి తేదీ | 05-11-2026, రాత్రి 11:59 గంటల వరకు |
| 25 | అధికారిక వెబ్సైట్ | APPSC అధికారిక వెబ్సైట్ |
మొత్తం ఖాళీల వివరాలు
| ఉద్యోగం పేరు | శాఖ | మొత్తం పోస్టులు |
|---|---|---|
| ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ | ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ | 26 |
జిల్లా వారీగా ఓపెన్, లోకల్ మరియు మొత్తం పోస్టుల వివరాలు
| క్రమ సంఖ్య | జిల్లా పేరు | ఓపెన్ పోస్టులు (Open) | లోకల్ పోస్టులు (Local) | మొత్తం పోస్టులు |
|---|---|---|---|---|
| 1 | శ్రీకాకుళం | 0 | 1 | 1 |
| 2 | విజయనగరం | 0 | 1 | 1 |
| 3 | విశాఖపట్నం | 0 | 1 | 1 |
| 4 | కాకినాడ | 0 | 1 | 1 |
| 5 | తూర్పు గోదావరి | 1 | 1 | 2 |
| 6 | ఏలూరు | 1 | 3 | 4 |
| 7 | ఎన్టీఆర్ జిల్లా | 1 | 1 | 2 |
| 8 | పల్నాడు | 1 | 1 | 2 |
| 9 | ప్రకాశం | 1 | 1 | 2 |
| 10 | ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు | 0 | 1 | 1 |
| 11 | తిరుపతి | 0 | 1 | 1 |
| 12 | అన్నమయ్య | 1 | 1 | 2 |
| 13 | వైఎస్ఆర్ కడప | 1 | 1 | 2 |
| 14 | కర్నూలు | 1 | 1 | 2 |
| 15 | శ్రీ సత్యసాయి | 0 | 1 | 1 |
| 16 | చిత్తూరు | 0 | 1 | 1 |
| మొత్తం | 16 జిల్లాలు | 8 | 18 | 26 |
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు
| ముఖ్యమైన అంశం | తేదీ |
|---|---|
| నోటిఫికేషన్ విడుదల | 16-10-2026 |
| ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం | 16-10-2026 |
| ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 05-11-2026 |
| దరఖాస్తుల ముగింపు సమయం | రాత్రి 11:59 గంటలు |
విద్యార్హతలు (Educational Qualifications)
APPSC ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి నిర్దేశించిన విద్యార్హతను కలిగి ఉండాలి.
| క్రమ సంఖ్య | ఉద్యోగం పేరు | అవసరమైన విద్యార్హతలు |
|---|---|---|
| 1 | ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (Forest Section Officer) | కింది విభాగాల్లో ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. |
| 2 | సైన్స్ విభాగాలు | వృక్షశాస్త్రం (Botany), జంతుశాస్త్రం (Zoology), భౌతికశాస్త్రం (Physics), రసాయనశాస్త్రం (Chemistry), గణితశాస్త్రం (Mathematics), గణాంకశాస్త్రం (Statistics), భూగర్భశాస్త్రం (Geology). |
| 3 | ఇతర విభాగాలు | ఫారెస్ట్రీ (Forestry), హార్టికల్చర్ (Horticulture), వ్యవసాయం (Agriculture). |
| 4 | ఇంజినీరింగ్ విభాగాలు | కెమికల్ ఇంజినీరింగ్ (Chemical Engineering), మెకానికల్ ఇంజినీరింగ్ (Mechanical Engineering), సివిల్ ఇంజినీరింగ్ (Civil Engineering). |
ముఖ్య గమనికలు:
- డిగ్రీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పొంది ఉండాలి.
- కేంద్ర చట్టం, రాష్ట్ర చట్టం లేదా ప్రావిన్షియల్ చట్టం ద్వారా స్థాపించబడిన లేదా గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదివి ఉండాలి.
- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తింపు పొందిన సంస్థ నుంచి అర్హత పొంది ఉండాలి లేదా నోటిఫికేషన్లో పేర్కొన్న సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.
- నిర్దేశించిన విద్యార్హతకు సమానమైన అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతులను గడువులోగా కమిషన్‌కు సమర్పించాలి. లేకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
శారీరక ప్రమాణాలు (Physical Requirements)
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థులు కింది శారీరక ప్రమాణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.
పురుష అభ్యర్థులకు శారీరక ప్రమాణాలు
| క్రమ సంఖ్య | శారీరక ప్రమాణం | అవసరమైన కనీస అర్హత |
|---|---|---|
| 1 | ఎత్తు (Height) | 163 సెం.మీ. |
| 2 | ఛాతీ చుట్టుకొలత (Chest Measurement) | పూర్తిగా శ్వాస తీసుకున్నప్పుడు 84 సెం.మీ. |
| 3 | ఛాతీ విస్తరణ (Chest Expansion) | కనీసం 5 సెం.మీ. |
మహిళా అభ్యర్థులకు శారీరక ప్రమాణాలు
| క్రమ సంఖ్య | శారీరక ప్రమాణం | అవసరమైన కనీస అర్హత |
|---|---|---|
| 1 | ఎత్తు (Height) | 150 సెం.మీ. |
| 2 | ఛాతీ చుట్టుకొలత (Chest Measurement) | పూర్తిగా శ్వాస తీసుకున్నప్పుడు 79 సెం.మీ. |
| 3 | ఛాతీ విస్తరణ (Chest Expansion) | కనీసం 5 సెం.మీ. |
ప్రత్యేక వర్గాలకు ఎత్తులో సడలింపు
కింది వర్గాలకు చెందిన అభ్యర్థులకు కనీస ఎత్తులో 5 సెం.మీ. సడలింపు వర్తిస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
| క్రమ సంఖ్య | అభ్యర్థుల వర్గం | ఎత్తులో సడలింపు |
|---|---|---|
| 1 | గూర్ఖాలు (Gurkhas) | 5 సెం.మీ. |
| 2 | నేపాలీలు (Nepalese) | 5 సెం.మీ. |
| 3 | అస్సామీలు (Assamese) | 5 సెం.మీ. |
| 4 | నాగా తెగలు (Naga) | 5 సెం.మీ. |
| 5 | మణిపూర్‌కు చెందిన సంబంధిత వర్గాలు | 5 సెం.మీ. |
| 6 | గౌహతి ప్రాంతానికి చెందిన సంబంధిత వర్గాలు | 5 సెం.మీ. |
| 7 | కుమావున్ ప్రాంతానికి చెందిన సంబంధిత వర్గాలు | 5 సెం.మీ. |
| 8 | సిక్కిమీలు (Sikkimese) | 5 సెం.మీ. |
| 9 | భూటానీలు (Bhutanese) | 5 సెం.మీ. |
| 10 | షెడ్యూల్డ్ తెగలు (Scheduled Tribes) | నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం |
షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు ప్రత్యేక నిబంధన: అవసరమైన శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు తగినంత సంఖ్యలో అందుబాటులో లేకపోవడం వల్ల రిజర్వు కోటాను పూర్తిగా భర్తీ చేయలేని సందర్భంలో, నోటిఫికేషన్ ప్రకారం కనీస ఎత్తు 158 సెం.మీ.గా, ఛాతీ చుట్టుకొలత కనీసం 78.8 సెం.మీ.గా, ఛాతీ విస్తరణ కనీసం 5 సెం.మీ.గా ఉండాలి.
కంటి చూపు
| అంశం | నిబంధన |
|---|---|
| కంటి చూపు | అభ్యర్థికి సాధారణ కంటి చూపు ఉండాలి. |
| వర్తింపు | పైన పేర్కొన్న శారీరక ప్రమాణాలతో పాటు కంటి చూపు నిబంధనలను కూడా పాటించాలి. |
నడక పరీక్ష (Walking Test)
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలో భాగంగా నడక పరీక్ష నిర్వహిస్తారు.
| క్రమ సంఖ్య | అభ్యర్థుల వర్గం | నడవాల్సిన దూరం | పూర్తి చేయాల్సిన సమయం |
|---|---|---|---|
| 1 | పురుష అభ్యర్థులు | 25 కి.మీ. | 4 గంటలు |
| 2 | మహిళా అభ్యర్థులు | 16 కి.మీ. | 4 గంటలు |
నడక పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు:
- నడక పరీక్ష కేవలం శారీరక సామర్థ్య పరీక్ష మాత్రమే.
- ఈ పరీక్షకు ఎటువంటి మార్కులు కేటాయించరు.
- ఇది అర్హత సాధించడానికి నిర్వహించే పరీక్ష (Qualifying Test).
- నోటిఫికేషన్ ప్రకారం రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో శారీరక పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- శారీరక పరీక్ష, నడక పరీక్షలను సంబంధిత అధికారుల సమక్షంలో నిర్వహిస్తారు.
NCC సర్టిఫికెట్లకు బోనస్ మార్కులు
అవసరమైన అర్హతలు కలిగి, శారీరక ప్రమాణాలు సాధించిన అభ్యర్థులకు NCC సర్టిఫికెట్ ఆధారంగా బోనస్ మార్కులు కేటాయిస్తారు.
| క్రమ సంఖ్య | NCC సర్టిఫికెట్ | బోనస్ మార్కులు |
|---|---|---|
| 1 | NCC ‘C’ సర్టిఫికెట్ | 5 మార్కులు |
| 2 | NCC ‘B’ సర్టిఫికెట్ | 3 మార్కులు |
| 3 | NCC ‘A’ సర్టిఫికెట్ | 1 మార్కు |
తుది ఎంపిక విధానం: రాత పరీక్ష, శారీరక పరీక్ష (నడక పరీక్ష), వైద్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి రాత పరీక్షలో పొందిన మార్కులు, వర్తించే బోనస్ మార్కులు మరియు రిజర్వేషన్ రోస్టర్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని తుది ఎంపిక చేస్తారు.
వయోపరిమితి (Age Limit)
నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థుల వయస్సును 01-07-2026 నాటికి లెక్కిస్తారు.
| క్రమ సంఖ్య | అంశం | వయస్సు |
|---|---|---|
| 1 | కనీస వయస్సు | 18 సంవత్సరాలు |
| 2 | గరిష్ఠ వయస్సు | 30 సంవత్సరాలు |
| 3 | వయస్సు లెక్కించే తేదీ | 01-07-2026 |
వయోపరిమితిలో సడలింపులు (Age Relaxation)
| క్రమ సంఖ్య | అభ్యర్థుల వర్గం | వయోపరిమితిలో సడలింపు |
|---|---|---|
| 1 | ఎస్సీ (SC) | 5 సంవత్సరాలు |
| 2 | ఎస్టీ (ST) | 5 సంవత్సరాలు |
| 3 | బీసీ (BC) | 5 సంవత్సరాలు |
| 4 | ఈడబ్ల్యూఎస్ (EWS) | 5 సంవత్సరాలు |
| 5 | మాజీ సైనికులు (Ex-Servicemen) | సాయుధ దళాల్లో పనిచేసిన కాలంతో పాటు నిబంధనల ప్రకారం మినహాయింపు |
| 6 | NCCలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసిన అభ్యర్థులు | నిబంధనల ప్రకారం సడలింపు |
| 7 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు | గరిష్ఠంగా 5 సంవత్సరాల వరకు, అర్హమైన సాధారణ సర్వీసు కాలం మేరకు |
| 8 | రాష్ట్ర జనగణన విభాగంలో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులు | కనీసం 6 నెలల సర్వీసు ఉంటే 3 సంవత్సరాలు |
దరఖాస్తు ఫీజు మరియు పరీక్ష ఫీజు
APPSC ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది ఫీజులను చెల్లించాలి.
| క్రమ సంఖ్య | ఫీజు వివరాలు | చెల్లించాల్సిన మొత్తం |
|---|---|---|
| 1 | దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు (Application Processing Fee) | ₹250 |
| 2 | పరీక్ష ఫీజు (Examination Fee) | ₹80 |
| 3 | మొత్తం ఫీజు | ₹330 |
పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు పొందే అభ్యర్థులు
కింది వర్గాలకు చెందిన అభ్యర్థులకు ₹80 పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే, ₹250 దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
| క్రమ సంఖ్య | అభ్యర్థుల వర్గం | పరీక్ష ఫీజు మినహాయింపు |
|---|---|---|
| 1 | ఎస్సీ (SC) | ₹80 మినహాయింపు |
| 2 | ఎస్టీ (ST) | ₹80 మినహాయింపు |
| 3 | బీసీ (BC) | ₹80 మినహాయింపు |
| 4 | మాజీ సైనికులు (Ex-Servicemen) | ₹80 మినహాయింపు |
| 5 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన, పౌరసరఫరాల శాఖ జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు (Household Supply White Card) కలిగిన కుటుంబాలు | ₹80 మినహాయింపు |
| 6 | నిరుద్యోగ యువత | సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హత ఉంటే ₹80 మినహాయింపు |
నిరుద్యోగ యువతకు ముఖ్యమైన సూచన: G.O. Ms. No. 439, G.A. (Ser-A) Department, తేదీ 18-10-1996 ప్రకారం నిరుద్యోగ యువత తగిన సమయంలో కమిషన్‌కు ప్రకటన (Declaration) సమర్పించాలి.
. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ఫీజు వివరాలు
| అభ్యర్థుల వర్గం | ప్రాసెసింగ్ ఫీజు | పరీక్ష ఫీజు | మొత్తం |
|---|---|---|---|
| ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు | ₹250 | ₹80 | ₹330 |
ఫీజు చెల్లింపు విధానం (Mode of Payment)
| క్రమ సంఖ్య | అంశం | వివరాలు |
|---|---|---|
| 1 | చెల్లింపు విధానం | ఆన్లైన్ ద్వారా |
| 2 | నెట్ బ్యాంకింగ్ | అందుబాటులో ఉన్న బ్యాంకుల ద్వారా |
| 3 | క్రెడిట్ కార్డు | ఉపయోగించవచ్చు |
| 4 | డెబిట్ కార్డు | ఉపయోగించవచ్చు |
| 5 | IPO (Indian Postal Order) | అనుమతించబడదు |
| 6 | డిమాండ్ డ్రాఫ్ట్ (Demand Draft) | అనుమతించబడదు |
| 7 | ఫీజు వాపసు | చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు |
ఫీజు చెల్లింపులో ముఖ్యమైన నిబంధనలు
- అభ్యర్థులు ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా ఫీజు చెల్లించాలి.
- నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు.
- ఫీజు వివరాల సంక్షిప్త పట్టిక
అధికారిక వెబ్సైట్: APPSC అధికారిక వెబ్సైట్
జీతభత్యాల వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు వర్తించే పే స్కేల్:
₹32,670 – ₹1,01,970
ఇతర అలవెన్సులు, సర్వీస్ నిబంధనలు మరియు ప్రయోజనాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వర్తిస్తాయి
పరీక్ష విధానం వివరాలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించిన మెయిన్ రాత పరీక్ష విధానం, ప్రశ్నల సంఖ్య, పరీక్ష సమయం, మార్కులు మరియు ఇతర ముఖ్యమైన వివరాలను కింది పట్టికలలో అందించాము.
మెయిన్ రాత పరీక్ష విధానం (Scheme of Examination)
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ (Objective Type)
ప్రశ్నల స్థాయి: డిగ్రీ స్థాయి (Degree Standard)
| క్రమ సంఖ్య | పేపర్ | సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | పరీక్ష సమయం (నిమిషాలు) | గరిష్ఠ మార్కులు |
|---|---|---|---|---|---|
| 1 | అర్హత పరీక్ష (Qualifying Test) | జనరల్ ఇంగ్లీష్ – 50 మార్కులు, జనరల్ తెలుగు – 50 మార్కులు | 100 | 100 | 100 |
| 2 | పేపర్-I | జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ | 150 | 150 | 150 |
| 3 | పేపర్-II | గణితశాస్త్రం (SSC స్థాయి) | 150 | 150 | 150 |
| 4 | పేపర్-III | జనరల్ ఫారెస్ట్రీ | 150 | 150 | 150 |
| మొత్తం మెయిన్ పరీక్ష మార్కులు | 450 |
ముఖ్యమైన గమనికలు:
- జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు పరీక్షల్లో విడివిడిగా అర్హత సాధించాలి.
- ఇంగ్లీష్, తెలుగు పరీక్షల స్థాయి SSC (10వ తరగతి) ప్రమాణంలో ఉంటుంది.
- అర్హత పరీక్షలో మొత్తం 100 మార్కులు ఉన్నప్పటికీ, మెయిన్ పరీక్షలోని ప్రధాన పేపర్ల మార్కుల మొత్తం 450.
- పేపర్-I, పేపర్-II, పేపర్-III ఒక్కొక్కటి 150 మార్కులకు నిర్వహిస్తారు.
నెగెటివ్ మార్కుల విధానం (Negative Marking)
| అంశం | వివరాలు |
|---|---|
| నెగెటివ్ మార్కుల విధానం | తప్పు సమాధానాలకు మార్కులు తగ్గిస్తారు. |
| తప్పు సమాధానానికి కోత | ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/3 వంతు |
| ప్రభుత్వ ఉత్తర్వుల వివరాలు | G.O. Ms. No. 235, Finance (HR-I, Plg & Policy) Department, తేదీ 06-12-2016 |
ఉదాహరణ: ఒక ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తే, తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.
. పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు
| క్రమ సంఖ్య | అంశం | వివరాలు |
|---|---|---|
| 1 | నడక పరీక్ష | అభ్యర్థులు నడక పరీక్షలో తప్పనిసరిగా పాల్గొనాలి. |
| 2 | వైద్య పరీక్ష | మెడికల్ బోర్డు నిర్వహించే వైద్య పరీక్షకు హాజరుకావాలి. |
| 3 | పరీక్షల నిర్వహణ | అటవీ శాఖ, APPSC సమన్వయంతో నడక పరీక్ష, వైద్య పరీక్షలను నిర్వహిస్తాయి. |
| 4 | షార్ట్‌లిస్టింగ్ | మొత్తం ఖాళీల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. |
| 5 | అన్ని పేపర్లకు హాజరు | అన్ని పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి. |
| 6 | గైర్హాజరు | ఏదైనా పేపర్‌కు లేదా అన్ని పేపర్లకు హాజరుకాకపోతే అభ్యర్థిత్వం చెల్లదు. |
అధికారిక వెబ్సైట్: APPSC అధికారిక వెబ్సైట్
స్థానిక రిజర్వేషన్ – ముఖ్యమైన వివరాలు
| అంశం | వివరాలు |
|---|---|
| ఉద్యోగాల క్యాడర్ | జిల్లా క్యాడర్ |
| స్థానిక రిజర్వేషన్ | 95% |
| వర్తించే జిల్లాలు | 26 జిల్లాలు |
| రిజర్వేషన్ ఆధారం | ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 |
| అభ్యర్థులకు సూచన | స్థానిక అభ్యర్థి అర్హతను నిర్ణయించే నిబంధనలను పూర్తి నోటిఫికేషన్లో పరిశీలించాలి |
అధికారిక వెబ్సైట్: APPSC అధికారిక వెబ్సైట్
రాత పరీక్ష నిర్వహించే కేంద్రాలు – 13 ఉమ్మడి జిల్లాల జాబితా
| క్రమ సంఖ్య | ఉమ్మడి జిల్లా పేరు (తెలుగులో) | జిల్లా పేరు (English) |
|---|---|---|
| 1 | శ్రీకాకుళం | Srikakulam |
| 2 | విజయనగరం | Vizianagaram |
| 3 | విశాఖపట్నం | Visakhapatnam |
| 4 | తూర్పు గోదావరి | East Godavari |
| 5 | పశ్చిమ గోదావరి | West Godavari |
| 6 | కృష్ణా | Krishna |
| 7 | గుంటూరు | Guntur |
| 8 | ప్రకాశం | Prakasam |
| 9 | నెల్లూరు | Nellore |
| 10 | చిత్తూరు | Chittoor |
| 11 | కడప | Kadapa |
| 12 | కర్నూలు | Kurnool |
| 13 | అనంతపురం | Anantapuramu |
ఆన్లైన్ దరఖాస్తు విధానం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది దశలను అనుసరించాలి.
1. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
| దశ | ప్రక్రియ | వివరాలు |
|---|---|---|
| STEP–I | OTPR నమోదు | అభ్యర్థి మొదటిసారి దరఖాస్తు చేస్తున్నట్లయితే, APPSC వెబ్సైట్లో OTPR (One Time Profile Registration) నమోదు చేసి OTPR ID పొందాలి. |
| STEP–II | లాగిన్ | OTPR ID (యూజర్ నేమ్), పాస్‌వర్డ్‌తో అధికారిక వెబ్సైట్లో లాగిన్ కావాలి. |
| STEP–III | నోటిఫికేషన్ ఎంపిక | వెబ్‌సైట్‌లోని “Online Application Submission” విభాగంలోకి వెళ్లి, నోటిఫికేషన్ నంబర్ 17/2026కు ఎదురుగా ఉన్న “Fill Application” బటన్‌పై క్లిక్ చేయాలి. |
| STEP–IV | వివరాల నమోదు | విద్యార్హతలు, స్థానిక/స్థానికేతర స్థితి, వైట్ రేషన్ కార్డు వివరాలు, పరీక్ష కేంద్రం ఎంపిక తదితర వివరాలను నమోదు చేయాలి. |
| STEP–V | వివరాల పరిశీలన | నమోదు చేసిన వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. అవసరమైతే OTPR వివరాలను సవరించాలి. |
| STEP–VI | దరఖాస్తు సమర్పణ | ముందుగా “Save” బటన్‌పై క్లిక్ చేసి, ఆ తర్వాత “Save & Submit” బటన్‌పై క్లిక్ చేయాలి. |
| STEP–VII | ఫీజు చెల్లింపు | “Save & Submit” చేసిన తర్వాత వచ్చే పేమెంట్ గేట్‌వే ద్వారా వర్తించే దరఖాస్తు ఫీజు చెల్లించాలి. |
| STEP–VIII | దరఖాస్తు నిర్ధారణ | ఫీజు విజయవంతంగా చెల్లించి దరఖాస్తు సమర్పించిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ID పొందాలి. సమర్పించిన దరఖాస్తు PDFను డౌన్లోడ్ చేసుకోవాలి. |
అధికారిక వెబ్సైట్: APPSC అధికారిక వెబ్సైట్
2. OTPR నమోదు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
| క్రమ సంఖ్య | అంశం | సూచనలు |
|---|---|---|
| 1 | కొత్త అభ్యర్థులు | మొదటిసారి దరఖాస్తు చేసుకునేవారు OTPR నమోదు పూర్తి చేయాలి. |
| 2 | OTPR ID | నమోదు పూర్తయిన తర్వాత వచ్చిన OTPR IDను భద్రపరచుకోవాలి. |
| 3 | వ్యక్తిగత వివరాలు | పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు తదితర వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. |
| 4 | తప్పుల సవరణ | అవసరమైతే “Modify OTPR” ద్వారా వివరాలను సవరించి సేవ్ చేయాలి. |
| 5 | బాధ్యత | అభ్యర్థి నమోదు చేసిన తప్పు వివరాలకు కమిషన్ బాధ్యత వహించదు. |
3. దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రక్రియ (Payment Process)
| క్రమ సంఖ్య | అంశం | వివరాలు |
|---|---|---|
| 1 | వివరాల పరిశీలన | OTPR నుంచి పొందుపరిచిన వ్యక్తిగత వివరాలను తనిఖీ చేయాలి. |
| 2 | ఫీజు లెక్కింపు | దరఖాస్తు ఫీజు, వయోసడలింపు తదితర వివరాలు OTPR సమాచారం ఆధారంగా ముందుగానే లెక్కించబడతాయి. |
| 3 | ఫీజు చెల్లింపు | అందుబాటులో ఉన్న ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలి. |
| 4 | పేమెంట్ రిఫరెన్స్ ID | విజయవంతమైన చెల్లింపు తర్వాత రిఫరెన్స్ ID రూపొందించబడుతుంది. |
| 5 | SMS సమాచారం | నమోదైన మొబైల్ నంబర్‌కు SMS అలర్ట్ పంపబడుతుంది. |
| 6 | దరఖాస్తు PDF | పూర్తి చేసిన దరఖాస్తును PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. |
| 7 | చెల్లింపు విఫలమైతే | పేమెంట్ విఫలమైతే, సూచించిన విధంగా మళ్లీ పేమెంట్ ప్రక్రియ ప్రారంభించాలి. |
ముఖ్యమైన సూచన: దరఖాస్తు ఫీజు చెల్లించే ముందు పేరు, వయస్సు, విద్యార్హతలు, ఫీజు మినహాయింపులకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఫీజు చెల్లించిన తర్వాత ఈ వివరాలు మార్చడం సాధ్యం కాకపోవచ్చు.
4. దరఖాస్తు సవరణలకు సంబంధించిన నిబంధనలు
నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం, దరఖాస్తుల సవరణకు కొన్ని పరిమితులు ఉన్నాయి.
| క్రమ సంఖ్య | అంశం | నిబంధన |
|---|---|---|
| 1 | సవరణల కాలపరిమితి | దరఖాస్తుల చివరి తేదీ తర్వాత గరిష్ఠంగా 7 రోజుల వరకు, నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా సవరణలు చేసుకోవచ్చు. |
| 2 | సవరణ ఫీజు | ప్రతి సవరణకు ₹100 చెల్లించాలి. |
| 3 | పేరు మార్పు | పేరు సంబంధిత వివరాల్లో సవరణకు అనుమతి లేదు. |
| 4 | ఫీజు మార్పు | ఫీజుకు సంబంధించిన వివరాల్లో సవరణకు అనుమతి లేదు. |
| 5 | వయోసడలింపు | వయోసడలింపును ప్రభావితం చేసే వివరాల్లో సవరణకు అనుమతి లేదు. |
| 6 | రిజర్వేషన్ వర్గం | కమ్యూనిటీ/రిజర్వేషన్ వర్గాన్ని మార్చడానికి అనుమతి ఉండదు. |
| 7 | మాన్యువల్ దరఖాస్తులు | దరఖాస్తు సవరణల కోసం మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించరు. |
గమనిక: ఏయే వివరాలను సవరించవచ్చో, సవరణ విండో ఎప్పుడు అందుబాటులో ఉంటుందో పూర్తి అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
5. అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు
| క్రమ సంఖ్య | సూచన | వివరాలు |
|---|---|---|
| 1 | “Save” బటన్ | దరఖాస్తు వివరాలను తాత్కాలికంగా సేవ్ చేస్తుంది. |
| 2 | “Save & Submit” బటన్ | దరఖాస్తును సమర్పించే ప్రక్రియలో తప్పనిసరి దశ. |
| 3 | ఫీజు చెల్లింపు | విజయవంతమైన ఫీజు చెల్లింపు తర్వాతే దరఖాస్తు సమర్పణ పూర్తవుతుంది. |
| 4 | సరైన సమాచారం | అన్ని వివరాలను సరిగ్గా నమోదు చేయాలి. |
| 5 | ఖాళీ ఫీల్డులు | వర్తించే ఏ కాలమ్‌నూ ఖాళీగా వదలకూడదు. |
| 6 | పత్రాల పరిశీలన | అర్హతకు సంబంధించిన వివరాలు, పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. |
| 7 | దరఖాస్తు PDF | భవిష్యత్తు అవసరాల కోసం డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవాలి. |
| 8 | తప్పుడు సమాచారం | తప్పు లేదా అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. |
6. దరఖాస్తు సమర్పణకు ముందు చెక్‌లిస్ట్
- OTPR నమోదు పూర్తి చేశాను.
- OTPR ID, పాస్వర్డ్ భద్రపరచుకున్నాను.
- వ్యక్తిగత వివరాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్నాను.
- విద్యార్హతల వివరాలు సరిగ్గా నమోదు చేశాను.
- స్థానిక/స్థానికేతర వివరాలు తనిఖీ చేశాను.
- అవసరమైన ఇతర వివరాలు నమోదు చేశాను.
- పరీక్ష కేంద్రం ఎంపికను పరిశీలించాను.
- వర్తించే ఫీజు చెల్లించాను.
- “Save & Submit” ప్రక్రియ పూర్తి చేశాను.
- పేమెంట్ రిఫరెన్స్ ID, దరఖాస్తు PDF భద్రపరచుకున్నాను.
చివరి సూచన: దరఖాస్తు వివరాలను కేవలం సేవ్ చేయడం సరిపోదు. “Save & Submit” బటన్‌పై క్లిక్ చేసి, వర్తించే ఫీజును విజయవంతంగా చెల్లించి, దరఖాస్తు సమర్పణ పూర్తయిందని నిర్ధారించుకోవాలి.
అధికారిక వెబ్సైట్: APPSC
| AP ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అధికారిక నోటిఫికేషన్ | AP ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అధికారిక నోటిఫికేషన్ |
| ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లై చెయ్యడానికి డైరెక్ట్ లింకు | అప్లై చెయ్యడానికి డైరెక్ట్ లింక్ |
| APPSC అధికారిక వెబ్సైట్ | Andhra Pradesh Public Service Commission |
| అప్లై చెయ్యడానికి డైరెక్ట్ లింకు | https://uchitaudyogasamachar.in/ |
| ఎంప్లాయ్మెంట్ న్యూస్ వీక్లీలు చూడడానికి లింక్ | ఎంప్లాయ్మెంట్ న్యూస్ వీక్లీలు చూడడానికి లింక్ |
Leave a Reply