ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, UPSC, SSC, RRB ,Bank, PSU మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును. ఉద్యోగ పోటీ పరీక్షలకు సంబంధించిన వివరాలు మరియు విజ్ఞానము ప్రస్తుతించబడును.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), 899 ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌ మ్యాన్ తదితర పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్, భారత జాతీయులైన పురుషుల నుండి 899 పోస్టులు భర్తీ చేయడానికి ప్రకటన నెం. 01/2026ను అధికారికంగా విడుదల చేసింది. 18 నుండి 27 సంవత్సరాల వయస్సు గల (నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది) శారీరక సామర్థ్య కలిగి గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతి/12 వ తరగతి మరియూ ఆపసలమైన సాంకేతిక పరిజ్ఞానం/ట్రేడ్ సర్టిఫికెట్ ఉన్న పురుష అభ్యర్థులు 21-05-2026 నుండి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆప్లికేషన్ GREF ఆఫీసులో చెరడడినికి చివరి తేదీ 04-07-2026. . అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, J&K యొక్క లడఖ్ డివిజన్, లాహౌల్ & స్పితి, చంబా, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లోని పాంగి సబ్-డివిజన్కు చెందిన అభ్యర్థులకు 19 జూలై 2026 చివరి తేది.అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌లో ద్వారా (పోస్టల్ సర్వీస్ ద్వారా) కమాండెంట్, GREF సెంటర్, దిఘీ క్యాంప్, పూణే-411015 చిరునామాకు అప్లికేషన్ పంపవలసి ఉంటుంది. పూర్తి వివరాలు మరియు అవసరమైన ఫార్మాట్ లు అధికారిక వెబ్సైట్ https://www.bro.gov.in లో పొందుపరిచారు.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ GREF రిక్రూట్‌మెంట్ 2026 అవలోకనం
సంస్థ పేరుబోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (GREF), రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
ప్రకటన సంఖ్య.01/2026
పోస్ట్ పేరుడ్రాఫ్ట్స్‌మ్యాన్, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్ టెక్నికల్ (SKT), ఆపరేటర్ కమ్యూనికేషన్, ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మెషినరీ (OEM) ఆర్డినరీ గ్రేడ్, ఎలక్ట్రీషియన్  
విభాగంజనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (GREF), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్
మొత్తం ఖాళీలు899 (ESM మరియు PwBD సీట్లతో సహా 6 ట్రేడ్‌లలో)
జీతం స్కేల్ / జీతంపే బ్యాండ్-1, రూ. 5200-20200 మరియు గ్రేడ్ పే రూ. 2800/- (డ్రాఫ్ట్స్‌మ్యాన్) లేదా రూ. 1900/- (మిగతా అన్ని పోస్టులకు); భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిఏ, హెచ్‌ఆర్‌ఏ, రవాణా భత్యం, హార్డ్ & రిస్క్ అలవెన్స్
ఉద్యోగ ప్రదేశంఅఖిల భారత (ముఖ్యంగా ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలు); భారతదేశంలో ఎక్కడికైనా పంపవచ్చు
అప్లికేషన్ మోడ్ఆఫ్‌లైన్‌, పోస్టల్ సర్వీస్ ద్వారా కమాండెంట్, GREF సెంటర్, దిఘీ క్యాంప్, పూణే-411015 చిరునామాకు
ఎంపిక మోడ్రాత పరీక్ష + శారీరక సామర్థ్య పరీక్ష (PET) + వృత్తి పరీక్ష (TT) + ప్రాథమిక వైద్య పరీక్ష (PME) + పత్రాల ధృవీకరణ (DV)
అర్హతభారత జాతీయులైన పురుషులు మాత్రమే
అధికారిక వెబ్‌సైట్https://www.bro.gov.in
అప్లై చెయ్యడానికి చివరి తేది  04 జూలై 2026   ఈశాన్య రాష్ట్రాలు / మారుమూల ప్రాంతాలు అప్లై చెయ్యడానికి చివరి తేది- 19 జూలై 2026  
                                                ముఖ్యమైన తేదీలు
ప్రకటన తేదీ18 ఏప్రిల్ 2026 (ఉద్యోగ వార్తాపత్రిక; వయస్సు లెక్కింపు కోసం)
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ  తేదీ21 మే 2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ (సాధారణ రాష్ట్రాలు)04 జూలై 2026  
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ (ఈశాన్య రాష్ట్రాలు / మారుమూల ప్రాంతాలు)    ,  19 జూలై 2026 (అస్సాం, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ J&K యొక్క లడఖ్ డివిజన్, లాహౌల్ & స్పితి, చంబా, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లోని పాంగి సబ్-డివిజన్)
ఇక్కడ క్లిక్ చేసి ఉద్యోగ పోటీ పరీక్షల్లో మీ కాంపిటేటివ్ లెవెల్ తెలుసుకొండి
                     ట్రేడుల వారీగా ఉద్యోగాల సంఖ్య మరియు విద్యార్హత
పోస్ట్ కోడ్ట్రేడుఉద్యోగాల సంఖ్యవిద్యార్హత
01డ్రాఫ్ట్స్‌మ్యాన్ 42(i)  సైన్స్ సబ్జెక్టులతో 10+2; మరియు (ii) ఆర్కిటెక్చర్ లేదా డ్రాఫ్ట్‌మ్యాన్‌షిప్‌లో రెండు సంవత్సరాల సర్టిఫికేట్, లేదా డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) ట్రేడ్‌లో ఒక సంవత్సరం ఆచరణాత్మక అనుభవంతో కూడిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్
02హిందీ టైపిస్ట్ 10(i)  10+2; (ii) కంప్యూటర్‌పై హిందీలో నిమిషానికి 30 పదాల టైపింగ్ వేగం (ఒక్కో పదానికి 5 కీ డిప్రెషన్‌ల వద్ద 9000 KDPH)
03స్టోర్ కీపర్ టెక్నికల్ (SKT)         300(i)  10+2; (ii) వాహనాలు లేదా ఇంజనీరింగ్ పరికరాల స్టోర్ కీపింగ్ పరిజ్ఞానం. అదనపు అర్హత: స్టోర్స్ విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం, లేదా డిఫెన్స్ సర్వీస్ రెగ్యులేషన్ ప్రకారం స్టోర్‌మ్యాన్ టెక్నికల్ కోసం క్లాస్ II కోర్సు
04ఆపరేటర్ కమ్యూనికేషన్261(i)  మెట్రిక్యులేషన్; (ii) ఐటిఐ నుండి వైర్‌లెస్ ఆపరేటర్ లేదా రేడియో మెకానిక్ సర్టిఫికేట్, లేదా రేడియో టెక్నాలజీ పరిజ్ఞానంతో ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ నుండి డిఫెన్స్ ట్రేడ్ సర్టిఫికేట్, లేదా డిఫెన్స్ సర్వీస్ రెగ్యులేషన్స్ ప్రకారం వైర్‌లెస్ ఆపరేటర్ మరియు కీబోర్డ్ కోసం క్లాస్ I కోర్సు
05ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మెషినరీ (OEM) ఆర్డినరీ గ్రేడ్207(i)  మెట్రిక్యులేషన్; (ii) భారీ మోటారు వాహన డ్రైవింగ్ లైసెన్స్ లేదా డోజర్/ఎక్స్కవేటర్ నడపడంలో ఆరు నెలల అనుభవంతో కూడిన డోజర్/ఎక్స్కవేటర్ డ్రైవింగ్ లైసెన్స్, లేదా రక్షణ సేవా నిబంధనల ప్రకారం ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మెషినరీ క్లాస్ II కోర్సు.  
06ఎలక్ట్రీషియన్ 79(i) మెట్రిక్యులేషన్; (ii) ఎలక్ట్రీషియన్‌గా ఒక సంవత్సరం అనుభవంతో ఐటిఐ లేదా తత్సమాన సంస్థ నుండి ఆటో ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్, లేదా రక్షణ సేవా నిబంధనల ప్రకారం ఎలక్ట్రీషియన్ క్లాస్ 2 కోర్సు.                
ESM ఉద్యోగాల సంఖ్య -134
PwBD ఉద్యోగాల సంఖ్య – 15
మొత్తం ఉద్యోగాల సంఖ్య- 899                
                                           దరఖాస్తు రుసుము
వర్గం         దరఖాస్తు రుసుము
జనరల్ (UR) / EWS / మాజీ సైనికులు / మాజీ అగ్నివీర్లు / OBCరూ. 50/- (తిరిగి చెల్లించబడదు)  
ఎస్సీ / ఎస్టీ   /బెంచ్‌మార్క్ వైకల్యాలు ఉన్న వ్యక్తులు (PwBD)ఏమీ లేదు  
“ఉద్యోగ సమాచార వేదిక” టెలిగ్రాం గ్రూపులో చేరడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
                                 రుసుము  చెల్లింపు విధానం
అభ్యర్థులు తిరిగి చెల్లించబడని దరఖాస్తు రుసుమును కేవలం ఆన్‌లైన్‌లో SBI కలెక్ట్ పోర్టల్ (https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm?corpID=1232156) ద్వారా మాత్రమే కమాండెంట్, GREF సెంటర్, పూణే-411 ​​015 వారి పేరిట చెల్లించాలి. ఇతర చెల్లింపు పద్ధతులు అంగీకరించబడవు. ఈ-రసీదు కాపీని దరఖాస్తు ఫారంతో జతచేయాలి

BRO అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ చూడండి:-

BRO GREF రిక్రూట్‌మెంట్ 2026 కోసం ఎలా దరఖాస్తు చేసే వీధానం
అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి; ఆన్‌లైన్ దరఖాస్తు విధానం అందుబాటులో లేదు. దరఖాస్తు ఫారం మరియు అడ్మిట్ కార్డును అధికారిక BRO వెబ్‌సైట్ (www.bro.gov.in) నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి మరియు వాటిని ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే, పెద్ద అక్షరాలతో నింపాలి. దరఖాస్తు ఫారాన్ని A4 సైజు 75 GSM బాండ్ పేపర్‌పై (ఒక వైపు మాత్రమే) మరియు అడ్మిట్ కార్డును ఒకే పేపర్‌కు రెండు వైపులా ప్రింట్ చేయాలి. అభ్యర్థులు ముందుగా SBI కలెక్ట్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు రుసుము చెల్లించి, ఈ-రసీదు కాపీని జతచేయాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వేర్వేరు దరఖాస్తులను, వేర్వేరు రుసుములతో, వేర్వేరు కవర్లలో పంపాలి. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, దరఖాస్తులను గడువు తేదీకి చాలా ముందే పంపాలని గట్టిగా సూచించడమైనది – పోస్టల్ ఆలస్యాలకు GREF సెంటర్ బాధ్యత వహించదు..నియామక దరఖాస్తు సహాయ

Posted in

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading